CJI: సీజేఐ బీఆర్ గవాయ్‌పై సుప్రీంకోర్ట్‌లో ఓ లాయర్ దాడికి యత్నించిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించింది. గవాయ్‌పై షూ విసిరేందుకు యత్నించిన లాయర్ రాకేశ్ కిశోర్‌ను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సస్పెండ్ చేసింది. దేశవ్యాప్తంగా ఏ కోర్టు, ట్రిబ్యునల్, లేదా లీగల్ అథారిటీలో ప్రాక్టీస్ చేయకుండా వేటు వేసింది. తదుపరి చర్యల కోసం షోకాజ్ నోటీస్ జారీ చేయనుంది. ఆర్డర్ రిసీవ్ చేసుకున్న తర్వాత 15రోజుల్లోగా తనపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో లాయర్ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.
సీజేఐ గవాయ్‌పై బూటు విసిరేసిన లాయర్ రాకేశ్ కిశోర్..
సుప్రీంకోర్టులో కేసు విచారణలో భాగంగా వాదనలు జరుగుతుండగా న్యాయవాది రాకేశ్ కిశోర్ సీజేఐపైకి బూటు విసిరేందుకు యత్నించాడు. గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అడ్డుకున్నారు. ఈ ఘటనపై సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ స్పందిస్తూ.. ఇలాంటి బెదిరింపులు తనను ప్రభావితం చేయలేవన్నారు. అనంతరం తన విచారణను కొనసాగించారు. ఈ అనూహ్య ఘటనతో కోర్టు హాల్‌లో కొద్ది నిమిషాల పాటు గందరగోళం ఏర్పడింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖజురహో ఆలయ సముదాయంలోని జవారీ మందిరంలో ఉన్న విష్ణుమూర్తి విగ్రహం కొంతకాలం క్రితం ధ్వంసమైంది. దీనిని పక్కనబెట్టి కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించేలా ఉత్తర్వులు జారీ చేయాలంటూ రాకేశ్ దలాల్ అనే వ్యక్తి ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ గవాయ్ నేతృత్వం లోని బెంచ్ విచారణ జరుపుతున్నది. గత నెల 17న విచారణ జరిగిన సమయంలో సీజేఐ కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఇది ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం కాదని.. పబ్లిసిటీ ప్రయోజన వ్యాజ్యమని వ్యాఖ్యానించారు. భారత పురావస్తు శాఖ పరిధిలో ఆలయం ఉందని.. ఇందులో తాము చేసేదేమీ లేదన్నారు. పిటిషనర్ను ఉద్దేశిస్తూ మీరు విష్ణుమూర్తికి పరమ భక్తులైతే ఆయననే వేడుకోండి అని వ్యాఖ్యానించారు. శైవత్వానికి వ్యతిరేకులు కాకపోతే అదే ఖజురహోలో అతి పెద్ద శివలింగం ఉంది. అక్కడ కూడా మీ సమస్యను విన్నవించుకోవచ్చని చెప్పారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.
సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడారంటూ ఆరోపణలు..
ఈ క్రమంలో సెప్టెంబర్ 18న స్పందించిన జస్టిస్ గవాయ్ తాను అన్ని మతాలను గౌర విస్తానని తెలిపారు. తన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారమయ్యాయని పేర్కొన్నారు. నిన్న గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఓ కేసును విచారిస్తుండగా న్యాయవాది రాకేష్ గవాయ్ మీదికి బూటు విసిరే ప్రయత్నం చేశారు.
Also Read: బీ అలర్ట్..! ఏపీ, తెలంగాణలో మరో వారం రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్..
ఘటనపై స్పందించిన ప్రధాని మోడీ, సీఎం రేవంత్ రెడ్డి.
ఘటనపై ప్రధాని మోడీ, సీఎం రేవంత్ రెడ్డి, జాగృతి అధ్యక్షురాలు కవిత, సీపీఐ నారాయణతో సహా పలువురు నేతలు స్పందించారు. సుప్రీంకోర్ట్ సీజేఐపై దాడిని తీవ్రగా ఖండిస్తున్నామన్నారు. దాడి ప్రతి భారతీయుడిని ఆగ్రహానికి గురిచేసిందని.. మన సమాజంలో ఇటువంటి దూషణకరమైన చర్యలకు చోటు లేదు.. ఇది పూర్తిగా ఖండించదగినది అంటూ మోడీ ట్వీట్ చేశారు. గవాయ్‌తో మాట్లాడానని.. అలాంటి సమయంలోనూ ప్రశాంతతను కోల్పోకుండా కోర్ట్‌ను నడిపించిన తీరును అభినందిస్తున్నానన్నారు.
సీజేఐపై దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన ప్రధాని మోదీ, రాజకీయ పార్టీల అగ్రనేతలు, న్యాయవాదుల సంఘాల నాయకులు pic.twitter.com/jVGqRWiOZt
— BIG TV Breaking News (@bigtvtelugu) October 7, 2025
సీజేఐపై దాడిని తీవ్రంగా ఖండించిన సీపీఐ నారాయణ..
ఇది రాజ్యాంగ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ప్రజాస్వామ్యంపై దాడి
అత్యంత ఉన్నత న్యాయస్థానంలోనే సీజేఐకి రక్షణ లేకపోతే ఈ దేశం పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి
సనాతన ధర్మం కాలం చెల్లిందని తన అభిప్రాయం చెప్పిన సీజేఐపై దాడి చేయడం దారుణం
సనాతన… https://t.co/ZVUV4sTaY2 pic.twitter.com/jeOlVzMZaL
— BIG TV Breaking News (@bigtvtelugu) October 7, 2025