Heart Attack: తెలంగాణలో ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకునే బతుకమ్మ పండుగ.. ఈసారి గ్రామంలో విషాదాన్ని మిగిల్చింది. కొత్తగూడ మండలం ఎంచగూడెం గ్రామంలో.. బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నశెట్టి మౌనిక అనే మహిళ గుండెపోటుకు గురై మృతిచెందింది. పండుగ వాతావరణంలో ఒక్కసారిగా ఈ సంఘటన చోటుచేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
ఎంచగూడెం గ్రామంలోని స్థానిక దేవాలయంలో.. బతుకమ్మ వేడుకలు ఆదివారం ఘనంగా జరుగుతున్నాయి. మహిళలు తమ కుటుంబ సభ్యులతో కలిసి.. ఎంగిలిపూల బతుకమ్మ చుట్టూ పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ ఆనందంగా గడుపుతున్నారు. ఈ క్రమంలో మౌనిక( 38) అకస్మాత్తుగా క్షణాల్లోనే కుప్పకూలిపోయింది.
ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతి
మౌనికకు పరిస్థితి విషమంగా ఉండటంతో.. కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే మార్గం మధ్యలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. వైద్యులు గుండెపోటు కారణంగానే మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు.
పండుగ సంబరాల్లో మహిళ మరణించడంతో.. గ్రామంలో అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. పాటలు, నృత్యాలతో సందడిగా ఉన్న వాతావరణంలో.. ఒక్కసారిగా షాకింగ్ గురించేసింది.
స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. పండుగ వేడుకల్లో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి అవసరమైన సహాయం అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Also Read: G ST 2.O లో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే
ఉత్సవాలకు వెళ్లే ముందు తగినంత విశ్రాంతి తీసుకోవాలి.
అవసరమైతే మందులు వెంట తీసుకెళ్లాలి.
ఎప్పుడైనా అస్వస్థతగా అనిపిస్తే వెంటనే ఆగి సహాయం కోరాలి.