BigTV English

AP: ఏపీలో కీలక పరీక్షలు.. ఈ డేట్స్ రాసి పెట్టుకోండి..

AP: ఏపీలో కీలక పరీక్షలు.. ఈ డేట్స్ రాసి పెట్టుకోండి..

AP: 2023-24 విద్యా సంవత్సరంలో ఉన్నత విద్యలో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షలకు గడువు సమీపిస్తోంది. వివిధ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ను ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా 8 ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను ఏపీ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఆ డిటైల్స్ చూద్దాం.


AP EAPCET..
ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈఏపీసెట్‌ను జేఎన్‌టీయూ అనంతపురం నిర్వహించనుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు ఏప్రిల్‌ 14తో ముగియనుంది. హాల్‌టికెట్లను మే 9 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఏపీఈఏపీ సెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్ష మే 15 నుంచి 18 వరకు జరుగుతుంది. అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్ష మే 22 నుంచి 23 వరకు జరగనుంది.

AP ICET..
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్‌ ఈ ఏడాది శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నిర్వహించనుంది. దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్‌ 19 వరకు కొనసాగుతుంది. మే 20 నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష మే 24, 25 తేదీల్లో జరుగుతుంది.


APECET..
ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ను కాకినాడ జేఎన్‌టీయూ నిర్వహించనుంది. ఈ పరీక్ష ద్వారా పాలిటెక్నిక్ డిప్లొమా అభ్యర్థులకు వచ్చే సంవత్సరంలో బీఈ/ బీటెక్‌/ బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ విధానంలో రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు ఏప్రిల్‌ 10తో ముగుస్తుంది. ఏప్రిల్‌ 28 నుంచి టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మే 5న పరీక్ష జరుగుతుంది.

AP PGECET..
ఏపీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్ ను తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ నిర్వహించనుంది. ఎంటెక్‌, ఎంఫారస్మీ, ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్‌ 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. మే 22న హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మే 28 నుంచి 30 వరకు పరీక్ష జరుగుతుంది.

AP PECET..
వ్యాయామ విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్షను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నిర్వహించనుంది. రెండేళ్ల వ్యవధి గల బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షకు మే 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. మే 27 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఫిజికల్‌ ఎఫిషియెన్సీ, గేమ్స్‌ స్కిల్‌ టెస్ట్‌ మే 31 నుంచి నిర్వహిస్తారు.

AP EdCET..
బీఈడీ, బీఈడీ (స్పెషల్‌) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ను ఆంధ్రా యూనివర్సిటీ నిర్వహించనుంది. ఏప్రిల్‌ 23 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 12 నుంచి హాల్‌టికెట్లు పొందొచ్చు. మే 20న ప్రవేశ పరీక్ష జరుగుతుంది.

AP LAWCET..
మూడు, ఐదేళ్ల ఏపీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీ పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఏప్రిల్‌ 22 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. హాల్‌టికెట్లు మే 15 నుంచి అందుబాటులో ఉంటాయి. మే 20న ఏపీ లాసెట్‌, ఏపీ పీజీఎల్‌సెట్‌ పరీక్ష జరగనుంది.

AP PGCET..
ఏపీలోని పలు విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ పీజీ కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ సెట్‌ను ఆంధ్రా యూనివర్సిటీ నిర్వహించనుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ మే 11తో ముగుస్తుంది. జూన్‌ 1 నుంచి హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచుతారు. పరీక్షలు జూన్‌ 6 నుంచి 10 వరకు జరుగుతాయి.

Related News

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Railways: రైల్వే ప్రాజెక్టులపై దృష్టి.. అవన్నీ జరిగితే ఏపీకి తిరుగుండదు

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Big Stories

×