Big TV Account Block:ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ-2025 వ్యవహారం చుట్టూ రగులుతున్న చర్చ ఇప్పుడు మరో మలుపు తిరిగింది. ప్రశ్నపత్రం, అక్రమాల ఆరోపణలు అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన డీఎస్సీ ఇష్యూ.. ఇప్పుడు బిగ్ టీవీ సోషల్ మీడియా అకౌంట్ బ్లాక్ చేసే స్థాయికి వెళ్ళిపోయింది.
దీనికి తోడు #BlockedBIGTVForAskingDSC అనే హ్యాష్‌ట్యాగ్ ఇండియా ట్రెండింగ్‌లో టాప్‌లో కనిపించడంతో అసలు ఏం జరుగుతోందన్న చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది.
బిగ్ టీవీకి సంబంధించిన సోషల్ మీడియా పోస్టుల్లో డీఎస్సీ అంశంపై ప్రశ్నలు లేవనెత్తినందుకే అకౌంట్‌ను బ్లాక్ చేశారనే ఆరోపణలు ఇపుడు నెట్టింట వెల్లువెత్తుతున్నాయి.
అయితే నిజంగా అకౌంట్ ఎందుకు బ్లాక్ అయింది? ఎవరి ఫిర్యాదు మేరకు చర్య జరిగింది? ప్లాట్‌ఫామ్ నిబంధనల కారణమా? లేక డీఎస్సీపై చేసిన పోస్టులే కారణమా? అన్నదానిపై ఇప్పటివరకు పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం సహజం. మీడియా ప్రశ్నలు అడగడం కూడా సహజమే. మరి ప్రశ్న అడిగితే సమాధానము చెప్పాలి, కానీ ఇలా బ్లాక్ చేయడం ఏంటి అంటూ ? అంటూ ఆంద్రప్రదేశ్ సర్కార్ ని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.
నిజానికి డీఎస్సీపై అనుమానాలు ఉంటే వాటిని కియర్ చేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంటుంది. ‘‘అన్నీ క్లియర్.. ఎలాంటి సమస్య లేదు’’ అని ఆధారాలతో చెప్పొచ్చు. కానీ ప్రశ్నకు సమాధానం బదులు బ్లాక్ అనే మాట వినిపిస్తే.. సహజంగానే మరిన్ని ప్రశ్నలు పుట్టుకొస్తాయి.
ఇక #BlockedBIGTVForAskingDSC హ్యాష్‌ట్యాగ్ ఇండియా ట్రెండింగ్‌లో నంబర్ వన్ స్థానంలో కనిపించడం కూడా చర్చకు కారణమైంది. డీఎస్సీ అంశం మీద ఒక మీడియా సంస్థకు మద్దతుగా ఇంత పెద్ద ఎత్తున సోషల్ మీడియా క్యాంపెయిన్ రావడం ఆసక్తికరంగా మారింది.
ఒకవైపు డీఎస్సీపై ప్రశ్నలు.. మరోవైపు బిగ్ టీవీ అకౌంట్ బ్లాక్ అనే ప్రచారం.. మధ్యలో ప్రభుత్వంపై సోషల్ మీడియా సెటైర్లు.. మొత్తానికి ఏపీ పాలిటిక్స్‌లో కొత్త డిజిటల్ వార్ మొదలైనట్టే కనిపిస్తోంది.
అసలు పారదర్శకంగా ఉండే ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటి? ”మీరే ప్రశ్నలు అయినా వేసుకోండి ,తడబడకుండా సమాధానాలు చెబుతాం” అనే విధంగా ఉండాలి. ఎందుకంటే ప్రశ్నను ఆపేయడం కంటే ప్రశ్నకు సమాధానం ఇవ్వడం చాలా ఈజీ కద. ముఖ్యంగా డీఎస్సీ లాంటి లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న వ్యవహారంలో ప్రతి అనుమానానికీ క్లారిటీ ఇవ్వడం చాలా ముఖ్యం కూడా.
ఇక్కడ మరో ప్రశ్న కూడా వస్తోంది. ఒక మీడియా సంస్థ అకౌంట్ నిజంగానే బ్లాక్ అయి ఉంటే.. దానికి కారణం ఏంటి? ప్రభుత్వానికి సంబంధం లేకుండా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ స్వతంత్రంగా తీసుకున్న చర్య అయితే ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పొచ్చు. ఏదైనా ఫిర్యాదు ఆధారంగా చర్య జరిగితే.. దాని వివరాలు ఏమిటో చెప్పొచ్చు. అప్పుడు ఈ రచ్చకు కూడా ఫుల్‌స్టాప్ పడుతుంది కూడా .
కానీ క్లారిటీ లేకపోతే మాత్రం.. ‘‘ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తారా?’’ అనే ప్రశ్నలు ఉత్పన్నం అవడం సహజం .. డీఎస్సీపై ప్రశ్న అడిగితే అకౌంట్ బ్లాక్.. రేపు ఇంకెవరైనా మరో ప్రశ్న అడిగితే వారి పరిస్థితి ఏంటి? అంటూ నెటిజన్లు ఇప్పటికే సెటైర్లు వేస్తున్నారు
Also read :DSC స్కామ్‌పై ప్రభుత్వం ఎందుకు మౌనం..?
మొత్తానికి డీఎస్సీ వివాదం ఎక్కడ మొదలైందో.. ఇప్పుడు సోషల్ మీడియా బ్లాక్ వ్యవహారం దగ్గరికి వచ్చి ఆగింది. ఆరోపణలు నిజమా? అపోహలా? బ్లాక్ వెనుక అసలు కారణం ఏంటి? అన్నది మాత్రం ఆయా వర్గాలు క్లియర్ చేయాల్సిందే. లేకపోతే ఈ వ్యవహారంతో ఆంద్రప్రదేశ్ ప్రజానీకం ముందు కూటమి సర్కార్ పలుచన కావడం పక్కా !