AP Deputy CM Pawan Kalyan: పారిస్ ఒలింపిక్స్ లో భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ కాంస్య పతకాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. రెజ్లర్ సెహ్రావత్ ఒలింపిక్స్ లో పతకాన్ని సాధించడం తనకు ఆనందాన్ని కలిగించిందన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. అమన్ కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నట్లు అందులో స్పష్టం చేశారు. రెజ్లింగ్ విభాగంలో భారత క్రీడాకారుల ప్రతిభ అద్భుతమంటూ ప్రశంసించారు. వినేశ్ ఫొగాట్ దురదృష్టవశాత్తూ ఫైనల్ పోటీకి దూరమయ్యారని ఆయన పేర్కొన్నారు. సెహ్రావత్ పతకం సాధించడంతో క్రీడాభిమానులు సంతోషంగా ఉన్నారంటూ డిప్యూటీ సీఎం తెలిపారు.