OG 2: పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)హీరోగా డైరెక్టర్ సుజీత్(Sujeeth) దర్శకత్వంలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం ఓజి(OG). ఈ సినిమా ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకోవడమే కాకుండా, బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామి కురుస్తోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. ఈ సినిమా మంచి విజయం అందుకున్న నేపథ్యంలో ఈ సినిమాకు సీక్వెల్, ప్రీక్వెల్ సినిమాలు కూడా రాబోతున్నాయని డైరెక్టర్ సుజీత్(Sujeeth) తో పాటు పవన్ కళ్యాణ్ కూడా వెల్లడించారు.
ఇక ఈ సినిమా వచ్చే ఏడాది చివరిలో ప్రారంభం కాబోతుందని తెలిపారు. ప్రస్తుతం సుజిత్ నాని సినిమా పనులలో బిజీ కాబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే ఓజి 2 పనులు ప్రారంభం కాబోతున్నాయని తెలిపారు. ఇకపోతే తాజాగా దర్శకుడు సుజిత్ తో పాటు సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్(S.S.Thaman) సైతం డాలస్ వెళ్లి అక్కడ ఒక థియేటర్లో ప్రేక్షకులతో కలిసి ఈ సినిమాని చూస్తూ ఎంజాయ్ చేశారు. ఇక ఈ సినిమా అనంతరం దర్శకుడు సుజిత్ మాట్లాడుతూ ఎన్నో విషయాలను వెల్లడించారు. ఓజి 2 గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి. ముఖ్యంగా ఈ సీక్వెల్ సినిమాలో అకీరా(Akira) నటించబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.
ఇక ఇదే విషయం గురించి అభిమానులు డైరెక్టర్ సుజిత్ ను ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుజిత్ సమాధానం చెబుతూ.. ఓజి సినిమాలో అకీరా ఉంటారా? లేదా? అనే విషయం గురించి తాను ఇప్పుడే చెబితే థ్రిల్ ఏముంటుందని ఈయన సమాధానం దాటవేశారు. అయితే ఈయన మాటలను బట్టి చూస్తుంటే కచ్చితంగా అకీరా ఓజి 2 లో ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారని అభిమానులు భావిస్తున్నారు. ఒకవేళ అకీరా నటించకపోయి ఉంటే కచ్చితంగా సుజిత్ లేదని చెప్పేవారు కానీ ముందే చెబితే థ్రిల్ ఏముంటుందని చెప్పారంటే కచ్చితంగా ఆకీరా ఎంట్రీ ఉండబోతుందని ఇదే కనుక నిజమైతే థియేటర్లు తగలబడిపోతాయి అంటూ అభిమానులు భావిస్తున్నారు.
సీక్వెల్ , ప్రీక్వెల్ రెండూ ఉంటాయ్..
ఇక ఓజి సీక్వెల్ , ప్రీక్వెల్ సినిమాలు రెండు కచ్చితంగా ఉంటాయని తెలిపారు. ఈ రెండు సినిమాలు ఒకేసారి షూటింగ్ పనులు జరుపుకుంటాయి కానీ విడుదల మాత్రం ఒకదాని తర్వాత ఒకటి ప్రేక్షకుల ముందుకు వస్తాయని ఈ సందర్భంగా సుజిత్ వెల్లడించారు. ఇక పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించిన ఇలాంటి అప్డేట్ తెలియజేయడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తదుపరి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాని వచ్చే ఏడాది వేసవి సెలవులలో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్టు సమాచారం. ఇక త్వరలోనే నాని సుజిత్ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి. దసరా పండుగను పురస్కరించుకొని బ్లడీ రొమియో సినిమా పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.
Also Read: Samantha: ఫైనల్లీ కొత్త ప్రాజెక్ట్ పై అప్డేట్ ఇచ్చిన సమంత.. త్వరలోనే షూటింగ్ అంటూ!