Hyderabad cricket Association: క్రికెటర్ల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేశారన్న తీవ్ర ఆరోపణలతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) సెలక్షన్ కమిటీ సభ్యులపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాబబుల్స్ లీగ్స్‌లో అవకాశం కల్పించేందుకు సెలక్షన్ కమిటీ సభ్యులు డబ్బులు డిమాండ్ చేశారని పలువురు క్రికెటర్ల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. మెుత్తం 13 లీగ్స్ లో తమ పిల్లల్ని ఒక్క దాంట్లో కూడా సెలెక్ట్ చేయలేదని.. టాప్ బ్యాట్స్‌మెన్‌ను కూడా మిడిల్ ఆర్డర్‌లో ఆడించారన్నారు. ఎన్సీఏ క్యాంపులో డివిజన్ లో ఆడిన వాళ్లను కూడా కావాలనే ఆడించకుండా వాళ్లకు డబ్బులు ఇచ్చిన వాళ్లకే అవకాశాలు ఇచ్చారని తల్లిదండ్రులు పేర్కొన్నారు. దీంతో పోలీసులు సెలక్షన్ కమిటీ చైర్మన్ హబీబ్ అహ్మద్, సభ్యులు సందీప్ రాజన్, సందీప్ త్యాగి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.