Janhvi kapoor: ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi kapoor) ఈమధ్య కాలంలో వరుసగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది.. కానీ సరైన సక్సెస్ మాత్రం లభించడం లేదు. అయితే అలా విడుదలైన చిత్రాలను ఇప్పుడు ఓటీటీలోకి కూడా తీసుకొస్తూ.. ఓటీటీ లవర్స్ ను కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు జాన్వీ కపూర్ నటించిన ఒక చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమయ్యింది. మరి ఆ చిత్రం ఏంటి ? ఏ ప్లాట్ ఫామ్ ద్వారా ఎప్పుడు స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.
విషయంలోకి వెళ్తే.. జాన్వీ కపూర్ హీరోయిన్ గా, సిద్ధార్థ్ మల్హోత్రా (Siddharth Malhotra) హీరోగా.. తుషార్ జలోట దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘పరమ్ సుందరి’. ఆగస్టు 29న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కు రాబోతోంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. అక్టోబర్ 10వ తేదీ నుండి రెంటల్ పద్ధతిలో అందుబాటులోకి రానుంది. అక్టోబర్ 24 నుండి అమెజాన్ ప్రైమ్ యూజర్లకు అందుబాటులోకి ఉండనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అసలే థియేటర్లలో ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేని ఈ సినిమా.. ఇప్పుడు రెంటల్ పద్ధతిలో అందుబాటులోకి రావడంతో పాటు అభిమానులు కూడా కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను యూజర్లు చూడాలి అంటే అక్టోబర్ 24 వరకు ఎదురు చూడాల్సిందే.
పరమ్ సుందరి సినిమా విషయానికి వస్తే.. సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్, సంజయ్ కపూర్, రెంజీ పనికర్, సిద్ధార్థ్ శంకర్, మనోజ్ సింగ్, ఇనాయత్ , అభిషేక్ బెనర్జీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మాడోక్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ALSO READ:Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!
ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. బిజినెస్ మాగ్నెట్ పరిమిత్ సచ్ దేవ్ (సంజయ్ కపూర్)కుమారుడైన పరమ్ సచ్ దేవ్ (సిద్ధార్థ్ మల్హోత్రా) సాఫ్ట్వేర్ రంగంలో స్టార్టప్ కంపెనీలు పెట్టి కోట్ల నష్టాన్ని తెచ్చిపెడుతుంటాడు. శేఖర్ (అభిషేక్ బెనర్జీ) డేటింగ్ యాప్ క్రియేట్ చేసి..దానిని ప్రమోట్ చేయడానికి సిద్ధమవుతాడు. ఇక డేటింగ్ యాప్ల పై నమ్మకం లేని పరమ్ దానిని టెస్ట్ చేయడానికి అందులో ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటాడు. టూరిస్ట్లకు ఆతిథ్యం ఇచ్చే ఇంటిని నిర్వహిస్తున్న సుందరి దామోదరన్ పిళ్ళై (జాన్వీ కపూర్) ప్రొఫైల్ తో 100% మ్యాచ్ కావడంతో ఆమెను వెతుక్కుంటూ వెళ్తాడు. ఇక తన అభిరుచులకు భిన్నమైన సుందరిని ప్రేమలో పడేసేందుకు ప్రయత్నాలు మొదలు పెడతాడు. అయితే డేటింగ్ యాప్ స్టార్టర్ ను ప్రమోట్ చేయడానికి పరం తండ్రి ఎందుకు నిరాకరించాడు? డేటింగ్ యాప్ కి ఫండింగ్ చేయడానికి కొడుకుకు పరిమిత్ పెట్టిన కండిషన్స్ ఏంటి? మోహిని ఆటం డాన్స్ ను ఇష్టపడే సుందరి ఎందుకు టూరిస్ట్ స్టే హోటల్ ను నిర్వహించాల్సి వచ్చింది? ఇలా పలు విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.