BigTV English

Case on Roja : మంత్రి రోజాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు..

Case on Roja : మంత్రి రోజాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు..

Case on Roja :


⦿ ఇంగ్లీష్‌, తెలుగులో చెప్పినా నిజాన్ని దాచలేరు
⦿ అమెరికా దర్యాప్తు సంస్థల కళ్లు మూయలేరు
⦿ అదానీ దగ్గర లంచాలు తీసుకున్నది వాస్తవం
⦿ మాజీ మంత్రి రోజాకు కాంగ్రెస్ సూటి ప్రశ్నలు

అమరావతి, స్వేచ్ఛ:
మాజీ మంత్రి రోజా శెల్వమణి, కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అదానీ ముడుపుల వ్యవహారంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తప్పు చేశారని, ఏపీ పరువు తీశారని కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇందుకు కౌంటర్‌గా రోజా మాట్లాడటంతో మరోసారి కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. రోజా, ఇంతకు ఇది మీ రాతలా ? సాక్షి పంపిన స్క్రిప్టా ? లేక సకల శాఖ మాజీ మంత్రి రాసిందా? తెర వెనుక దాక్కొని మిమ్మల్ని ముందుపెట్టి అబద్ధాలను అందంగా వర్ణించే వాళ్లను కాంగ్రెస్ కొన్ని సూటి ప్రశ్నలు అడుగుతోందంటూ ఎక్స్ వేదికగా 8 ప్రశ్నలు సంధించింది.


సమాధానాలేవీ?
‘ దేశంలో సోలార్ విద్యుత్ ధరలు గణనీయంగా తగ్గుతుంటే 25 ఏళ్ల కాంట్రాక్ట్ ఎందుకు చేశారు? ఐదేళ్ల తర్వాత రూ 1.50 పైసలకే యూనిట్ ధర వచ్చునేమో కదా? ఇతర రాష్ట్రాల ఒప్పందాలను సమీక్షించకుండా ఏకపక్షంగా అదానీ వద్ద రూ. 2.49 పైసలకు ఎందుకు కొన్నారు? అదానీ మీద మీకు అంత ప్రేమ ఎందుకు? 2020 లో గుజరాత్‌లో సోలార్ యూనిట్ ధర కేవలం రూ 1.99 పైసలు మాత్రమే. మరి వెనకబడిన మన రాష్ట్రం అదానీ వద్ద 2021లో 50 పైసలు ఎక్కువ పెట్టి ఎందుకు కొనాల్సి వచ్చింది? ఇది రాష్ట్రం నెత్తిన అధిక భారం మోపినట్లు కాదా? అదానీతో చేసుకున్న ఒప్పందాల్లో ట్రాన్స్మిషన్ చార్జీలు లేవని, రూ 2.49 పైసలకే యూనిట్ ధర పడిందని చెప్పినా వీలింగ్ ఛార్జీలు, GST అన్ని కలిపి యూనిట్‌కి రూ. 4.16 పైసలు పడుతుందని విద్యుత్ రంగ అధికారులే చెబుతున్నారు, ఇది నిజం కాదా? 2021లో సెకీ, ఎన్టీపీసీ సంస్థలు 20 గిగావాట్ల సోలార్ విద్యుత్‌కు పిలిచిన టెండర్లలో రూ. 2.14 పైసలకే పలు కంపెనీలు ముందుకు వచ్చాయన్న సంగతి మీకు తెలియదా?

ఇదెక్కడి బంపరాఫర్?
2021లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో టీపీ సౌర్యా అనే సోలార్ కంపెనీ రూ.2.14 పైసలకు, ఏఐ జోమయ్య అనే కంపెనీ రూ.2.15 పైసలు కోట్ చేసిన సంగతి మీరు గమనించలేదా? 2021లో రాజస్థాన్‌లో NTPC రెన్యువల్ ఎనర్జీ 1750 మెగావాట్ల సోలార్ విద్యుత్ కోసం పిలిచిన టెండర్లలో యూనిట్ ధర రూ. 2.17 పైసలకు ఇచ్చేందుకు ముందుకొచ్చిన సంగతి మీరు చూడలేదా? గుజరాత్‌లో రూ 1.99 పైసలు, రాజస్థాన్‌లో రూ 2.17 పైసలు, మధ్యప్రదేశ్‌లో రూ 2.14 పైసలు, మరి అదే ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రూ. 2.49 పైసలు పెట్టి కొనడం తక్కువ ధరనా? ఇదెక్కడి బంపర్ ఆఫర్? చంద్రబాబు హయాంలో సోలార్ పవర్‌కు ఎక్కువ పెట్టి కొన్నారని అంటున్నారు. 2019లో మీరు అధికారంలో వచ్చాకా దానిపై ఎందుకు దర్యాప్తు జరిపించలేదు? టెండర్లు రద్దు చేశారు సరే, మరి దాని వెనుక మర్మం ఏంటో విచారణ చేయాలి కదా? 5 ఏళ్లు అధికారంలో ఉండి గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారా? అటు తిప్పి, ఇటు తిప్పి ఇంగ్లీష్‌లో చెప్పినా, తెలుగులో చెప్పినా నిజాన్ని మాత్రం దాచలేరు. అమెరికా దర్యాప్తు సంస్థల కళ్లు మూయలేరు. అదానీ దగ్గర మీరు రూ.1750 కోట్లు లంచాలు తీసుకున్నది వాస్తవం. దేశంలో ఎవడు కొనని అదానీ సోలార్ పవర్‌ను ముడుపుల కోసం మీరు కొన్నది వాస్తవం’ అంటూ రోజాకు కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

ఫిర్యాదు
రోజాపై దళిత సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రిపై ఫిర్యాదు చేశారు. దళిత ఉద్యోగిని రోజా అవమానించారని, తగు చర్యలు తీసుకోవాలని దళిత నేతలు డిమాండ్ చేశారు. మంత్రిగా ఉన్నప్పుడు బాపట్ల సూర్యలంక బీచ్‌లో ఉద్యోగి మనోహర్ చేత చెప్పులు మోయించిన విషయాన్ని దళిత నేతలు సీరియస్‌గా తీసుకున్నారు. అప్పట్లోనే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, అధికార పార్టీ ఒత్తిడితితో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో ధైర్యంగా ముందుకొచ్చిన నేతలు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు సరే, రోజాపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×