ఈ నేపథ్యంలో మూసారాంగ్ బ్రిడ్డిపైకి వాహనాలను పోలీసులు రెవెన్యూ అధికారులు నిలిపివేశారు. భారీ వర్షాలకు ఉస్మాన్ సాగర్ నిండిపోవడంతో.. పైనుంచి నీటని దిగివ ప్రాంతాలకు వదలడంతో.. అంబర్‌పేట్ లోని మూసారాంగ్ బ్రిడ్జి పైనుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో కాచీగూడ ట్రాఫిక్ పోలీసులు బ్రిడ్జిపై భారీ కేడ్‌లు ఏర్పాటు చేసి వాహనాలను పూర్తిగా నిలిపివేశారు. దిల్‌షుక్ నరగ్ నుంచి వచ్చే వాహనాలను గోల్ నాక కొత్త బ్రిడ్జి వైపు మళ్లించారు.
కాగా వరద ప్రవాహం ఊహించని రీతిలో పెరగడంతో.. నిర్మాణంలో ఉన్న హైలెవెల్ బ్రిడ్జి సపోర్టింగ్ సెంట్రింగ్ ఇనుప రాడ్లు ఒక్కసారిగా కూలిపోయాయి.
కూలిన సెంట్రింగ్
మూసారాంబాగ్ పాత బ్రిడ్జికి ఆనుకుని కొత్త హైలెవెల్ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. ట్రాఫిక్ ఒత్తిడి తగ్గించేందుకు, అలాగే భవిష్యత్తులో వరదల సమస్యల నుంచి రక్షణ కల్పించేందుకు ఈ ప్రాజెక్టు ఆమోదించబడింది. అయితే వరద తీవ్రతను తట్టుకోలేక పైనుంచి వచ్చిన ప్రవాహానికి సపోర్టింగ్ సెంట్రింగ్ రాడ్లు కూలిపోవడంతో నిర్మాణానికి పెద్ద దెబ్బ తగిలింది. ఇనుప రాడ్ల సముదాయం నదిలో కొట్టుకుపోవడంతో పనులు నిలిచిపోయాయి. ఇది కేవలం ఇంజనీరింగ్ వైఫల్యం మాత్రమే కాదు, పనుల భద్రతా ప్రమాణాలపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతోంది.
అంబేద్కర్ నగర్ ఇళ్లలోకి వరద నీరు
బ్రిడ్జికి ఆనుకుని ఉన్న అంబేద్కర్ నగర్ కాలనీలో నివసించే ప్రజలు.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వరుసగా వర్షాలు, వరదలతో జంట జలాశయాల గేట్లు ఎత్తడం, మూసీకి వరద నీటి ప్రవాహం పెరగటంతో.. మూసీ పరివాహకం వెంట ఉన్న పరిస్థితిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
Also Read: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. నార్శింగ్-హిమాయత్‌సాగర్ సర్వీస్ రోడ్డు క్లోజ్..
మూసీ వెంట లోతట్టు ప్రాంతాలన్నింటా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట పునరావాసం కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు.