Sahibzada Farhan Bat: భారత్ అలాగే పాకిస్తాన్ మధ్య ఇప్పుడు పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. ఇటీవల ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరగగా, ఎలాంటి క్రికెట్ మ్యాచ్ లు రెండు దేశాల మధ్య జరగకూడదని ముందుగా అనుకున్నారు. కానీ ఆసియా కప్ 2025 టోర్నమెంట్ కారణంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఏకంగా మూడు మ్యాచ్ లు నిర్వహించాల్సి వచ్చింది. అయితే ఈ మ్యాచ్ ల సందర్భంగా… పాకిస్తాన్ అలాగే ఇండియా ప్లేయర్లు కాస్త రెచ్చిపోయి ప్రవర్తించారని చెప్పవచ్చు. ఈ లిస్టులో పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ కూడా ఉన్నాడు. టీమిండియా ప్లేయర్లు షేక్ అండ్ ఇవ్వలేదన్న ఒక్క కారణంతో.. సూపర్ ఫోర్ దశలో హఫ్ సెంచరీ చేసిన సాహిబ్‌జాదా ఫర్హాన్… వివాదాస్పద సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. తన బ్యాట్ ను ఏకే 47 రేంజ్ లో ఊహించుకొని సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇలా చేసినందుకు ఫర్హాన్ కు మొట్టికాయలు కూడా పడ్డాయి. అయితే తాజాగా ఆ ఫోజు కు సంబంధించిన బ్యాట్లను కూడా రిలీజ్ చేశాడు. దీంతో ఈ వివాదం మరింత రాజుకుంది.
Also Read: Abhishek Sharma Sister Wedding: ఇండియా కోసం త్యాగం…వీడియో కాల్ లో సోదరి పెళ్లి చూసిన అభిషేక్ శర్మ
టీం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్ లో హఫ్ సెంచరీ చేసిన సాహిబ్‌జాదా ఫర్హాన్… ఏకే 47 సెలబ్రేషన్స్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో అతడు చేసిన సెలబ్రేషన్స్ వివాదంగా మారాయి. ఇప్పుడు ఆ ఏకే 47 సెలబ్రేషన్స్ కు సంబంధించిన బ్యాట్స్ తాజాగా రిలీజ్ చేశారు. తాను వాడే బ్యాట్లకు ఏకే 47 సెలబ్రేషన్స్ స్టిక్కర్లు వేయించాడు. అతడు స్వయంగా తయారు చేయించుకున్నాడా? లేక అతని ఫ్యాన్స్ ఈ పని చేశారా? అనేది తెలియదు కానీ… బ్యాట్లు మాత్రం బయటకు వచ్చాయి. ఈ ఏకే 47 బ్యాట్లను పట్టుకొని ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చాడు పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఇది చూసిన ఇండియన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండియాను రెచ్చగొట్టేందుకే ఓపెనర్ ఫర్హాన్ ఇలాంటి పోస్టులు పెడుతున్నాడని మండిపడుతున్నారు. వాడు ఏకే 47 పెడితే, మేం తిలక్ బాంబుతో పాకిస్తాన్ ను లేపేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు ఇండియన్స్. దీనిపై ఐసీసీకి కూడా ఫిర్యాదు చేయాలని టీం ఇండియా అభిమానులు కోరుతున్నారు. మరి దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఏకంగా మూడుసార్లు మ్యాచులు నిర్వహించారు. గ్రూప్ స్టేజీలో ఒకసారి, సూపర్ 4లో మరోసారి ఈ రెండు జట్లు తలపడ్డాయి. అంతేకాదు ఆసియా కప్ ఫైనల్ 2025 టోర్నమెంటులో కూడా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఇక్కడ ప్రత్యేక విషయం ఏంటంటే… ఆడిన 3 మ్యాచ్లను కూడా టీం ఇండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. తొమ్మిదో సారి ఆసియా కప్ 2025 టోర్నమెంట్ గెలుచుకుంది టీమిండియా.
Pakistan lost all three matches against India. two of them complete thrashings. Yet Shahibzada Farhan is celebrating, his “120 SR fifty” with a custom bat sticker like he just won the Asia Cup. No wonder they keep winning only in their dreams, both in war and in cricket. pic.twitter.com/nZn7NkXk42
— Vipin Tiwari (@Vipintiwari952) October 5, 2025