Deepika Padukone: దీపికా పదుకొనే (Deepika padukone).. బాలీవుడ్ స్టార్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న ఈమె గత కొన్ని రోజులుగా నిత్యం వార్తల్లో నిలుస్తూ నెగిటివిటీని ఎదుర్కొంటోంది. బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ అక్కడే సెటిలైపోయిన ఈమె.. అనూహ్యంగా ప్రభాస్ (Prabhas), నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్లో వచ్చిన ‘కల్కి 2898AD’ సినిమా చేసి ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. దీనికి తోడు ఇందులో ‘సుమతి’ అనే పాత్రతో అందరినీ ఆకట్టుకుంది. ఇకపోతే ఈ సినిమా సీక్వెల్లో కూడా ఈమె హీరోయిన్గా నటిస్తోంది అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమా అయిపోయిన వెంటనే ఈమె మళ్లీ ప్రభాస్ సినిమాలో అవకాశం దక్కించుకుంది. అయితే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga). వీరిద్దరి కాంబినేషన్లో ‘స్పిరిట్’ మూవీ తెరకెక్కుతుండగా మొదట దీపికానే అనుకున్నారు. కానీ ఈమె పెట్టిన డిమాండ్స్ కారణంగా అతడు సినిమా నుంచి ఆమెను తప్పించాడు. అయితే అప్పట్లో ఆమె అప్పుడే బిడ్డకు జన్మనివ్వడంతో ఆమె అడిగిన కోరికలలో తప్పులేదు అని చాలామంది ఆమెకు అండగా నిలిచారు. అయితే ఇప్పుడు రీసెంట్ గా ‘కల్కి 2’ నుండి కూడా దీపికాను తప్పించడంతో దీపికాపై నెగెటివిటీ బాగా పెరిగిపోయింది. అలా ట్రోల్స్ బాగా వస్తున్న నేపథ్యంలో ఇటీవల ఒక పోస్ట్ పెట్టి..”మనం ఎవరితో పని చేస్తున్నామనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని.. ఇది తనకు షారుక్ ఖాన్ గత కొన్ని సంవత్సరాల క్రితమే నేర్పించారు” అంటూ రూమర్స్ కి ఇండైరెక్టుగా చెక్ పెట్టింది.
భారీగా పెరిగిపోతున్న నెగిటివిటీ..
ప్రస్తుతం అల్లు అర్జున్ (Allu Arjun) – అట్లీ (Atlee) కాంబినేషన్లో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా అవకాశం అందుకుంది. ఇక్కడ ఆమె డిమాండ్ చేసినంత రెమ్యూనరేషన్ కూడా ఈ చిత్ర నిర్మాత ఇవ్వడానికి ముందుకు వచ్చారు. కానీ ఈమె పాత్రను కొన్ని సీన్స్ కి మాత్రమే పరిమితం చేసినట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో నెగెటివిటీ ఏ రేంజ్ లో పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు.
హాలీవుడ్ కి పయనమైన దీపిక..
అలాంటి ఈమె ఇప్పుడు మళ్లీ హాలీవుడ్ కి పయనం అయిందని సమాచారం. ఇప్పటికే తన తొలి హాలీవుడ్ మూవీ ‘ట్రిపుల్ ఎక్స్ : రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్’ సినిమాతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. 2017లో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు సీక్వెల్ తో రాబోతోంది. ఇందులో దీపికా మరోసారి భాగం కాబోతున్నట్లు సమాచారం.
దీపికాకు అండగా హాలీవుడ్ బృందం..
ఇక్కడ ఊహించని ట్విస్ట్ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఈమె ప్రస్తుతం బిడ్డ ఆలనా పాలనా చూసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఈ సినిమా షూటింగు ముంబైలో చేయమని కోరడంతో హాలీవుడ్ టీం కూడా ఓకే చెప్పిందట. త్వరలో దీనికి సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు..
దీపిక తన రేంజ్ ఏంటో చూపించబోతోందా?
ఏది ఏమైనా సౌత్ సినీ ఇండస్ట్రీలో ఇటు నార్త్ సినీ ఇండస్ట్రీలో తనకు పూర్తి వ్యతిరేకత నెలకొన్న నేపథ్యంలో వీరందరికీ తన రేంజ్ ఏంటో చూపించడానికి.. ఏకంగా హాలీవుడ్ చిత్ర బృందాన్ని ఇక్కడికే రప్పించి ముంబైలోనే షూటింగ్ చేసేలా ప్లాన్ చేస్తోంది అంటూ ఇది విన్న నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.. ఏది ఏమైనా మాతృత్వం పై తనకున్న బాధ్యతలను ఆమె ఇలా నెరవేర్చుకుంటోంది. దీనిని తప్పుపట్టాల్సిన పనిలేదు అంటూ కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి అయితే హాలీవుడ్ లోకి మళ్ళీ అడుగుపెడుతున్న ఈ ముద్దుగుమ్మ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.