Actress : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అక్క, పిన్ని, అత్త పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన వారిలో సీనియర్ నటి హేమ(Hema) గురించి పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఇటీవల కాలంలో సినిమాలను చాలా వరకు తగ్గించారు. ఇకపోతే గత ఏడాది ఈమె డ్రగ్స్ కేసులో భాగంగా పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. బెంగళూరులో జరిగిన ఒక రేవ్ పార్టీలో భాగంగా హేమ డ్రగ్స్ (Drugs)తీసుకొని పట్టుబడ్డారంటూ పెద్ద ఎత్తున వార్తలు రావడంతో ఈ వార్తలను హేమ తీవ్రస్థాయిలో ఖండిస్తూ తానేమి తప్పు చేయలేదని అసలు తన ఆ పార్టీకి వెళ్లలేదని తెలిపారు.
ఇలా హేమ తాను బర్తడే పార్టీలో లేనని చెబుతున్నప్పటికీ ఈమెపై కేసు నమోదు చేసి బలవంతంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇలా కొన్ని రోజులపాటు జైలులో ఉన్న ఈమె బేయిల్ మీద బయటకు వచ్చారు. అనంతరం ఈ కేసు విచారణలో భాగంగా హేమ తప్పు లేదని తెలియడంతో ఈ గండం నుంచి హేమ బయటపడ్డారు. తన తప్పు లేకపోయిన తన గురించి వార్తలలో ఇష్టం వచ్చినట్లు చూపించారని ఈమె పలు సందర్భాలలో ఎంతో ఎమోషనల్ అయ్యారు. తాజాగా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా హేమ తనకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.
ముఖ్యంగా కరోనా(Corona) సమయంలో తాను చాలా ఇబ్బందులు పడ్డానని తెలియజేశారు. కరోనా సమయంలో డిప్రెషన్(Depression) లోకి వెళ్లిపోయానని, ఆ ప్రభావం నామీద ఉండగానే గత ఏడాది జరిగిన సంఘటన కారణంగా నా తప్పు లేకపోయినా నన్ను నిందించడంతో మరింత కృంగిపోయానని, డిప్రెషన్ ప్రభావం మరింత పెరిగిందని తెలిపారు. ఈ డిప్రెషన్ కారణంగా తనకు ఎవరినైనా చంపేయాలని లేదంటే నేనైనా చచ్చిపోవాలి అనే ఆలోచనలు కూడా వచ్చేవని తెలిపారు. ఇలాంటి ఆలోచనల నుంచి తనని తాను సముదాయించుకొని ఆవేశం కంటే ఓపిక ముఖ్యం అని గ్రహించి మెల్ల మెల్లగా మామూలు స్థితికి వచ్చానని హేమ తెలిపారు. ఇలా డిప్రెషన్ గురించి హేమ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
సినిమా అవకాశాలు రాలేదా…
ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే ఇటీవల కాలంలో హేమ పెద్దగా సినిమాలలో నటిస్తూ వెండి తెరపై కనిపించలేదు. ఒకానొక సమయంలో వరుస సినిమాలలో నటిస్తున్న హేమకు సినిమా అవకాశాలు రాలేదా లేకపోతే ఇటీవల తన వ్యక్తిగత కారణాలవల్లే సినిమాలకు దూరంగా ఉంటున్నారో తెలియదు కానీ సినిమాలను మాత్రం బాగా తగ్గించేసారు. ఇక గత ఏడాది జరిగిన సంఘటనతో ఈమె పూర్తిగా బయట కనిపించడం కూడా అరుదుగా జరుగుతుంది. ఇక ఇప్పుడు డ్రగ్స్ కేసు నుంచి హేమ పూర్తిగా బయటపడటంతో తిరిగి సినిమాలలో అవకాశాలు వస్తే నటిస్తారా లేదంటే సినిమాలకు దూరంగా ఉంటారా అనేది తెలియాల్సి ఉంది.
Also Read: Bahubali The Epic: బాహుబలి ది ఎపిక్.. బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన జక్కన్న?