IND VS PAK Women: మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంటులో ( ICC Womens World Cup 2025 ) అందరూ ఊహించిందే జరిగింది. ఈ టోర్నమెంట్ లో వరుసగా రెండవ విజయాన్ని టీమిండియా కైవసం చేసుకుంది. ఇవాళ కొలంబో వేదికగా ( R.Premadasa Stadium, Colombo ) జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( India Women vs Pakistan Women ) మ్యాచ్ లో హర్మన్ ప్రీత్ కౌర్ టీం పై ( Harmanpreet Kaur ) చేయి సాధించింది. తమ దాయాది దేశమైన పాకిస్తాన్ పై ఏకంగా 88 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది టీమిండియా మహిళల జట్టు. 248 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక దారుణ ఓటమిని చవిచూసింది పాకిస్థాన్ మహిళల జట్టు. క్రాంతి గౌడ్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన నేపథ్యంలో… టీమిండియా అదిరిపోయే విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో కూడా అగ్రస్థానానికి దూసుకు వెళ్ళింది టీం ఇండియా.
మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో పాకిస్తాన్ రెండో ఓటమి చవిచూసింది. ఇప్పటికే బంగ్లాదేశ్ చేతులో ఓడిపోగా ఇప్పుడు టీమిండియా చేతిలో దారుణంగా ఓడిపోయింది పాకిస్తాన్. ఇవాల్టి మ్యాచ్ లో నిర్ణీత 50 ఓవర్లలో 10 వికెట్లు నష్టపోయిన టీమిండియా 247 పరుగులు చేసింది. మొదట్లో తడపడిన టీమిండియా… ఆ తర్వాత పుంజుకుని ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. ఇక ఇటు 248 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో మొదటి నుంచి తడబడుతూనే ఉంది పాకిస్తాన్. అదే సమయంలో టీమిండియా బౌలర్లు కూడా రెచ్చిపోయి బౌలింగ్ చేశారు.
ఈ తరుణంలో 43 ఓవర్లు ఆడిన పాకిస్తాన్ 159 పరుగులు చేసి అలౌట్ అయింది. దీంతో ఏకంగా 88 పరుగుల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుని టీమిండియా. పాకిస్తాన్ ఆటగాళ్లలో ఇద్దరు మినహా ఏ ఒక్క ప్లేయర్ కూడా రాణించలేదు. ఫస్ట్ డౌన్ కు దిగిన సిద్ర అమిన్ 106 బంతుల్లో 81 పరుగులతో రెచ్చిపోయి ఆడింది. అలాగే నటాలియా కూడా 33 పరుగులతో రాణించే ప్రయత్నం చేసింది. పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా తో పాటు మిగిలిన ప్లేయర్లు అందరూ కూడా దారుణంగా విఫలమయ్యారు.
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో హర్మన్ ప్రీత్ కౌర్ జట్టుకు సంబంధించిన బౌలర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా క్రాంతి గౌడ్ పది ఓవర్లు వేసి 20 పరుగులు ఇచ్చి ఏకంగా మూడు వికెట్లు పడగొట్టింది. ఈ మూడు వికెట్లు కూడా చాలా కీలకమైనవి. ఆ తర్వాత మిగిలిన బౌలర్లు కూడా రెచ్చిపోయి బౌలింగ్ చేశారు. దీప్తి శర్మ కూడా మూడు వికెట్లు పడగొట్టగా స్నేహ రానా రెండు వికెట్లు తీసింది. దీంతో పాకిస్తాన్ కకావికులమై ఓడిపోయింది.
Also Read: Abhishek Sharma Sister Wedding: ఇండియా కోసం త్యాగం…వీడియో కాల్ లో సోదరి పెళ్లి చూసిన అభిషేక్ శర్మ
India's 🇮🇳 Sunday hammering to Pakistan 🇵🇰 :
1️⃣- 14th Sept = 🇮🇳 men's win by 7 wickets
2️⃣- 21st Sept = 🇮🇳 men's win by 6 wickets
3️⃣- 28th Sept = 🇮🇳 men's win by 5 wickets
4️⃣- 5th Oct = 🇮🇳 women's win by 88 runsIt's 🇮🇳 4-0 🇵🇰 in just 21 days 😆 #INDWvPAKW pic.twitter.com/ZNaNM1Zr4w
— Richard Kettleborough (@RichKettle07) October 5, 2025