Central Jail: సెంట్రల్ జైలు పేరు చెబితే చాలు.. చుట్టూ వందలాది పోలీసులు ప్రహరాలో ఉంటారు. అక్కడ ఏ చిన్న విషయం బయటకు రాదు. ఖైదీలకు పరివర్తన కోసం అక్కడికి తరలిస్తుంటారు. అలాంటి సెంట్రల్ జైలు.. ఖైదీలకు రాజభోగాలుగా మారుతున్నాయి. లోపలున్న వారిని కలవాలంటే చాలా తతంగం ఉంటుంది. బయట నుంచి ఏదైనా లోపలికి తీసుకెళ్లాలన్న నియమ నిబంధనలు ఉంటాయి.
రాజభోగాలుగా సెంట్రల్ జైలు
సెంట్రల్ జైలులో ఓ రౌడీ తన అనుచరులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. బెంగళూరు పరప్పణ అగ్రహార సెంట్రల్ జైలు గురించి చెప్పనక్కర్లేదు. దివంగత మాజీ సీఎం జయలలిత కొన్నాళ్లు అక్కడే జైలు జీవితం గడిపారు. అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న రౌడీ షీటర్ శ్రీనివాస అలియాస్ గుబ్బచ్చి సీనా. ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు.
అతడు పుట్టినరోజు వేడుకలను జైలులో ఘనంగా కేక్‌ను కట్ చేసి జరుపుకున్నాడు. కేక్ కట్ చేస్తున్న సమయంలో చుట్టూ ఉన్న ఖైదీలు చప్పట్లు కొడుతూ కనిపించారు. ఆపిల్‌తో తయారు చేసిన దండను మెడలో వేశారు. ఈ తతంగాన్ని ఓ ఖైదీ చిత్రీకరించాడు. 50 సెకన్ల నిడివి గల ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం కలకలం రేగింది. దీంతో జైలులో భద్రత, పర్యవేక్షణ-జవాబుదారీతనం గురించి ఆందోళన మొదలైంది.
ధూమ్ దామ్‌గా ఖైదీ పుట్టినరోజు వేడుకలు
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. జైలు నిబంధనల ప్రకారం మొబైల్ ఫోన్లకు అనుమతి ఉండదు. అలాంటిది ఏకంగా ఓ ఖైదీ వీడియోను రికార్డ్ చేయడం, దాన్ని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడమంటే చిన్నవిషయం కాదని అంటున్నారు. హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు రౌడీ షీటర్ శ్రీనివాస.
జనవరిలో బెంగళూరులోని దొడ్డ బొమ్మసంద్రలో తన ప్రత్యర్థి వెంకటేష్‌ని హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మరుసటి నెల అంటే ఫిబ్రవరిలో పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు ప్రయత్నించగా కాల్పులు జరపడంతో అతడి కాలికి గాయమైంది కూడా.
ALSO READ: ఈ బుడ్డోడు జాతీయ గీతాన్ని ఎంత చక్కగా ఆలపించాడో
గతేడాది రేణుకస్వామి హత్య కేసులో జైలుకి వెళ్లిన కన్నడ నటుడు దర్శన్ లోపల వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు ఫోటోలు బయటకు వచ్చాయి. దర్శన్ కుర్చీపై కూర్చుని, సిగరెట్-కాఫీ కప్పు పట్టుకుని కనిపించాడు. ఈ సంఘటన నేపథ్యంలో తొమ్మిది మంది జైలు అధికారులను సస్పెండ్ చేశారు. బెంగళూరు కోర్టు దర్శన్ సహా ఇతర నిందితులను వివిధ జైళ్లకు బదిలీ చేయాలని ఆదేశించింది. ఆ తర్వాత దర్శన్‌ను పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుండి బళ్లారి జైలుకు తరలించిన విషయం తెల్సిందే.
Criminals in Comfort Video Shows Rowdy-Sheeter Enjoying Royal Treatment in Karnataka’s Parappana Agrahara Jail
Parappana Agrahara Central Jail is once again under the spotlight, this time for a shocking display of privilege to a rowdy sheeter. Notorious Srinivas, alias Gubbachi… pic.twitter.com/bpdzxGLH19
— Karnataka Portfolio (@karnatakaportf) October 5, 2025