Vizianagaram Sirimanotsavam: విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో.. కీలక ఘట్టమైన సిరిమానోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. చూస్తుండగానే బొత్స కుటుంబ సభ్యులు కూర్చున్న వేదిక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు.
సిరిమానోత్సవం ప్రారంభానికి ముందే.. భారీ వర్షం కురవగా భక్తులు ఇబ్బంది పడ్డారు. వర్షం కారణంగా సిరిమాి ఉరేగింపునకు కాస్త ఆటంకం ఏర్పడింది. కాగా వర్షం కారణంగా వేదిక కూలిందా లేక? స్టేజ్ పై బరువు ఎక్కువ అవడం వల్ల కూలిందా? అన్నవిషయాలు తెలియాల్సి ఉంది.
ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండు రోజులపాటు జరిగి ఉత్సవాలకు.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మొదటి రోజు తొలిరోజు ఉత్సవం జరుగుతుంది. రెండవ రోజు అత్యంత ముఖ్యమైన సిరిమానోత్సవం జరుగుతుంది. పైడి తల్లి అమ్మవారి ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించిన సంగతి తెలిసిందే.
మరోవైపు పైడితల్లి అమ్మవారి దర్శనం సందర్భంగా కూడా బొత్స సత్యనారాయణకు అవమానం జరిగిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. బొత్స కుటుంబసభ్యులు సాధారణ భక్తుల మాదిరిగా అమ్మవారిని దర్శించుకున్నారని చెప్తున్నారు. బొత్స సత్యనారాయణ విషయంలో ఆలయ అధికారులు, పోలీసులు ప్రోటోకాల్ పాటించలేదని ఆరోపిస్తున్నారు. మరోవైపు పైడితల్లి అమ్మవారి పండుగలో రాజకీయాలకు తావుండకూడదని.. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు.