Aadhaar Updates: ఆధార్ కార్డు గురించి చెప్పనక్కర్లేదు. దేశంలో ప్రతీ పౌరుడికి కీలకంగా మారింది. ఆధార్ లేకుంటే ఏ పని జరగని పరిస్థితి నెలకొంది. బ్యాంకు అకౌంట్లు, స్కూల్ జాయినింగ్ ఇలా ఏది చేయాలన్నా ఆధార్ ఉండాలి. దీనివిషయంలో కొత్త కొత్త విషయాలు వెల్లడిస్తోంది సంబంధిత సంస్థ. తాజాగా కొత్త అప్‌డేట్స్ తీసుకొచ్చింది. దాంతో ఉచితంగా అప్‌డేట్స్ చేయవచ్చు.
ఉచితంగా ఆధార్ అప్‌డేట్స్
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ-UIDAI దీనికి సంబంధించి కొత్త కొత్త అప్ డేట్స్ ఇస్తోంది. ఆధార్ విషయంలో కొత్త నిబంధనలు తెచ్చింది. పిల్లల అప్డేట్ విషయంలో ఓ అడుగు ముందుకేసింది. కొత్త నిబంధనల ప్రకారం తల్లిదండ్రులు తమ పిల్లల ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఈ సౌకర్యం కేవలం కొంతవరకు మాత్రమే. పిల్లల ఆధార్‌లో ఫోటో లేకుంటే అడ్రస్‌కు సంబంధించిన సమాచారం మారుతూ ఉంటుంది.
పాఠశాల మారినప్పుడు, వయస్సు పెరిగినప్పుడు, ఇళ్లు మారినప్పుడు వివరాలను అప్‌డేట్ చేయడం చాలా ముఖ్యం. ఇప్పుడు అప్‌డేట్‌ను ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. పిల్లల ఆధార్ అప్డేట్ విషయంలో వినియోగదారులు ఇకపై ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం ఉండదు. అక్టోబర్ 1 నుంచి ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఏడాది పాటు ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది.
కేవలం పిల్లలకు మాత్రమే
5 నుంచి 17 సంవత్సరాల పిల్లలకు ఉచితంగా అప్డేట్ చేయవచ్చు. 5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్నవారిని బాలా ఆధార్ అంటారు. వారి నుంచి ఫింగర్ ప్రింట్, ఐరిస్ స్కాన్ వంటి సమాచారం తీసుకోరు. ఐదేళ్ల తర్వాత పిల్లల ఆధార్ అప్డేట్ చేయించాలి. 15 నుంచి 17 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు రెండోసారి ఆధార్ అప్‌డేట్ చేసుకోవచ్చు.
తల్లిదండ్రులు లేదా సంరక్షకులు సమీపంలోని ఆధార్ కేంద్రానికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. లేకుంటే UIDAI అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా అప్డేట్ చేయవచ్చు. 5 నుండి 17 ఏళ్లు వయస్సు గల పిల్లలకు ఆధార్ అప్‌డేట్స్ కోసం ఛార్జీలను రద్దు చేసింది భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ. ఈ వయస్సు వారికి ఛార్జీల మినహాయింపు ఇప్పటికే ఇచ్చింది.
ALSO READ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.. రెండు విడతలుగా ఎన్నికలు
ఏడాదిపాటు అమలులో ఉంటుందని ఎలక్ట్రానిక్స్-సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా సుమారు ఆరు కోట్ల మంది పిల్లలకు ప్రయోజనం చేకూరనుంది. 17 ఏళ్లు దాటిన తర్వాత ఆధార్ అప్‌డేట్‌కు 125 రూపాయల నిర్ణీత రుసుము వసూలు చేయబడుతుందని తెలిపింది.