IND VS AUS: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా ( Team India vs Australia ) మధ్య అతి త్వరలోనే వన్డేలు అలాగే టి20 లు జరగనున్నాయి. ఈనెల 19వ తేదీ నుంచి వన్డే సిరీస్ ఈ రెండు జట్ల మధ్య ప్రారంభం కానుంది. అలాగే ఐదు టి20 మ్యాచ్ లు కూడా టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరగనున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే టీమిండియా జట్లను ప్రకటించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి ( BCCI), సిరీస్ కు సిద్ధమైంది. ఇక అటు తాజాగా ఆస్ట్రేలియా కూడా తమ జట్లను ప్రకటించేసింది.
టీమిండియాతో జరిగే వన్డే సిరీస్ కోసం తాజాగా ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. వన్డే తో పాటు టి20 కూడా ప్రకటించడం జరిగింది. ఈ రెండు ఫార్మర్ట్స్ కు మిచెల్ మార్ష్ ( Mitchel Marsh) కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. అయితే మాజీ కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్ ఈ సిరీస్ లో ఆడడం లేదు. అటు చాలా రోజుల తర్వాత మిచెల్ స్టార్క్ రంగంలోకి దిగుతున్నాడు. గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్యాట్ కమిన్స్ ను ( Pat Cummins) మాత్రం ఆస్ట్రేలియా సెలెక్ట్ చేయలేదు. దీంతో అతని స్థానంలో స్టార్క్ వచ్చాడు.
ఇక టి20 జట్టు విషయానికి వస్తే, మిచెల్ ఓవెన్, మ్యాత్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడం జంపా లాంటి ప్లేయర్లను తీసుకుంది. టి20 లకు మిచెల్ మార్ష్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. కొత్త కుర్రాలతో ఈ టి20 నిండిపోయింది. అయితే మొత్తం టీమిండియాతో 5 టీ20 లు ఉండగా రెండు టీ20లకు మాత్రమే జట్టును ప్రకటించారు. రెండు టి20లు పూర్తయ్యేసరికి మిగతా మ్యాచ్ ల కోసం జట్టును మళ్ళీ ప్రకటించే ఛాన్స్ ఉంది. అప్పుడు ఆట తీరు ఎవరిది ఎలా ఉంది అనేది తేలిపోతుంది. ఆ సమయంలోనే జట్టును ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Aus వన్డే జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, అలెక్స్ కారీ, కూపర్ కొన్నోలీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ ఓవెన్, మాథ్యూ రెన్షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా
T20I జట్టు (రెండు మ్యాచ్ ల కోసమే): మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్‌లెట్, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, మిచెల్ ఓవెన్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా
Introducing our Australian Men's squads for the ODI & T20I series against India 🇦🇺 🇮🇳 pic.twitter.com/6pSGjzUL01
— Cricket Australia (@CricketAus) October 7, 2025