E-Paper
Advertisement

హైకోర్ట్‌ను ఆశ్రయించిన ‘ప్రశ్న’ రావణ్ భార్య.. అవన్నీ తిరిగి ఇచ్చేయాలంటూ..

హైకోర్ట్‌ను ఆశ్రయించిన ‘ప్రశ్న’ రావణ్ భార్య.. అవన్నీ తిరిగి ఇచ్చేయాలంటూ..
Advertisement

Anusha Petition: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన ప్రశ్న రావణ్ అరెస్ట్ వ్యవహారం ఇప్పుడు న్యాయస్థానానికి చేరింది. తన భర్తను ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిందని, విచారణ పేరుతో తమ కుటుంబాన్ని తీవ్ర వేధింపులకు గురిచేస్తోందని రావణ్ భార్య అనూష ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆమె హైకోర్టులో ఒక రిట్ పిటిషన్‌ను దాఖలు చేశారు.

కక్ష సాధింపు చర్యలే.. అనూష ఆవేదన

Advertisement

ప్రభుత్వం కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తన భర్తపై అక్రమ కేసులు బనాయించిందని అనూష తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎటువంటి తప్పు చేయకపోయినా రావణ్‌ను అన్యాయంగా అరెస్ట్ చేశారని, ఆ తర్వాత విచారణ అంటూ పోలీసులు తమను మానసికంగా వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

సోషల్ మీడియా ప్రచారానికి అడ్డుకట్ట వేయాలి

Advertisement

తన భర్త ప్రతిష్టను దెబ్బతీసేలా సోషల్ మీడియా వేదికల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై అనూష తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రావణ్ పై ఎలాంటి ఆధారాలు లేకుండా సాగుతున్న ఈ డిజిటల్ ప్రచారాన్ని తక్షణమే నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. దీనిపై తగిన చర్యలు తీసుకునేలా సైబర్ క్రైమ్ పోలీసులను ఆదేశించాలని హైకోర్టును అభ్యర్థించారు.

Also Read: పాపాల భైరవుడిని ఫామ్‌హౌస్‌లో బంధించాం.. ఇక విముక్తి లేదు.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

డేటా దుర్వినియోగంపై ఆందోళన

తమ నివాసంలో సోదాల పేరుతో పోలీసులు స్వాధీనం చేసుకున్న వ్యక్తిగత వస్తువులపై అనూష కోర్టులో స్పష్టమైన డిమాండ్లు చేశారు. స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కీలక పత్రాలు, బ్యాంక్ స్టేట్‌మెంట్లను వెంటనే తమకు తిరిగి అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ల్యాప్‌టాప్స్, మొబైల్స్‌లోని వ్యక్తిగత డేటాను పోలీసులు దుర్వినియోగం చేసే అవకాశం ఉందన్న ఆందోళనను వ్యక్తం చేశారు. ఆ డేటాను ఎవరూ యాక్సెస్ చేయకుండా, దుర్వినియోగానికి తావులేకుండా ఉండేందుకు వీలుగా ‘క్లోన్డ్ కాపీ లాగ్’ (Cloned Copy Log) ను తమకు అందించాలని పిటిషన్‌లో స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఈ పిటిషన్ హైకోర్టు పరిధిలో ఉండటంతో, న్యాయస్థానం ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Also Read: రూ.11,569 కోట్ల పెట్టుబడులు.. సోషల్ మీడియాపై ఉక్కుపాదం.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే!

Related News

ఏకగ్రీవాలకు అంగీకరిస్తే.. వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవ్.. వైసీపీ నేతలకు జగన్ వార్నింగ్

జోగి రమేశ్ వ్యాఖ్యలపై కోడలు కౌంటర్.. సజ్జల కాలాయపన, గుట్టంతా బయటపెట్టిన మేఘన

Supreme Court: వైసీపీకి సుప్రీంకోర్టులో ఝలక్.. రిట్ పిటిషన్ డిస్మిస్, కనీసం వాదనలు వినేందుకు..

ఒకే ఫ్యామిలీకి చెందిన ఐదుగురు ఆత్మహత్య.. శ్రీశైలంలో దారుణమైన ఘటన, అసలు ఏం జరిగింది?

ఈడీ రిమాండ్ రిపోర్టులో షాకింగ్ విషయాలు.. కారుమూరి చుట్టూ ఉచ్చు, నెక్ట్స్ ఎవరో తెలుసా?

‘యువతులను ట్రాప్ చేస్తున్నారు’.. ఏపీ ప్రభుత్వానికి రాజాసింగ్ కీలక హెచ్చరిక

ఎవరిని బెదిరిస్తావ్.. నీ రెడ్ బుక్‌ను మడిచి పెట్టుకో!.. నారా లోకేష్‌పై జోగి రమేష్ ఫైర్!

తిరుపతిలో కలకలం.. హోంమంత్రి అనితపై పడ్డ డ్రోన్.. చేతికి గాయం!

Big Stories

Advertisement
×