విమాన ప్రమాదాలు అనేవి తరచుగా జరుగుతూనే ఉంటాయి. కొన్నిసార్లు ఈ ప్రమాదాల్లో చాలా మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోతుండగా, మరికొన్నిసార్లు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన సందర్భాలున్నాయి. అయితే, ప్రపంచంలో ఆయా ఎయిర్ లైన్స్ తమ ప్రయాణీకులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రయత్నిస్తుండగా, కొన్ని ఎయిర్ లైన్స్ మాత్రం అత్యంత ప్రమాదకరమైనవిగా గుర్తింపు తెచ్చుకున్నాయి. అలాంటి వాటిలో ఒకటి కాంగోలోని ఎయిర్ లైన్స్. ఇవి ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైనవిగా గుర్తింపు తెచ్చుకున్నాయి. ఎందుకంటే.. అవి అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలకు ఏమాత్రం సరిపోవు. యూరోపియన్ యూనియన్(EU) ఎయిర్ సేఫ్టీ లిస్ట్ ప్రకారం, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC), రిపబ్లిక్ ఆఫ్ కాంగో (ROC) లోని అన్ని ఎయిర్ లైన్స్ EUలో నిషేధించబడ్డాయి. 2025 జూన్ నాటికి, DRCలోని 142 ఎయిర్ లైన్స్, ROCలోని 5 ఎయిర్ లైన్స్ మోస్ట్ డేంజరస్ లిస్ట్ లో ఉన్నాయి.
⦿ అధిక ప్రమాదాలు
ఏవియేషన్ సేఫ్టీ నెట్ వర్క్ డేటా ప్రకారం.. 1945 నుంచి ఆఫ్రికాలో అత్యధిక ప్యాసింజర్ ప్లేన్ ప్రమాదాలు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో జరిగాయి. 2010 నుంచి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో గ్లోబల్ ప్రమాదాలలో 4% కలిగి ఉంది. అదే సమయంలో దాని ఎయిర్ ట్రాఫిక్ ప్రపంచంలో కేవలం 0.1% మాత్రమే కావడం విశేషం.
⦿ భద్రతా సమస్యలు
దేశం పరిమాణం, భూభాగం, బలహీనమైన నియంత్రణలు, పాత విమానాలు, మౌలిక సదుపాయాల కొరత వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
⦿ ఇంటర్నేషనల్ ర్యాంకింగ్
ICAO డేటా ప్రకారం, గత దశాబ్దంలో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో గ్లోబల్ గా అత్యంత దారుణమైన రికార్డులను కలిగి ఉంది. 2019లో గోమాలో జరిగిన ప్రమాదంలో ఏకంగా 27 మంది మరణించారు.
కాంగోకు చెందిన అన్ని ఎయిర్ లైన్స్ మీద యూరోపియన్ యూనియన్ బ్యాన్ విధించింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేవనే కారణంతో ఈ నిర్ణయం తీసుకుంది. కాంగో ఎయిర్ వేస్, కంపెనీ ఆఫ్రికన్ డి ఏవియేషన్, కొరోంగో ఎయిర్ లైన్స్, కెనడియన్ ఎయిర్ వేస్ కాంగో, ఈక్వా ఫ్లైట్ లాంటి సంస్థలకు చెందిన విమానాలపై నిషేధం విధించింది. తమ పౌరులు ఎవరూ ఈ విమానాల్లో ప్రయాణించకూడదని వెల్లడించింది.
Read Also: స్వర్గాన్ని తలపించే 10 రహస్య దీవులు, ఎక్కడో కాదు.. ఇండియాలోనే!
ఒకవేళ కాంగోలో ప్రయాణించాలంటే.. ఎలాంటి స్థానిక ఎయిర్ లైన్స్ ను ఉపయోగించకూడదని ఆయా దేశాలు తమ పౌరులకు సూచించాయి. బదులుగా, ఇంటర్నేషనల్ క్యారియర్లు అయిన ఎథియోపియన్ ఎయిర్ లైన్స్, కెన్యా ఎయిర్ వేస్ లాంటి విమానాల ద్వారా కనెక్టింగ్ ఫ్లైట్లు సెలెక్ట్ చేసుకోవాలంటున్నాయి. UKతో పాటు ఇతర దేశాలు కూడా కాంగో ఎయిర్ లైన్స్పై హెచ్చరికలు జారీ చేశాయి.
Read Also: భారత పర్యాటకులకు మాస్కో సాదర స్వాగతం, కారణం ఏంటో తెలుసా?