AP Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను నాలుగు దశల్లో జరుపుతామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మంగళవారం అమరావతిలో ఎస్ఈసీ నీలం సాహ్ని మాట్లాడుతూ.. ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదిస్తామన్నారు. ఎన్నికల నిర్వహణను పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 2025 అక్టోబర్ 15 లోగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Also Read: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?
స్థానిక సంస్థల ఎన్నికలను మూడు నెలల ముందుగా 2026 జనవరిలో నిర్వహించేందుకు ఎస్ఈసీ సన్నాహం చేస్తుంది. ఐదేళ్ల పదవీకాలం ముగియడానికి మూడు నెలల ముందుగానే ఎన్నికల నిర్వహణకు చట్టంలో ఉన్న వెసులుబాటును పరిశీలిస్తుంది. ఈ మేరకు ఎస్ఈసీ నీలం సాహ్ని పంచాయతీరాజ్, పురపాలక శాఖల కమిషనర్లకు ఇటీవల లేఖలు సైతం రాశారు. ప్రస్తుత సర్పంచుల పదవీ కాలం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ముగియనుంది. నగరపాలక, పురపాలక సంస్థలు, నగర పంచాయతీ కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవీకాలం 2026 మార్చిలో ముగుస్తుంది. 2026 జనవరిలోనే స్థానిక ఎన్నికలు నిర్వహణకు సాధ్యాసాధ్యాలను ఎన్నికల సంఘం పరిశీలిస్తుంది.