BigTV English

Tirumala: తిరుమల కొండపై సీఎంఓ పెత్తనమా? బదిలీ వెనుక కారణం ఇదేనా.!

Tirumala: తిరుమల కొండపై సీఎంఓ పెత్తనమా? బదిలీ వెనుక కారణం ఇదేనా.!
Advertisement

Tirumala: టీటీడీ ధర్మకర్తల మండలి అధికారులు కలిసి తీసుకున్న నిర్ణయాన్ని ఏకంగా సీఎంఓను అడ్డుపెట్టుకుని సీనియర్ అధికారులు ధిక్కరించేలా వ్యవహరిస్తున్నారు. తమ బదిలీలని పై నుంచి పైరవీలు చేయించుకుంటూ అధికారులు ఆపుకోవడం ఇప్పుడు టీటీడీలో చర్చనీయాంశంగా మారింది. టీటీడీ పాలకమండలి ఉన్నతాధికారులు కంటే తామే బలమైన వారిమన్న సంకేతాలు పంపుతున్నారన్న చర్చ నడుస్తోంది. అసలు వారిని ఎందుకు బదిలీలు చేయాల్సి వచ్చింది? బదిలీలకు బ్రేక్ వేసుకుంటుండంపై టీటీడీ రియాక్షన్ ఏంటి?


టీటీడీ ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటామన్న చంద్రబాబు
కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన వెంటనే టీటీడీ ప్రక్షాళన దిశగా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు తిరుమలలో ప్రకటించారు. అందులో బాగంగా ప్రభుత్వంలో మొట్ట మొదటి పోస్టింగ్ కూడా శ్యామలరావుకు ఈఓగా అవకాశం కల్పించారు. ఆ క్రమంలో ప్రక్షాళణ జరగాలంటే ఖచ్చితంగా గత ప్రభుత్వంలో పాలు పంచుకున్న వారినందరిని కీలక పోస్టులకు దూరంగా ఉంచాలని నిర్ణయించారు.

అన్న ప్రసాదాలలో కల్తీ నెయ్యి వినియోగం ఆరోపణలు
స్వామి వారి అన్నప్రసాదాలలో కల్తీ నెయ్యి వినియోగం వంటి ఆరోపణలతో పాటు వివిధ కారణాలతో కీలక అధికారులను బదిలీ చేయాల్సి ఉంది. అయితే శ్యామలరావు బదిలీలు చేయకుండానే తన కోటరీని తెచ్చుకున్నారు..అవిదంగా ఎస్టేట్ అఫీసర్ తో పాటు ఎస్వీబిసిలో అధికారులు అదనంగా వచ్చారు. ధర్మకర్తల మండలి రానంతవరకు శ్యామలరావు హవా నడిచింది. తర్వాత ధర్మకర్తలి మండలి ఏర్పడి గతంలో పనిచేసిన వారిని దూరంగా ఉంచాలనే ప్రతిపాదన తీసుకు వస్తే ఈఓ తనకున్న పలుకుబడితో అడ్డుకున్నారు.


చైర్మన్ నాయుడిని ఏకవచనంలో సంభోదించిన ఈఓ
అయితే ఇది చిలికి చిలికి గాలి వానలా మారింది..సాక్షాత్తూ సియం ఎదుటే ఏకంగా ఈఓ శ్యామలరావు చైర్మన్‌ నాయుడుపై ఎక వచన ప్రయోగం చేసారు.అయితే తర్వాత పరిణామాలలో 15 నెలల తర్వాత ఈఓ శ్యామల రావు బదిలీ అయ్యారు. బ్రహోత్సవాల విజయవంతంగా ముగిసిన తర్వాత ప్రస్తుతం సీనియర్ డిప్యూటీ ఈఓను బదిలీ చేస్తూ ఈఓ అనిల్ కూమార్ తో పాటు దర్మకర్తలి మండలి చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. అయితే అక్కడే వివాదం రేగింది. హెచ్ అర్ విభాగం డిప్యూటి ఈఓగా ఉన్న అధికారిపై అనేక వివాదాలు ఉన్నాయి.

పెండింగ్లో 50కి పైగా వారసత్వ ఉద్యోగాల పోస్టింగులు
ముఖ్యంగా తల్లితండ్రులు మరణించిన తర్వాత వారి సంతతికి ఉద్యోగాలు ఇవ్వాల్సిన కేసుల్లో సూమారు 50 మంది పైగా ప్రతిరోజు కార్యాలయం చుట్టు తిరుగుతున్న పరిస్థితి నెలకొంది. దీనికి కారణం హెఆర్ అధికారే అన్న ఆరోపణలున్నాయి. వేద పారాయణ దారుల నియాయకం విషయంలో ఆయన తమిళులకు ప్రాధాన్యత ఇచ్చారంట. సుమారు 700 మంది నియామకాన్ని కూడా అపివేశారు. దీంతో పాటు తిరుమల టెంపుల్ డిప్యూటి ఈఓ,అన్నదానం డిప్యూటి ఈఓ ,అర్ వన్ ,కళ్యాణ కట్టు,గోవిందరాజస్వామి ఆలయం, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉన్న డిప్యూటి ఈఓలను బదిలీ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభావితం చేయడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయంట..

సీఎంఓ పేరును వాడుకుంటూ హడావుడి..
ముఖ్యంగా టెంపుల్ డిప్యూటి ఈఓగా బదిలీ అయిన వ్యక్తికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో సీఎంఓ పేరును వాడుతున్నట్లు తెలుస్తోంది..ఏనిమిది మంది డిప్యూటి ఇవోల బదిలీల విషయంలో ఇంత రాద్దాతం చేస్తున్న టీటీడి అధికారులు గత ప్రభుత్వంలో అడిషనల్ ఇవో ధర్మారెడ్డి చెప్పినట్లు నడుచుకున్నారు. అప్పట్లో ప్రమోషన్ల విషయంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని తెలిసినప్పటికి నోరు విప్పలేదు. దీంతో పాటు ప్రభుత్వ అనుకూల పత్రికలలో సైతం ధర్మకర్తల మండలి నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రచారం చేయించి బదిలీలు అక్రమం అన్నట్లు చెబుతున్నారంట.

Also Read: 9వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు మిస్సింగ్..

45 మందిపై చర్యలకు విజిలెన్స్ సిఫార్సు
విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ మెంట్ విభాగం వివిధ ఆరోపణలకు సంబంధించి 45మందిపై చర్యలు తీసుకోవాలని సిఫార్సులు చేసింది. వాటిని అమలు చేయడానికి ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది. అయితే ముందుగా సీనియర్ అధికారులు 8 మందిని బదిలీ చేయలేని పరిస్థితుల్లో… ఆ 45 మంది పై చర్య తీసుకోలేని దుస్థితి నెలకొందని టీటీడీలో టాక్ వినిపిస్తోంది. దాంతో టిటిడి సిబ్బందిలో పాలక మండలి. ప్రభుత్వం అంటే లెక్కలేని తనం పెరుగుతుందని పరిశీలకులు అంటున్నారు.మొత్తం మీదా సీఎంఓ పేరు చెప్పి హాడావుడి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అంటున్నారు . చూడాలి మరి టీటీడీ పాలకవర్గం, ప్రభుత్వ ఎలాంటి చర్యలు తీసుకుంటాయో?

Story By Apparao, Bigtv

Related News

Jagan: జగన్ ఇరుక్కుపోయారా? ఫారెన్ టూర్‌ చిక్కులు.. రంగంలోకి సీబీఐ, ఇప్పుడెలా?

PM Modi: నేడు ఏపీలో ప్రధాని మోదీ పర్యటన.. మినిట్ టు మినిట్ షెడ్యూల్ ఇదే..

AP Excise Suraksha App: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై నకిలీ మద్యానికి చెక్

Modi To Kurnool: ఏపీకి రూ.13,400 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు.. కర్నూలు పర్యటనపై ప్రధాని మోదీ ట్వీట్

Kakinada SEZ Controversy: కాకినాడ సెజ్ రైతులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్

Guntur: దారుణం.. రన్నింగ్‌ ట్రైన్‌లో మహిళపై దుండగుడు అత్యాచారం!

Amaravati News: త్వరలో ఏపీకి భారీ పెట్టుబడులు.. ప్రిజనరీకి-విజనరీకి అదే తేడా-మంత్రి లోకేష్

Big Stories

×