Rs Praveen Kumar: మంత్రి కొండా సురేఖకు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనుచరులు, స్వేరోస్ వార్నింగ్ ఇచ్చారు. ఖబడ్దార్ కొండా సురేఖ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కొండా సురేఖ.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఆ విమర్శలకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా కౌంటర్ ఇచ్చారు. అయితే తాజాగా స్వేరోస్ అని చెప్పుకుంటూ ఓ వ్యక్తి వీడియో విడుదల చేయగా వైరల్ అవుతోంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై చేసిన విమర్శలకు సమాధానంగా వీడియో చేస్తున్నట్టు చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి స్కూళ్లు, హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతుంది, పిల్లలు ఎందుకు చనిపోతున్నారు అని ఆలోచన చేయకుండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచివారిపై వ్యాఖ్యలు చేసేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. మీది సారాయి కుటుంబం అని కొండా మురళి ఆడవాళ్లపై అగాయిత్యాలు చేసేవారని సంచలన ఆరోపణలు చేశారు.
Also read: తిరుమలలో ఇక రాజకీయ నేతల పప్పులు ఉడకవ్.. నేటి నుంచే ఆ రూల్ అమలు!
మీది నీచమైన కుటుంబం అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై విమర్శలు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంచమైనా బుద్ది జ్ఞానం ఉండాలని విమర్శలు చేయడం మీకు ప్యాషన్ అయిపోయింది అంటూ ఫైర్ అయ్యారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాలలో ఎన్నో సంస్కరణలు చేశారని చెప్పారు. పేదవర్గాలకు చెందినవారిని డాక్టర్లను, పైలెట్లను చేశాడని చెప్పారు.
స్వేరోస్ గురించి మీకు తెలియదని ఇంతకుముందు ఆయనపై విమర్శలు చేసిన వారికి ఎలా సమాధానం చెప్పామో వాళ్లను అడగాలని అన్నారు. ఉరికించి ఉరికించి కొడతామని హెచ్చరించారు. మంత్రి పదవిలో ఉన్నావని, తెలంగాణ ఆడపడుచువని గౌరవిస్తున్నామని వ్యాఖ్యానించారు. మరోసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై విమర్శలు చేస్తే దాడి తప్పదని హెచ్చరించారు.
ఇదిలా ఉంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో ఐపీఎస్ ఆఫీసర్ గా విధులు నిర్వహించారు. ఆ తరవాత విద్య నేర్పించే గురుకులాల బాధ్యతను చూసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను అభిమానించేవాళ్లు చాలా మంది ఉన్నారు. ఆయన చట్టం న్యాయం గురించే ఎక్కువగా స్పీచ్ లు ఇస్తుంటారు. కానీ ఆయన అనుచరులు ఒక మంత్రి, పైగా మహిళ అని చూడకుండా దాడి చేస్తామంటూ హెచ్చరించడం సంచలనంగా మారింది. ఈ వీడియో వైరల్ అవ్వడంతో రాష్ట్రంలో దాడుల సంస్కృతి ఏంటి అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.