BigTV English

Minister Narayana: ఏపీ ప్రజలకు శుభవార్త.. డిసెంబర్ 1 నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం..

Minister Narayana: ఏపీ ప్రజలకు శుభవార్త.. డిసెంబర్ 1 నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం..

Minister Narayana Comments: ఏపీ ప్రజలకు రాష్ట్ర మంత్రి నారాయణ శుభవార్త చెప్పారు. అమరావతి నిర్మాణ పనులను ప్రారంభానికి సంబంధించిన గుడ్ న్యూస్ చెప్పారు. డిసెంబర్ 1 నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్పారు. అమరావతి నిర్మాణానికి రూ. 60 వేల కోట్ల వ్యయం అంచనా వేసినట్లు ఆయన వెల్లడించారు. నాలుగేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు మంత్రి వివరించారు. అదేవిధంగా అమరావతితోపాటు ఏకకాలంలో 26 జిల్లాల అభివృద్ధి చేస్తామన్నారు. లేఅవుట్ లు, భవన నిర్మాణాలకు అనుమతులు సరళతరం చేస్తామన్నారు. నిబంధనలను ఉల్లంఘించకుండా రియల్టర్లు ప్రభుత్వానికి సహకరించాలన్నారు.


దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి బిల్డర్లు హాజరైన క్రెడాయ్ సౌత్ కాన్ – 2024 కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. నిర్మాణ రంగం అభివృద్ధికి అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. బిల్డర్లకు అనుమతుల కోసం ప్రత్యేక సాఫ్ట్ వేర్ తీసుకొస్తామన్నారు. మున్సిపల్ శాఖతో అన్ని శాఖల సాఫ్ట్ వేర్లను అనుసంధిస్తామని చెప్పారు. సింగిల్ విండో అనుమతులకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. అమరావతితోపాటు అన్ని ప్రాంతాల అభివృద్ధి తమ లక్ష్యమని ఆయన స్పష్టమన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా అమరావతి నిలుస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read: జగన్‌కు రోజా ఝలక్? పార్టీ మారేందుకు సన్నహాలు, అక్కడా లక్ పరీక్షించుకొనేందుకు ప్రయత్నాలు


ఇదిలా ఉంటే.. అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ. 15 వేల ఆర్థిక సాయం చేస్తామంటూ పేర్కొన్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి కేంద్ర ఆర్థిక సమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు సమావేశంలో స్పష్టం చేసింది.

Related News

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Big Stories

×