E-Paper
Advertisement

శ్రీకాకుళం జిల్లాలో ఘోరం.. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య!

శ్రీకాకుళం జిల్లాలో ఘోరం.. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య!
Advertisement

Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు, మానసిక వేదనలు తట్టుకోలేక ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు బలవన్మరణానికి పాల్పడ్డారు. జలుమూరు మండలం మర్రివలస గ్రామంలో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తల్లితో పాటు ఇద్దరు కుమార్తెలు గడ్డి మందు తాగి ప్రాణాలు తీసుకోవడం ఊరి ప్రజలను కన్నీటిపర్యంతం చేసింది.

కుటుంబంలో వరుస కష్టాలు

Advertisement

మర్రివలస గ్రామానికి చెందిన దాలప్పమ్మ (65) కుటుంబంలో గత కొంతకాలంగా తీవ్ర విషాదాలు, ఇబ్బందులు వెంటాడుతున్నాయి. ఐదు నెలల క్రితమే దాలప్పమ్మ భర్త మరణించడంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇక ఆమె పెద్ద కుమార్తె దాలమ్మ (45)ను భర్త విడిచిపెట్టడంతో, గత 15 ఏళ్లుగా ఆమె పుట్టింటి దగ్గరే ఉంటోంది. చిన్న కుమార్తె సరస్వతి (39) పుట్టుకతోనే అంగవైకల్యంతో బాధపడుతోంది. ఇలా ఒకరి వెనుక ఒకరు ఎదురైన సమస్యలు, తోడుగా ఉండాల్సిన భర్త దూరం కావడం, పెరిగిపోయిన ఆర్థిక ఇబ్బందులతో ఆ కుటుంబం మానసికంగా కుంగిపోయింది.

Also Read: జైలు కూడు వద్దు.. చికెన్, పాస్తా కావాలి.. తీహార్ జైల్లో అమెరికన్ వింత కోరిక!

Advertisement

ఒకేసారి బలవన్మరణం

బ్రతుకు భారంగా మారడంతో ఈ ముగ్గురూ కలిసి ఒకేసారి ప్రాణాలు వదలాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తీవ్ర అస్వస్థతకు గురైన తల్లి దాలప్పమ్మ ఇంటి వద్దనే కన్నుమూసింది. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, కొన ఊపిరితో ఉన్న ఇద్దరు కుమార్తెలు దాలమ్మ, సరస్వతిలను చికిత్స నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ..

రిమ్స్ ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో చేరిన ఇద్దరు కుమార్తెల పరిస్థితి అప్పటికే విషమించింది. వైద్యులు శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఇద్దరు కుమార్తెలు కూడా మృతి చెందారు. ఇలా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు మృత్యువాత పడటంతో మర్రివలస గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Also Read: కాంగ్రెస్ నేతలకు ‘కంటి ఆపరేషన్’ చేయించాలి.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!

పోలీసుల దర్యాప్తు

ఈ ఘోర ప్రమాదంపై సమాచారం అందుకున్న జలుమూరు పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ఆర్థిక, మానసిక బాధల వల్లే ఈ ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నారు.

Related News

అమెరికాలో ఏపీ యువతి మృతి కేసులో బిగ్ ట్విస్ట్.. రూ. 1400 కోట్ల స్కామ్‌తో లింక్?

హైకోర్ట్‌ను ఆశ్రయించిన ‘ప్రశ్న’ రావణ్ భార్య.. అవన్నీ తిరిగి ఇచ్చేయాలంటూ..

రూ.11,569 కోట్ల పెట్టుబడులు.. సోషల్ మీడియాపై ఉక్కుపాదం.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే!

తిరుమల దేవస్థానంలో ఉద్యోగాలంటూ.. రూ.3 కోట్లు స్వాహా, ఏకంగా టీటీడీ లోగోనే వాడేశాడు!

ఏపీలో భారీ ఆలయ చోరీ.. అర్ధరాత్రి చొరబడి కోట్లాది రూపాయల విగ్రహాలు మాయం!

జగన్ ఓపెనైపోయారు.. రావణ్ బంధువులతో మాజీ సీఎం మాటలు, గన్నవరం ఎయిర్‌పోర్టులో సన్నివేశం

ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. ఐదు కేసులు నమోదు- మృతులు, ప్రభుత్వం ఏమంటోంది?

Big Stories

Advertisement
×