Modi In Srisailam: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో పర్యటిస్తున్నారు. ఉమ్మడి కర్నూల్‌లోని శ్రీశైలంలో భక్తులకు అభివాదం చేస్తూ ఆలయంలోకి ప్రవేశించి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. దర్శనం చేసుకున్న అనంతరం సుమారు 30 నుంచి 40 నిమిషాల పాటు ఆలయాన్ని పర్యటించారు. దీంట్లో ప్రధాని మోదీ వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటి సీఎం పవన్ కళ్యాన్ పాల్గొన్నారు. మరికొద్ది సేపట్లో.. రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా 13వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనతో పాటు వివిధ అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు చేయనునట్టు తెలిపారు. సాయంత్రం 4 గంటల సమయంలో.. జీఎస్టీ 2.O విజయం అనే దాని మీ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభకు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం 7వేల మంది పోలీసుల సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.