BigTV English

AP CM Chandrababu : ఏపీలో పొలిటికల్ హీట్… ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీఎం చంద్రబాబు

AP CM Chandrababu : ఏపీలో పొలిటికల్ హీట్… ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీఎం చంద్రబాబు

AP CM Chandrababu : ఆంధ్రప్రదేశ్’లో మళ్లీ రాజకీయాలు మొదలు కానున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏపీలో జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికలపై తెలుగుదేశం అధినేత, సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు త్వరలోనే జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఖారారు చేశారు.


ఆ ఇద్దరు అభ్యర్థులు వీరే…

గుంటూరు, కృష్ణా జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను సెలెక్ట్ చేశారు. మరో స్థానం ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరా బత్తుల రాజశేఖర్ పేరును ఫైనల్ చేశారు.


వచ్చే ఏడాది మార్చి వరకే…

కృష్ణా-గుంటూరు, ఉభయ గోదావరి (పశ్చిమ తూర్పు), ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణ రావు, పాకలపాటి రఘువర్మ, ఇళ్ల వెంకటేశ్వరరావుల పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి 29తో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ఆయా స్థానాలకు ఎన్నికలు జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఓటర్ల జాబితాపై ఇప్పటికే నోటిఫికేషన్ సైతం జారీ చేశారు.

వైసీపీ అప్రమత్తం…

అటు వైసీపీ కూడా ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని, అందివచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకునేందుకు పావులు కదుపుతోంది.  ఇందులో భాగంగానే ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిగా పొన్నూరు గౌతంరెడ్డి పేరును ప్రకటించేసింది.

పవన్’కు వర్మ సెగ…

గత ఎన్నికల సమయంలో పిఠాపురం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు వర్మ సిద్ధపడిపోయారు. అనూహ్యంగా టీడీపీ, జనసేనల పొత్తుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆ సీట నుంచి బరిలోకి దిగారు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకూ సైతం వర్మ ముందడుగు వేశారు. దీంతో హుటాహుటిన వర్మను పిలిపించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ కోసం పనిచేయాలని సూచించారు.

జనసేన అధినేతకు గ్రీన్ సిగ్నల్…

కూటమి ప్రభుత్వం రాగానే ఎమ్మెల్సీని చేస్తామని, మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో జనసేనానికి లైన్ క్లియర్ అయ్యింది. ఫలితంగా వర్మ ఎన్నికల రేసు నుంచి తప్పుకున్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక, రెండు దఫాలుగా ఎంపికైన ఎమ్మెల్సీల జాబితాలోనూ వర్మ పేరు లేకపోవడం గమనార్హం. తాజాగా విడుదలైన రెండో జాబితాలోనూ వర్మ పేరు లేదు. దీంతో ఆయన ఇబ్బందులు పడుతున్నారని, పార్టీపై ఆయన క్యాడర్ అలక వహించినట్లు తెలుస్తోంది.

Also Read : ఐఏఎస్ ప్రశాంతికి పోస్టింగ్ ఇచ్చిన ఏపీ సర్కార్… తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన అధికారిణి

Related News

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Railways: రైల్వే ప్రాజెక్టులపై దృష్టి.. అవన్నీ జరిగితే ఏపీకి తిరుగుండదు

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Big Stories

×