భారతీయులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వందేభారల్ స్లీపర్ ఎక్స్ ప్రెస్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఈ రైళ్లకు సంబంధించిన రూట్ల రైల్వే బోర్డు ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా వందేభారత్ స్లీపర్ రైలు కోసం ఉపయోగించే ఏసీ కోచ్ లను రష్యన్ కంపెనీ కైనెట్ రైల్వే సొల్యూషన్స్ ఆవిష్కరించింది. నాలుగు బెర్త్ కంపార్ట్ మెంట్లు, USB పోర్ట్ లు, ప్రైవసీ లేఅవుట్లు, ఆకట్టుకునే ఇంటీరియర్ తో వావ్ అనిపిస్తున్నాయి. ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభవాన్ని అందించేలా ఈ కోచ్ లను తీర్చిదిద్దింది. న్యూఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ రైల్వే పరికరాల ప్రదర్శన 2025లో కైనెట్ రైల్వే సొల్యూషన్స్ వందే భారత్ స్లీపర్ రైలు కోసం మొదటి AC కోచ్ డిజైన్‌ను ఆవిష్కరించింది.
వందేభారత్ స్లీపర్ రైళ్ల కోచ్ ల తయారీ ప్రాజెక్ట్ కు సంబంధించి కైనెట్ రైల్వే సొల్యూషన్స్ తో పాటు TMH, RVNL కీలక ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం 120 వందే భారత్ స్లీపర్ ట్రైన్ సెట్లను తయారు చయనున్నాయి. మొత్తం 1920 కోచ్ ల తయారీకి సంబంధించి BEML కైనెట్, టిటాగఢ్ BHEL కన్సార్టియం ఒప్పందాలు జరిగాయి.
ఫస్ట్ AC కోచ్ లో ప్రైవసీ, సౌకర్యానికి క్కువ ప్రాధాన్యత ఇచ్చారు. నాలుగు బెర్త్ ల కంపార్ట్ మెంట్ ఉంది. ఇన్ బిల్ట్ USB పోర్ట్ లతో పాటు పర్సనల్ రీడింగ్ లైట్లు ఉన్నాయి. ఇవి ప్రయాణీకుల సౌలభ్యాన్ని మరింత పెంచనున్నాయి. ఈ కోచ్ లో పై బెర్తులకు ఎక్కేలా మెట్లు ఉన్నాయి. ఇవి కింది వారికి ఎలాంటి ఇబ్బంది కలిగించవు. మెట్ల క్రింద ఉన్న స్థలాన్ని కూడా వ్యక్తిగత వస్తువులను ఉంచుకునేలా ఏర్పాటు చేశారు.
Read Also: వావ్.. 7 వేల కిలోమీటర్ల బుల్లెట్ రైలు కారిడార్, అదిరిపోయే న్యూస్ చెప్పిన అశ్విని వైష్ణవ్!
ఇంటీరియర్ డిజైన్ సాఫ్ట్ టోన్ లను కలిగి ఉంది. చూడగానే ఆకట్టుకునే లుక్ తో వావ్ అనిపిస్తున్నాయి. గోధుమ, ఆరెంజ్ కలర్ కూడిన కోచ్ అద్భుతంగా డిజైన్ చేశారు. ఇక AC కోచ్ నమూనా జూన్ 2026 నాటికి ఆవిష్కరించబడుతుందని భావిస్తున్నారు. లాతూర్ లోని ఫ్యాక్టరీతో పాటు మరాఠ్వాడ రైల్ కోచ్ లో వీటిని తయారు చేయనున్నట్లు తెలుస్తోంది. రెండు యూనిట్లు పూర్తిగా సిద్ధమైన తర్వాత ఒకేసారి రెండు వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించాలని భారతీయ రైల్వే భావిస్తోంది. దీర్ఘకాలిక కార్యకలాపాలకు మద్దతుగా ఢిల్లీ, బెంగళూరులో శాటిలైట్ సౌకర్యాలతో జోధ్ పూర్ లో మెయింటెనెన్స్ డిపోలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే, వందేభారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: రాపిడో ఇక సరికొత్తగా.. ఇకపై బస్సు, రైలు, విమాన, హోటల్ బుకింగ్ చేసుకోవచ్చు!