Bigg Boss Telugu 9 28 Day Review: సండే ఫన్ డే వచ్చేసింది. ఆదివారం డే 28వ రోజు వీకెండ్ కావడంతో ఆడియన్స్ డబుల్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు వచ్చేసారు. సండే అంటే ఎలిమినేషన్ తో పాటు ఆటపాట కూడా ఉంటుందనే విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్ ని నామినేషన్స్ సేఫ్ నుంచి స్టార్ట్ చేశాడు నాగ్. మార్కర్, బోర్డుని నామినేషన్ లో ఉన్నవారి ఇచ్చాడు. వారి వారి తలరాతను వారి చేతి రాతే మారుస్తుందంటూ అందరి బోర్డుపై వారి వారితో సేఫ్ అని రాయమని చెప్పాడు. తర్వాత డస్టర్ ఇచ్చి బోర్డు మీద రాసింది చెరిపేయమని చెప్పాడు. ఎవరి బోర్డు మీద అయితే చెరిగిపోకుండ ఉంటుందో వారు సేఫ్. ఈ రౌండ్ లో ఫ్లోరా, సంజనలు సేఫ్ అయ్యారు.
ఆ తర్వాత హౌజ్ లో సేఫ్ గేమ్ ఆడుతున్న రాము రాథోడ్, సుమన్ శెట్టిల బండారం బయటపెట్టాడు నాగ్. నాలుగు వారాలుగా హౌజ్ లో ఎవరిని నొప్పించకుండ.. అందరితో బాగుంటు సేఫ్ గేమ్ ఆడుతున్న వారితో హౌజ్ లో కంటెస్టెంట్స్ నెగిటివ్స్ చెప్పాలని కండిషన పెట్టారు. అలా రాము రాథోడ్.. హౌజ్ లో ఎవరిలో ఎన్ని నెగిటివ్స్ ఉన్నాయని అనిపిస్తోందో వారు పేర్లు చెప్పి వివరణ ఇవ్వాలి. అలా రాము రాథోడ్.. శ్రీజ, హరీష్ శంకర్, సంజన, ఫ్లోరాల పేర్లు చెప్పాడు. శ్రీజ.. ఏ విషయానికి అయినా నోరేసుుని పడిపోతుంది. ప్రతి విషయానికి ఆర్గ్యూ చేస్తుంది. తన మీద కంటే పక్కవాళ్లపై ఫోకస్ పెడుతుంది. తన గేమ్, తన తీరు కంటే కూడా పక్కన వాళ్ల విషయాల్లో ఎక్కువగా దూరిపోతుందని చెప్పాడు. ఇవన్నీ తగ్గించుకుని తన గేమ్ తను ఆడితే బాగుంటుందంటూ చెప్పాడు.
ఆ తర్వాత ఫ్లోరా.. టాస్క్ లు బాగానే ఆడుతుంది. కానీ, ఒక మనిషి తప్పు అయినప్పుడు కూడా వారిక సపోర్టు ఇవ్వడం. వారు ఏది చేస్తే అది కరెక్ట్ అన్నట్టు ఆ మనిషితో ఉంటున్నారు. హౌజ్ లో ఒక మనిషి నచ్చితే మెచ్చుకోవడంతో పాటు తప్పులు ఉంటే కూడా ప్రశ్నించాలి. కానీ, ఫ్లోరా గారు అలా చేయడం లేదు. పైగా ఆమె ఏది చెబితే అది వింటూ సర్వెంట్ లా చేస్తున్నారు. ఒక్క టాస్క్ లో తప్పితే మిగతా ఏ విషయంలో ఫ్లోరా గారు తన నిర్ణయం ప్రకారం ఉండటం లేదు అది తనకు నచ్చడం లేదు అని రాము చెప్పుకోచ్చాడు. అలాగే సంజన గారు ప్రతి విషయంలో దూరిపోవడం, ఏమైనా అంటూ ప్రాంక్స్ చేయడం.. తను ఏది చేస్తే అది కరెక్ట్ అని వాదించడం తనలో ఉన్న అతిపెద్ద నెగిటివిటీ అని చెప్పాడు. హౌజ్ లో తన కోసం తప్పితే ఎదుటి వాళ్ల కోసం ఆలోచించదు అన్నాడు.
ఇక శ్రీజ ఎప్పుడు ఒకరి గురించి నెగెటివ్ గా మాట్లాడుతుంది. నెగిటివ్స్ యే చెబుతుంది కానీ, పాజిటివ్స్ చెప్పదు అనడంతో.. నాగ్ ఓ వీడియో ప్లే చేశాడు. ఫ్లోరాతో సంజనకు సర్వెంట్ లా ఉంటున్నావు.. తను ఏది చెబితే అది చేయాల్సిన అవసరం లేదు. నీ గేమ్ నీ కోసం ఆడు అని చెబుతుంది. సంజన పిలిచి ఇది చేయ్, బట్టలు మడతపెట్టు అని చెబితే చేయను అని చెప్పు అంటూ ఫ్లోరాకి చెబుతున్న వీడియ ప్లే రాము రాథోడ్ చెప్పిన పాయింట్స్ ని శ్రీజ డిఫెండ్ చేసుకునే అవకాశం ఇచ్చాడు నాగ్. ఆ తర్వాత సుమన్ శెట్టిని సేఫ్ గేమ్ పక్కన పెట్టి రియల్ గేమ్ ఆడమంటూ హౌజ్ లో తనకు నచ్చని వాళ్ల పేర్లు చెప్పమన్నాడు.
దీంతో సుమన్ శెట్టి భరణి, రీతూ చౌదరి, తనూజ పేర్లు చెప్పాడు. భరణి.. ఇంతవరకు అసలు గేమ్ లోకి రాలేదు అనిపిస్తోంది. చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారని అనిపిస్తోంది అనగానే.. అసలు భరణి ఆడుతుందే సేఫ్ గేమ్ అంటాడు నాగ్. ఇకనైనా.. దాని నుంచి బయటకు వచ్చి.. గేమ్ ఆడాలని కోరుకుంటున్నా అంటాడు సుమన్ శెట్టి. ఆ తర్వాత రీతూ గురించి చెప్పమనగా.. చాలా మంచి అమ్మాయే కానీ, నోరు కొంచం తగ్గించుకుని అందరితో కలిస్తే బాగుంటుంది. మొదట్లో అన్నయ్య అన్నయ్య అంటూ మాట్లాడేది. కానీ, ఈ మధ్య మాట్లాడటం తగ్గించేసి.. వేరే వాళ్లపై ఫోకస్ పెడుతుంది. అది తగ్గించి మిమ్మల్ని కూడా గుర్తిస్తే బాగుంటుంద అని అంటాడు. దీనికి రీతూ.. అన్నయ్య నామినేట్ చేస్తాడు, అందుకే, నామినేషన్ లో చెప్పే పాయింట్స్ సిల్లీగా ఉంటుందని అని సమాధానం చెబుతుంది. ఆ తర్వాత తనూజ ఏమన్నా గుళాయ్ తెరుస్తుంది. ఏం జరిగిన, ఎవరూ ఎమన్నా ఏడుస్తుంది. ఊరికే ఏడవడం తగ్గించుకుంటే బాగుంటుంది. అలాగే చిన్న చిన్న విషయాలను కూడా సీరియస్ గా తీసుకుని ఆర్గ్యూ చేస్తుంది అని చెప్పాడు.