Gold Rate Increase: బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. తగ్గినప్పుడు వందలలో తగ్గుతుంది.. కానీ, పెరిగినప్పుడు మాత్రం వేయిలలో పెరుగుతుంది. ఆదివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,12,150 కాగా.. సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,12,580 వద్ద పలుకుతోంది. అలాగే ఆదివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,02,800 ఉండగా.. సోమవారం రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,03,200 వద్ద ఉంది. అంటే నేడు ఒక్కరోజుకు రూ.430 పెరిగిందని చెప్పవచ్చు.
పండుగల వేళ పెరుగుతున్న బంగారం ధరలు..
బంగారం ధరలు రోజూ ఇలా పెరుగుతూనే ఉంటే పసిడి ప్రియులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గత వారం వరుసగా రెండు రోజులు తగ్గడంతో పసిడి ప్రియులు హమ్మయ్య.. బంగారం తగ్గుతుందనుకున్నారు. కానీ, బంగారం ఆశలు కల్పించి మళ్లీ వాటిని తుంచేసిందని గోల్డ్ లవర్స్ సతమతమవుతున్నారు. ముందు ముందు ఇలా పెరుగుతూ పోతే ఇంకా ప్రజలు బంగారం కొనడం కష్టమే అంటున్నారు నిపుణులు.. ప్రస్తుతం పండుగ సీజన్ కావడంతో బంగారం కొనాలని చాలా మంది ఆశపడుతుంటారు. అంతేకాకుండా పండగల సమయంలో పెళ్ళిళ్లు పెట్టుకున్నవారి పరిస్థితి అయోమంగా అయిపోతుంది. వాళ్లు పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లినట్టు అయ్యింది. ఇంతలా ధరలు పెరగడంతో ప్రజలు బంగారం కొనాలంటేనే ఒణికి పోతున్నారు.
రాష్ట్రంలో బంగారు ధరలు..
హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,12,580 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,03,200 వద్ద ఉంది.
విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,12,580 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,03,200 వద్ద పలుకుతోంది.
విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,12,580 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,03,200 వద్ద ఉంది.
ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,12,730 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,03,350 వద్ద కలుగుతోంది.
Also Read: నోటికి ప్లాస్టర్, ముక్కుకి క్లిప్.. లేడీస్ హాస్టల్‌లో స్టూడెంట్ డెడ్‌బాడీ
నేటి సిల్వర్ ధరలు ఇలా..
బంగారం ధరలుకు సమానంగా సిల్వర్ ధరలు కూడా దూసుకెళుతున్నాయి. ఆదివారం కేజీ సిల్వర్ ధర రూ. 1,45,000 ఉండగా సోమవారం కేజీ సిల్వర్ ధర రూ.1,48,000 వద్ద కొనసాగుతోంది. అంటే ఒక్కరోజే సిల్వర్ ధరలు కేజిపై రూ.3000 పెరిగింది. అలాగే కలకత్త, ముంభై, ఢీల్లిలో కేజీ సిల్వర్ ధరలు రూ. 1,38,000 వద్ద కొనసాగుతోంద పలుకుతోంది.