BigTV English

AP Govt: ఏపీ ప్రజలకు తీపికబురు.. ఎన్ని కిలోలైనా తీసుకెళ్లొచ్చు, అదెలా సాధ్యం

AP Govt: ఏపీ ప్రజలకు తీపికబురు.. ఎన్ని కిలోలైనా తీసుకెళ్లొచ్చు, అదెలా సాధ్యం

AP Govt: ఏపీలో టమాటా ధరలు దారుణంగా పడిపోయాయి. దీంతో రైతుల కష్టాలను తీర్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది చంద్రబాబు ప్రభుత్వం. రైతు బజార్లలో టమాటాలను అమ్మేలా ప్లాన్ చేస్తోంది. వివిధ కారణాలతో టమాటా ధరలు అమాంతంగా పడిపోయాయి. దీనివల్ల రైతులు నానాఇబ్బందులు పడుతున్నారు. రైతుల సమస్యలను పరిష్కరించి మంచి ధర లభించేలా ప్రభుత్వం చూస్తుందని హామీ ఇచ్చారు మంత్రి అచ్చెన్నాయుడు.


పతనమైన టమాటా ధరలు

పచ్చి వర్తకం వ్యాపారం గురించి చెప్పలేము. ఎందుకంటే మార్కెట్లో ఎప్పుడు ధర ఏ స్థాయిలో ఉంటుందో చెప్పలేము. దిగుబడి ఎక్కువ వచ్చినా ధరలు అమాంతంగా పడిపోయాయి. ప్రస్తుతం ఏపీలో టమాటా పరిస్థితి అలాగే ఉంది. ఆంధ్రప్రదేశ్ టమాటా ధరలు దారుణంగా పడిపోయాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు.


వివిధ ప్రాంతాల్లో వరదలు, దసరా సెలవులు, మార్కెట్‌కు అదనంగా సరుకు రావడంతో ధరలు పడిపోయాయి. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో అమ్మకాలు మందగించాయి. ఫలితంగా ఎగుమతులకు ఆటంకం మొదలుకావడంతో ధరలు అమాంతంగా తగ్గాయిని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.

రైతు బజార్ల ద్వారా అమ్మకాలకు నిర్ణయం

ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టమాటా రైతులకు అండగా నిలుస్తామని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. ధరలు పడిపోవడంతో రైతులు మాత్రం ఆందోళనలో పడిపోయారు. ప్రస్తుతం వివిధ మార్కెట్లలో కిలో టమాటా ధర గరిష్ఠంగా 18 రూపాయలు, , కనిష్ఠంగా 9 రూపాయలు ఉంది. సగటు ధర 12 రూపాయలుగా నమోదైంది.

పత్తికొండ మార్కెట్‌కు టమాటా దిగుబడి పెరిగింది. అక్కడి నుంచి 10 టన్నులను చిత్తూరు ప్రాసెసింగ్ యూనిట్‌కు తరలించారు. మరో 15 టన్నులను రైతు బజార్ల ద్వారా పంపిణీ చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఈ నేపథ్యంలో రైతు బజార్లలో టమాటాలను కేజీ 20 రూపాయలకు అమ్మేలా ప్లాన్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అప్పుడు వినియోగదారులు ఎన్నైనా కొనుగోలు చేయవచ్చు. దానికి ఏ మాత్రం లిమిట్ ఉండదని అంటున్నారు.

ALSO READ: ఏపీ విద్యార్థులకు శుభవార్త.. పావులా వడ్డీకి విద్యా రుణాలు

పత్తికొండ మార్కెట్‌కు 30 నుంచి 40 టన్నుల టమాటా వస్తుంది. ఈసారి దసరా సెలవులతో అదనంగా 10 టన్నులు వచ్చిందని మంత్రి చెబుతున్నారు. రెండో రకం టమాటాలను రోడ్లపై పడేసి గందరగోళం సృష్టించారని అసలు విషయం బయటపెట్టారు. ఇప్పటివరకు 10 టన్నులను వివిధ రైతుబజార్లకు తరలించినట్టు చెప్పుకొచ్చారు.

టమోటాలకు మంచి ధర లభిస్తోందని, ఏమైనా ఇబ్బందులుంటే ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు. కొన్ని మార్కెట్లలో టమాటాలు కేజీ 32 రూపాయలంటూ సోషల్ మీడియాలో వినియోగదారులు పోస్టులు పెడుతున్నారు. కిలో టమాటా రైతులు రూపాయికి అమ్ముతుంటే, కొందరు వ్యాపారులు 32 రూపాయలకు అమ్ముతున్నారని వాపోతున్నారు.

ఇలాంటి ఈ దోపిడీని అరికట్టాలని కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రైతులు-కొనుగోలుదారులకు ప్రయోజనం ఉండేలా చర్యలు చేపట్టింది. టమాటాలను రైతు బజార్లకు తరలించి కిలో 20 రూపాయల చొప్పున అమ్మేందుకు ప్లాన్ చేస్తోంది.

Related News

YS Jagan: నేడు వైసీపీ కీలక సమావేశం.. పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో జగన్‌ మీటింగ్

AP Govt: విద్యార్థులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. అతి తక్కువ వడ్డీకే విద్యా రుణాలు

Conaseema: కేశనపల్లిలో కొబ్బరి చెట్లు మాయం.. కారణం ఏమిటంటే?

Kakinada District: యముడు లీవ్‌లో ఉన్నాడు.. లారీ గుద్దినా బతికిపోయాడు, ఇదిగో వీడియో

Cough Syrup: ఆ కల్తీ దగ్గు మందు ఏపీలో సరఫరా కాలేదు.. మందుల నాణ్యతపై నిఘా: మంత్రి సత్యకుమార్

Nara Lokesh: ఏపీలోని ఈ నగరాల్లో ఇంజినీరింగ్ సెంటర్లు.. టాటా గ్రూప్ ఛైర్మన్‌తో మంత్రి లోకేశ్ కీలక భేటీ

AP: KGHలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన అనితా

Big Stories

×