BigTV English

Prabhas: ప్రభాస్ లైఫ్ స్టైల్ ఏంటో తెలుసా.. కార్ కలెక్షన్ చూస్తే మతి పోవాల్సిందే..!

Prabhas: ప్రభాస్ లైఫ్ స్టైల్ ఏంటో తెలుసా.. కార్ కలెక్షన్ చూస్తే మతి పోవాల్సిందే..!

Prabhas.. టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్(Prabhas )కి ప్రపంచ స్థాయిలో ఏ రేంజ్ లో గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఒక రేంజ్ ఫాలోవర్స్ ఉన్న ఈయనకి జక్కన్న రూపొందించిన బాహుబలి సినిమాతో ఆ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ముఖ్యంగా ఆ క్రేజ్ కారణంగానే మేడమ్ టుస్సాడ్ మైనపు మ్యూజియంలో మైనపు విగ్రహం కలిగి ఉన్న తొలి దక్షిణాది నటుడిగా ప్రభాస్ రికార్డు సృష్టించారు. ఇకపోతే ఈ మధ్యకాలంలో చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్ ఇటీవలే నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ నిర్మించిన తాజా చిత్రం కల్కి2898AD. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఏకంగా రూ.1800 కోట్లకు పైగా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు రాబట్టినట్లు సమాచారం.


చేతినిండా చిత్రాలతో బిజీగా మారిన ప్రభాస్..

ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం తదుపరి ప్రాజెక్టుల పైన ఉంచారు ప్రభాస్. అందులో భాగంగానే మారుతీ (Maruthi) డైరెక్షన్లో రాజాసాబ్ (Rajasaab), సీతారామం సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ప్రముఖ డైరెక్టర్ హను రాఘవపూడి (Hanu raghavapudi) దర్శకత్వంలో ఫౌజీ (Fauji)చిత్రాలు చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలు కూడా వచ్చే ఏడాది విడుదల కానున్న విషయం తెలిసిందే. రాజా సాబ్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా హారర్ కామెడీ డ్రామాగా వస్తోందని సమాచారం. అంతేకాదు ఇందులో ప్రభాస్ వింటేజ్ లుక్ లో చాలా అందంగా కనిపిస్తున్నాడు.


విదేశాలలో అప్పుడే మొదలైన ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు..

అక్టోబర్ 23వ తేదీన ప్రభాస్ పుట్టినరోజు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే విదేశాలలో ఈయన పుట్టినరోజు వేడుకలు ప్రారంభం అయ్యాయి. తాజాగా జపాన్ వంటి దేశంలో ప్రభాస్ అభిమానులు ప్రత్యేకంగా రాధే శ్యామ్ సినిమాను రీ రిలీజ్ చేసి ముందుగానే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యంగా పెద్దపెద్ద బ్యానర్లతో ప్రభాస్ కు సర్ప్రైజ్ ఇచ్చారని చెప్పవచ్చు.

ప్రభాస్ ఆస్తులు విలువ..

ఇదిలా ఉండగా ఈ నేపథ్యంలోనే ప్రభాస్ కి సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. అవేంటో ఇప్పుడు చూద్దాం. ప్రభాస్ ఒక్కో సినిమాకు రూ .100 కోట్ల పారితోషకం తీసుకుంటున్నారు. ప్రభాస్ ఆస్తి ఇప్పటి వరకు రూ.3,000 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. అలాగే ఒక్కో బ్రాండ్ ఎండార్స్మెంట్ కి దాదాపు రూ .2 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటారు అని తెలుస్తోంది. అంతేకాదు షూటింగ్ సెట్లో ప్రతి ఒక్కరికి ఇంటి భోజనం అందించే ఈయన కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి సహాయం చేయడంలో ముందుంటారు.

ప్రభాస్ కార్ కలెక్షన్..

ఇక ఈయన దగ్గర ఉన్న కార్ కలెక్షన్ విషయానికి వస్తే.. రోల్స్ రాయిస్ ఫాంటమ్ ఈయన సొంతం. దీని విలువ రూ .8 కోట్లు. అంతేకాదు ఈ మోడల్ కార్ ఇప్పటికే అక్షయ్ కుమార్ (Akshay Kumar), అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan), షారుక్ ఖాన్(Sharukh Khan)వంటి వారి దగ్గర కూడా ఉంది. అలాగే జాగ్వార్ ఎక్స్ జె ఆర్ కారు కూడా ఈయన కారు గ్యారేజీ లో ఉంది.దీని ధర రూ.2.08 కోట్లు. కోటి రూపాయల విలువైన రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కార్ తో పాటు రూ. 6కోట్ల విలువైన లాంబోర్గిని అవెంటడోర్ రోడ్ స్టర్, రూ.68 లక్షల విలువైన బిఎండబ్ల్యూ x3 కార్లు ఈయన సొంతం.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×