Top Cars Coming Diwali Festive Season: ఈ ఏడాది దీపావళి సందర్భంగా కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి క్రేజీ న్యూస్. భారత ఆటోమొబైల్ మార్కెట్ లో పండుగల సీజన్ కు ముందు పలు కొత్త కార్లు విడుదలకు సిద్ధమవుతున్నాయి. బడ్జెట్ SUVల నుంచి ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లు, హైబ్రిడ్ మోడళ్ల వరకు ఎన్నో కొత్త ఆప్షన్లు వినియోగదారుల ముందుకు రానున్నాయి. వాటిలో టాప్ మోడల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
హ్యుందాయ్ కొత్త బేయాన్ క్రాస్‌ఓవర్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు సమాచారం. దీని ధర సుమారు రూ.12 లక్షల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. లేటెస్ట్ డిజైన్‌తో పాటు పెద్ద టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, వెంటిలేటెడ్ సీట్లు వంటి ఫీచర్లు ఇందులో ఉండే అవకాశం ఉంది.
ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి ఉన్నవారి కోసం MG IM6 కూడా రానుంది. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే దాదాపు 600 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం ఉంటుందని అంచనా. లెవెల్-2 ADAS, ఫోర్ వీల్ స్టీరింగ్, పెద్ద డిస్ ప్లేలు, ఫాస్ట్ ఛార్జింగ్ లాంటి ప్రీమియం ఫీచర్లతో ఇది మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది.
పెద్ద కుటుంబాల కోసం కియా సోరెంటో కూడా ఈ ఏడాది విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. హైబ్రిడ్ టెక్నాలజీ, ఆల్ వీల్ డ్రైవ్, పనోరమిక్ సన్ రూఫ్, బోస్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లతో ఇది ప్రీమియం SUV విభాగంలో పోటీ ఇవ్వనుంది.
భారత మార్కెట్‌లోకి కొత్తగా అడుగుపెట్టనున్న జేఎస్‌డబ్ల్యూ జెటూర్ T2 కూడా ఆసక్తిని పెంచుతోంది. డిఫెండర్ తరహా డిజైన్ తో కనిపించే ఈ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ SUVలో అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, పలు డ్రైవింగ్ మోడ్‌లు ఉండనున్నాయి.
బడ్జెట్ SUV కొనాలనుకునే వారికి టాటా నెక్సాన్ ఫేస్ లిఫ్ట్ బెస్ట్ ఆప్షన్ కానుంది. కొత్త డిజైన్, అప్‌డేటెడ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, లెవెల్-2 ADAS, పెద్ద సన్‌రూఫ్ వంటి మార్పులతో ఈ కారు రానున్నట్లు తెలుస్తోంది.
లగ్జరీ కారు కోరుకునే వారికి 2026 ఆడి Q3 కొత్త డిజైన్, హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఎంపికలతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే వోక్స్‌వ్యాగన్ వర్టస్ ఫేస్‌లిఫ్ట్ కూడా కొత్త డిజిటల్ డిస్‌ప్లే, అప్‌డేటెడ్ ఫీచర్లతో రానుంది.
SUV సెగ్మెంట్‌లో వోక్స్ వ్యాగన్ టైరాన్ కూడా ఈ ఏడాది చివర్లో మార్కెట్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇదే సమయంలో హైబ్రిడ్ టెక్నాలజీతో రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ కూడా వినియోగదారులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది.
Read Also: జస్ట్ 3 నిమిషాల ఛార్జింగ్ తో 250 కి.మీ రేంజ్ ఇచ్చే ఇండియన్ ఈవీ.. ధర జస్ట్ రూ. 4.5 లక్షలే!