E-Paper
Advertisement

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ముంబైలో ఆపరేషన్.. రెండు నెలల తర్వాత మరో సర్జరీ!

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ముంబైలో ఆపరేషన్.. రెండు నెలల తర్వాత మరో సర్జరీ!
Advertisement

Pawan Surgery:ఏపీ డిప్యూటీ సీయం పవన్ కల్యాణ్ కి ముంబైలోని ఒక ప్రముఖ హాస్పిటల్ లో సర్జరీ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయింది.గత కొంతకాలంగా ఆయన రెండు భుజాల రొటేటర్ కఫ్ గాయాలు (Rotator Cuff Injuries) తీవ్రంగా వేదిస్తున్న సంగతి తెల్సిందే. ఇక ఆ నొప్పి మరింత ఎక్కువ కావడంలో వాటికి సర్జరీ చేశారు.

అయితే రెండు భుజాలకి ఒకే సారి సర్జరీ చేస్తే నొప్పి భరించలేకపోవడంతో పాటు, కోలుకోవడానికి ఎక్కువ రోజులు పట్టే అవకాశం ఉండటంతో మొదటగా కుడి భుజానికి ఆపరేషన్ చేశారు.ఇక మరో రెండు నెలల తర్వాత ఎడమ భుజానికి ఆపరేషన్ చేస్తారు.ఇక సర్జరీ జరిగిన తర్వాత పవన్ కోలుకుంటున్నారని, కొన్ని రోజుల పాటు రెస్ట్ అవసరమని సూచించారు వైద్యులు.

Advertisement

డూప్స్ లేకుండా నటించడం వల్లే

అయితే రొటేటర్ కఫ్ సమస్య పవన్ ని ఈ మధ్య నుండి వేదిస్తున్నదని కాదు.కెరీర్ మొదటి నుండి రిస్కీ స్టంట్స్ కి,మార్షన్ ఆర్ట్స్ కి ప్రాధాన్యత ఇచ్చేవాడు పవన్. ఆక్రమంలోనే చేసిన ‘తమ్ముడు’ (1999), ‘బద్రి’ (2000), 2001లో వచ్చిన ‘ఖుషి’సినిమాల్లో డూప్స్ లేకుండా నటించడం వల్లే మొదటిసారి భుజాలకి గాయాలు అయ్యాయి. ముఖ్యంగా త,మ్ముడు సినిమాల్లో చేసిన స్టంట్స్ ని మెగా ఫ్యాన్స్ ఇప్పటికీ మర్చిపోలేరు.ఇక ఆ తర్వాత వచ్చిన గబ్బర్ సింగ్ తో పాటు గోపాల గోపాల సినిమాల షూటింగ్ టైం లోనూ బైక్ రైడ్ సీన్స్ షూటింగ్ టైం లోనూ గాయాల భారిన పడ్డాడు పవన్.అయితే ఆ సమయంలో చిన్నపాటి ట్రీట్ మెంట్ తీసుకున్న పవన్ అలా సినిమా షూటింగ్స్ కంప్లీట్ చేశాడు.కాని ఆ గాయాలు మాత్రం మానలేదు.

Advertisement

also read:ఆ అభిమాని నమ్మకాన్ని అయ్యగారు నిలబెట్టేనా ?

ఎట్టి పరిస్థితుల్లో సర్జరీ చేసుకోవాలంటూ డెడ్ లైన్

ఇక పాలిటిక్స్ లోకి వెళ్ళాక సినిమాలు తగ్గినప్పటికీ,డిప్యూటీ సీయం కావడంతో తీరిక లేకుండా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం,అధికారిక సమీక్షలు, వరద సహాయక చర్యలు, ప్రజా సమస్యల పరిష్కారంలో తీరిక లేకుండా గడపడం, మరో పక్క అడపా దడపా ఒప్పుకున్న సినిమాలు కంప్లీట్ చేయడం, ఈ బిజీలో ఆ గాయాల పట్ల సరైన ట్రీట్ మెంట్ చేయించుకోకపోవడంతో ఆ భుజాలకున్న గాయాలు మళ్ళీ తిరగదోడటం తో ఇక డాక్టర్స్ ఎట్టి పరిస్థితుల్లో సర్జరీ చేసుకోవాలంటూ డెడ్ లైన్ పెట్టింది.

విషెస్ చెబుతున్న అభిమానులు

అలా ఇప్పుడు కుడి భుజానికి సర్జరీ జరగడం, మళ్లీ రెండు నెలల్లో ఎడమ భుజానికి ఆపరేషన్ ఉండటంతో ఆయన పూర్తిగా కోలుకోవడానికి కనీసం మూడు నుండి నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉంది.అంటే అటు ప్రభుత్వ బాధ్యతలకు, ఇటు సినిమా షూటింగ్‌లకు పవన్ కళ్యాణ్ కొన్ని నెలల పాటు దూరం ఉండబోతున్నారన్న మాట.దీంతో పవన్ త్వరగా కోలుకుని మళ్ళీ మునుపటిలా ఉఆక్తివ్ అవ్వాలని సోషల్ మీడియా ద్వారా లక్షలాది అభిమానులు తమ విషెస్ చెబుతున్నారు !

Related News

అల్లు అర్జున్ ఖాతాలో అరుదైన ఘనత!

దసరా బరిలో ‘రణబాలి’.. రిలీజ్ డేట్ లాక్!

మళ్లీ సంక్రాంతికి సిద్ధమవుతున్న తెలుగమ్మాయి.. సక్సెస్ అవుతుందా?

నాగ్ బర్త్ డే ట్రీట్ లోడింగ్.. ఫ్యాన్స్ కు పునకాలే..!

‘ఇరుముడి’తో సంచలనం సృష్టించిన బేబీ నక్షత్ర రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

యంగ్ హీరో సూసైడ్.. హీరోయిన్ చనిపోతుంది.. వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు..

డైరెక్టర్ ప్రయత్నం వృధా అయ్యిందా..? ఆ ఒక్కటే మిస్టేక్ నా..?

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత..

Big Stories

Advertisement
×