BigTV English

VC Sajjanar: తెలంగాణలో IAS, IPS ల బదిలీలు.. హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్

VC Sajjanar: తెలంగాణలో IAS, IPS ల బదిలీలు.. హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్

VC Sajjanar: తెలంగాణలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్‎ల బదిలీలు జరిగాయి. ఆరుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులు, 23 మంది ఐపీఎస్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‎గా సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ నియమితులయ్యారు. హైదరాబాద్ సీపీగా ఉన్న సీవీ ఆనంద్‎ను హోంశాఖ సెక్రటరీగా అపాయింట్ చేసింది ప్రభుత్వం.


మొన్నటి వరకు ఇంటెలిజెన్స్ చీఫ్‎గా ఉన్న శివధర్ రెడ్డి.. డీజీపీగా బాధ్యతలు చేపట్టడంతో ఇంటెలిజెన్స్ బాధ్యతలను విజయ్ కుమార్‎కు అప్పగించింది ప్రభుత్వం. ఫైర్ డీజీగా పని చేస్తోన్న నాగిరెడ్డిని ఆర్టీసీ ఎండీగా ట్రాన్స్‎ఫర్ అయ్యారు. ఇటీవల వరుస వివాదాలల్లో చిక్కుకుంటున్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆయనను స్పెషల్ సెక్రటరీగా నియమించింది. రాజన్న సిరిసిల్ల కలెక్టర్‎గా హరిత నియమితులయ్యారు.

ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌గా రఘునందన్ రావు, వ్యవసాయ శాఖ కార్యదర్శిగా సురేంద్ర మోహన్‌, జీఏడీ పొలిటికల్ సెక్రటరీగా రిజ్వీ, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా శిఖా గోయల్, గ్రేహౌండ్స్ ఏడీజీగా అనిల్ కుమార్, పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా స్టీఫెన్ రవీంద్ర, ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డి, ఫైర్ డీజీగా విక్రమ్ సింగ్‌, హైదరాబాద్ క్రైమ్ అడిషనల్ సీపీగా శ్రీనివాసులు, హైదరాబాద్ అడిషనల్ శాంతిభద్రతలను సీపీగా తసఫీర్ ఇక్బాల్ అపాయింట్ అయ్యారు.


Also Read: జలదిగ్భందంలో హైదరాబాద్.. మునిగిన ముసారాంబాగ్ బ్రిడ్జి

వెస్ట్ జోన్ డీసీపీగా సీహెచ్ శ్రీనివాస్, సిద్దిపేట సీపీగా విజయ్ కుమార్, నారాయణ పేట్ ఎస్పీగా వినీత్‌‌, ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా సింధు శర్మ, రాజేంద్ర నగర్ డీసీపీగా యోగేష్ గౌతమ్ మాదాపూర్ డీసీసీగా రీతిరాజ్, ఎల్బీ నగర్ డీసీపీగా అనురాధ నియమితులయ్యారు.

Related News

Hyderabad Rains Today: వర్షం కారణంగా ఉప్పొంగిన ముసీ నది.. చాదర్‌ఘాట్ బ్రిడ్జ్ మూసివేత

Hyderabad Rains: జలదిగ్భందంలో హైదరాబాద్.. మునిగిన ముసారాంబాగ్ బ్రిడ్జి

Rain Update: ముంచుకోస్తున్న ముప్పు.. మరో రెండు రోజులు భారీ వర్షాలు..

KTR: తెలంగాణ ప్రజలపై రూ.15వేల కోట్ల భారం.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ సంచలన ఆరోపణలు

Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. నార్శింగ్-హిమాయత్‌‌సాగర్ సర్వీస్ రోడ్డు క్లోజ్..

Weather News: మరో రెండు రోజుల భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన, బయటకు వెళ్తే అంతే సంగతులు

BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు.. ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ

Big Stories

×