Durga Rao: ఒకప్పుడు టిక్ టాక్ అనే సోషల్ మీడియా యాప్ ఏ రేంజ్ లో పాపులారిటీ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ ఒక్క యాప్ ని ఉపయోగించి ఎంతోమంది సామాన్యులు సెలబ్రిటీలుగా మారిపోయారు. అలాంటి వారిలో దుర్గారావు (Durga Rao) దంపతులు కూడా ఒకరు. ముఖ్యంగా ఈ జంట శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ వంటి కామెడీ షోలలో సందడి చేసి భారీ పాపులారిటీ అందుకున్నారు. అంతేకాదు పాటలతో, డాన్స్ తో అందరినీ ఉర్రూతలూగించారు. మొన్నా మద్య బిగ్ బాస్ హౌస్ లోకి కూడా అడుగుపెట్టబోతున్నారంటూ వార్తలు రాగా.. స్టేజ్ కే పరిమితం అయిపోయారని చెప్పవచ్చు.
అలాంటి దుర్గారావు ఇంట్లో ఇప్పుడు విషాదఛాయలు అలుముకున్నాయి. ముఖ్యంగా సమాధి వద్ద ఆయన కూర్చొని కన్నీళ్లు పెట్టడం చూసేవారికి కన్నీళ్లు తెప్పిస్తోంది. మరి ఇంతకూ దుర్గారావు ఇంట్లో చనిపోయింది ఎవరు? అసలేం జరిగింది? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.. విషయంలోకి వెళ్తే.. దుర్గారావు తన ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. తన చెల్లి సమాధిపై పూలమాల వేసి కన్నీళ్లు పెట్టుకున్నాడు.తన చెల్లి లేదంటూ ఎమోషనల్ అయిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది చూసిన నెటిజన్స్ దుర్గారావుకు సానుభూతి తెలియజేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి అంటూ ధైర్యం చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారుతోంది. ఇకపోతే దుర్గారావు చెల్లి మరణానికి గల కారణాలను మాత్రం దుర్గారావు వెల్లడించలేదు.
రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు టిక్ టాక్ దుర్గారావు దంపతులు. “దుర్గారావు నాట్యమండలి” పేరుతో దుర్గారావు దంపతులు చేసే డాన్సులు కూడా అంతే పాపులర్.. చెప్పాలి అంటే దుర్గారావు టిక్ టాక్ ను వాడుకున్నంత బాగా మరెవరు వాడుకోలేదు అనడంలో అతిశయోక్తి లేదు. తన భార్యతో కలిసి ఈయన చేసిన వీడియోలు సంచలనం సృష్టించాయి. అందులో “నాదీ నక్కిలీసు గొలుసు” అనే పాట అయితే మరింత వైరల్ గా మారింది. అంతేకాదు ఈయన స్టెప్పులకు సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది అనడంలో సందేహం లేదు.
ALSO READ:Saiyami Kher : అరుదైన గౌరవాన్ని అందుకున్న జాట్ బ్యూటీ.. గ్రేట్ మేడం!
ముఖ్యంగా జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ లో వచ్చే షోలలో పాల్గొంటూ మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు.అలా జబర్దస్త్ ద్వారా కూడా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. అంతేకాదు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించిన ఈయన యూట్యూబ్ షార్ట్స్, షేర్ చాట్ వంటి యాపుల్లో కనిపించారు. అయితే టిక్ టాక్ ద్వారా వచ్చినంత సక్సెస్ ఈ వీడియోల ద్వారా లభించలేదని చెప్పవచ్చు. అలా పాపులారిటీ అందుకున్న ఈయన గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇన్నాళ్లకు చెల్లి చనిపోయిందంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టి మళ్ళీ వెలుగులోకి వచ్చారు.
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==