E-Paper
Advertisement

కొడుకును కోసం కాళీమాతలా మారే తల్లి… మదర్ సెంటిమెంట్ తో మెంటలెక్కించే థ్రిల్లర్

కొడుకును కోసం కాళీమాతలా మారే తల్లి… మదర్ సెంటిమెంట్ తో మెంటలెక్కించే థ్రిల్లర్
Advertisement

Emotional Drama on OTT : మాతృత్వపు మధురిమను ఆస్వాదించాలని ప్రతి మహిళా కోరుకుంటుంది. కానీ ఆ మాతృత్వం అందినట్టే అంది, అందకుండా పోతే… లేకలేక పుట్టిన కొడుకుని అరుదైన వ్యాధి కబలిస్తే… కొడుకుని కాపాడుకోవడం కోసం ఆ తల్లి ఎంతకి తెగించిందో చూస్తే గుండె తరుక్కుపోవడం ఖాయం. ‘నథింగ్ టు లూజ్’ (Nothing to Lose 2026) అనే టైటిల్ తో వచ్చిన లేటెస్ట్ ఫ్రెంచ్ యాక్షన్ డ్రామా స్టోరీ ఇదే. మరి ఈ మూవీ తెలుగులో ఉందా ? ఏ ఓటీటీలో చూడవచ్చు ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఇందులో మన కథానాయిక పేరు జాడా. ఆమె స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్. తన పార్టనర్ తో కలిసి ఎన్నో కష్టాలు, పోరాటాల తర్వాత ఎంబ్రియో డొనేషన్ ద్వారా ఒక కొడుకుకు జన్మనిస్తుంది. ఆ కొడుకు పేరు నోవా. జాడా ఒంటరి తల్లిగా తన బిడ్డను చాలా ప్రేమతో, కష్టపడి పెంచుతూ ఉంటుంది. కానీ ఒక రోజు నోవాకు లుకేమియా అంటే బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించడంతో ఆమె ప్రపంచం ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. నోవా ప్రాణాలు దక్కాలంటే అర్జెంట్‌గా బోన్ న్యారో ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ చేయాలి.

Advertisement

కానీ ఇక్కడే ఊహించని ట్విస్ట్ వచ్చి పడుతుంది. నోవా ఆమె సొంత బయాలాజికల్ కొడుకు కాదు. కాబట్టి అతనికి సరిపోయే డోనర్‌ ను కనుగొనడం అత్యంత కష్టంగా మారుతుంది. ఆమె డాక్టర్లను, హాస్పిటల్ యాజమాన్యాన్ని, మెడికల్ సిస్టమ్‌ను అన్నింటినీ అడిగి అడిగి అలసిపోతుంది. కానీ సమయం తక్కువగా ఉండటంతో జాడా చట్టాలను, నిబంధనలను బ్రేక్ చేస్తూ తన కొడుకుకు అసలు పేరెంట్ ఎవరు ? అతనికి సరిపోయే డోనర్‌ ను ఎవరు ? అన్నది వెతకడం మొదలు పెడుతుంది.

ఈ ప్రయాణంలో ఆమె ఎన్నో అపాయాలు, చట్టపరమైన సమస్యలు ఎదుర్కొంటుంది. ఒక తల్లి తన బిడ్డ కోసం ఎంతటి సాహసానికైనా వెనకాడదని జాడా చూపిస్తుంది. ఆమె ఒంటరిగా మెడికల్ సిస్టమ్, గోప్యతా నిబంధనలు, అధికారుల ఒత్తిళ్లతో పోరాడుతూ తన కొడుకు జీవితాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. మరి ఆమెకు ఈ జర్నీలో ఎదురైన ఇబ్బందులు ఏంటి ? చివరికి ఆ తల్లి తన కొడుకు ప్రాణాలను కాపాడగలిగిందా ? అసలు ఆ బిడ్డ ఒరిజినల్ పేరెంట్స్ ఎవరో తెలుసుకుందా ? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమాపై ఒక లుక్కేయండి.

Advertisement

Also Read : ఫీల్డ్ ట్రిప్పుకెళ్తే పిశాచి దాడి… చిన్న పొరపాటుతో ప్రాణాల మీదకు

తెలుగు స్ట్రీమింగ్ ?

‘నథింగ్ టు లూజ్’ మూవీ క్రైమ్ యాక్షన్ డ్రామా కాదు… కొడుకు ప్రాణాలను కాపాడుకోవడం కోసం సింగిల్ మదర్ చేసే హార్ట్ టచింగ్ ఫైట్. 2026లో విడుదలై నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ఫ్రెంచ్ క్రైమ్ యాక్షన్-డ్రామాకు నవెల్ మదానీ, లుడోవిక్ కోల్బో-జస్టిన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తెలుగులో అందుబాటులో లేదు. కానీ ఫ్రెంచ్, ఇంగ్షీషు భాషలలో స్ట్రీమింగ్ అవుతోంది.

Tags

Related News

ఏడేళ్లుగా కనిపించని ప్రేయసి… ఆమె ఆచూకీ చెప్పే మాంత్రిక జీవులతో ప్రయోగం… ఓటీటీలోకి వచ్చిన వింత సిరీస్

బంగారం కోసం సముద్రంలో ప్రాణాంతక వేట… నిధి కోసం నిలువునా ముంచేసే కన్నింగ్ గాళ్ళు… ఊపిరి బిగబట్టి చూడాల్సిన అడ్వెంచర్ థ్రిల్లర్

చిన్ననాటి స్నేహితుల ముసుగులో ద్రోహం… ప్రపంచాన్ని కాపాడేందుకు ప్రాణాలకు తెగించే ఏజెంట్… జాన్ సీనా యాక్షన్ అడ్వెంచర్

దెయ్యాలనే బంధువులుగా భావించే వింత మనిషి… నవ్విస్తూ, ప్రేమలో ముంచెత్తే మలయాళం ఫాంటసీ మూవీ ఓటీటీలోకి

పోలీసులకు హింట్ ఇచ్చి మరీ చంపే కిల్లర్… ట్విస్టుల మీద ట్విస్టులు… సీజన్ 2 రచ్చ షురూ

గ్రామ దేవత ప్రతిరూపంగా భావించే దున్నపోతు… బలిచ్చే రోజే మిస్సింగ్… రవితేజ సోదరుడి కొడుకు మూవీ స్ట్రీమింగ్

దొంగతనాలు చేసే అమ్మాయికి సీక్రెట్ స్పై మిషన్… టార్గెట్ కొడుకుతోనే ప్రేమలో… క్రేజీ కొరియన్ థ్రిల్లర్

అంగారకుడిపై మనుషుల శరీరాలను ఆక్రమించే దుష్టశక్తులు… హాలీవుడ్ హర్రర్ థ్రిల్లర్ నెట్‌ఫ్లిక్స్‌లో

Big Stories

Advertisement
×