Deepika Padukone: తమ అభిమాన నటీనటులను చూడాలని, మాట్లాడాలని అందరికి ఉంటుంది. ఇప్పుడు అలాంటి అవకాశమే ఇస్తోంది దీపికా పదుకొనె. ఇకపై ఈ బాలీవుడ్ బ్యూటీతో ఎప్పుడైన, ఎక్కడైన మాట్లాడోచ్చు, చాట్ చేయొచ్చు. అదేలాగో ఇక్కడ చూడండి!బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన దీపికా ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా రెండు భారీ ప్రాజెక్ట్స్ని నుంచి ఆమెను తొలగించడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
ఈ క్రమంలో దీపికా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ముఖ్యంగా తన వర్కింగ్ అవర్స్ కండిషన్స్‌తో దర్శక–నిర్మాతలకు షాకిస్తుంది. తన దగ్గరికి వచ్చిన వారికి వర్కింగ్ అవర్స్‌తో పాటు రెమ్యునరేషన్ నెంబర్‌తో చుక్కలు చూపిస్తుంది. దీంతో ప్రస్తుతం ఆఫర్ కోసం దీపికా దగ్గరికి వెళ్లాలంటే దర్శక–నిర్మాతలు జంకుతున్నారు. ఇలా తరచూ కాంట్రవర్సీలతో వార్తల్లో నిలుస్తోంది. కానీ, దీపికా మాత్రం అవేవి పట్టించుకోకుండ తన పని తను చేసుకుంటూ వెళ్లిపోతుంది. ఎవరేమి, ఎవరేన్ని అనుకున్న ముజే జరా బీ ఫరక్ నయ్ పడ్తా అంటుంది. అలా అని తన కండిషన్స్ విషయంలోనూ తగ్గడం లేదు. ప్రస్తుతం హిందీలో షారుక్ ఖాన్ కింగ్ మూవీలో హీరోయిన్గా నటిస్తోంది.
ఇలా ఇండస్ట్రీ, సోషల్ మీడియాలో ఎంతగా ట్రోల్స్ ఎదుర్కొంటుందో మరోవైపు రికార్డ్స్ కూడా అందుకుంటుంది. మెంటల్ హెల్త్ అంబాసిడర్ కేంద్ర ఆరోగ్యశాఖతో కలిసి వర్క్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆమెను నేషనల్ మెంటల్ హెల్త్ అంబాసిడర్‌గా కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే. దీంతో దీపికాకు ఇండియాలోనే తొలి మహిళగా అరుదైన గౌరవం దక్కింది. ఇప్పుడు దీపికా అంతర్జాతీయ స్థాయిలో మరో గౌరవాన్ని దక్కించుకుంది. ఇకపై ఇంటర్నేషనల్ వైడ్‌గా దీపికా ప్రతిఒక్కరితో చాటింగ్ చేయడంతో పాటు మాట్లాడనుంది కూడా. అదేలా అంటే ఇటీవల మెటా ఏఐ ప్రత్యేక చాట్‌బాట్ యాప్‌ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.
Also Read: Daksha OTT: ఓటీటీకి వచ్చేస్తోన్న మంచు లక్ష్మి మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే
దీనిని ద్వారా వివిధ రకాల టెక్ట్స్, ఇమేజ్, వీడియో డేటాతో శిక్షణతో మీరు అడిగిన ప్రశ్నపై విస్తృత స్థాయిలో సమాచారం ఇవ్వబోతోంది. అయితే ఇప్పుడు మెటా ఏఐకి దీపికా తన వాయిస్ ఇవ్వబోతుంది. మెటాతో ఆమె టై అప్ అవుతుంది. దీంతో ఇకపై ఏఐ మెటా ద్వారా దీపికా ఎక్కడైన, ఎప్పుడైన మాట్లాడుతుంది. మీకు కావాల్సింది ప్రాంప్ట్లను అందిస్తే చాలు మాట్లాడేస్తుంది. ఎలాంటి అంశమైన మీతో లోతుగా తెలుసుకోవాలనుకుంటే విశ్లేషణ కూడా చేస్తుంది. ఇప్పుడు ఇవన్ని దీపికా పదుకొనె వాయిస్తో మీరు వినేయచ్చు. ఆమెతో ఎప్పుడైనా మాట్లాడవచ్చు. కానీ, ఆమె వాయిస్ ఏఐ ఆధారంగా మాత్రమే మీకు అందుబాటులో ఉంటుంది.
వాయిస్ ఇన్‌పుట్స్‌తో మెటా ఏఐ అసిస్టెంట్ పనిచేస్తుంది. ఇకపై దానికి దీపికా వాయిస్ కూడా తొడవుతుంది. అంటే మీ స్నేహితులతో మాట్లాడినట్టుగానే ఎప్పుడైన, ఎక్కడైన మాట్లాడోచ్చు. అయితే ఇప్పటికే మెటా ఏఐ వాయిస్తో పలువురు హాలీవుడ్ ప్రముఖుల వాయిస్ అందుబాటులో ఉన్నాయి. ఇకపై దీపికా వాయిస్తో కూడా మెటా ఏఐ ద్వారా వినిపించనుంది. అయితే ఇండియా నుంచి మాత్రం కేవలం దీపికా వాయిస్ మాత్రమే అందుబాటులోకి రానుంది. దీంతో తొలి భారతీయ నటిగా దీపికా ఈ అరుదైన ఘనత అందుకుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది. ఇప్పుడు మెటా AI తో భాగమయ్యాయని, దీంతో భారతదేశం, యునైటెడ్ స్టేట్స్, కెనడా, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ అంతటా తన వాయిస్ని ఇంగ్లీష్లో చాట్ చేయవచ్చని ఆమె చెప్పింది.