Intinti Ramayanam Today Episode October 7th : నిన్నటి ఎపిసోడ్ లో.. అవని, రాజేంద్ర ప్రసాద్, పార్వతి మాట్లాడుకోవడం విన్న అక్షయ్ ఈ డబ్బులు గురించి తేలాలంటే కచ్చితంగా పోలీసులు రావాల్సిందే అని అక్షయ్ అంటాడు. కానీ అవని పోలీసులను పిలిపిస్తే ప్రణతి జీవితం ఏమవుతుందో తెలుసా అని ఆలోచిస్తున్నాను అని అంటుంది. నిజంగానే ఆ డబ్బులు భరత్ తీశాడా లేదా ఎవరైనా భరత్ ని ఇరికించాడా అని ఆలోచిస్తారు. అక్షయ మాత్రం కచ్చితంగా నేను పోలీసులను పిలుచుకొని వస్తాను అసలు దొంగ ఎవరో వాళ్ళే తేలుస్తారు అని అంటాడు. భరత్ బయట డబ్బులు తెచ్చారని అందరికీ క్లారిటీ వస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. కమల్ అవని కోసం ఇల్లంతా వెతికాను అని అంటాడు. ఎందుకు వదిన నువ్వు ఆలోచిస్తున్నావు అని అంటాడు. భరత్ వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చాడని తెలిసిపోయింది కదా అని అవని అంటుంది.. మీ అన్నయ్య కి ఇచ్చిన డబ్బులు ఎవరు తీసారో అర్థం కావట్లేదు అన్నయ్య. ఖచ్చితంగా ఇంట్లో వల్లే తీసి ఉంటారని నా అనుమానం.. వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి కచ్చితంగా మన ఇంట్లో వాళ్లే ఈ డబ్బులను తీసుకుని ఉంటారని నా అనుమానం. మాట వినగానే కమల్ రెచ్చిపోతాడు.
నిజంగా మన ఇంట్లో వాళ్లే డబ్బులు అన్ని తీసి ఉంటారా వదిన అని అడుగుతాడు. మన ఇంట్లో వాళ్ళు తీయకపోతే ఎవరు తీసి ఉంటారు అని అవని అడుగుతుంది. అయితే నీ మీద పల్లవికి శ్రీయ కి మాత్రమే కోపం ఉంది. వాళ్ళ ఇదంతా చేశారని తెలిస్తే తోలు తీసి డోలు వాయిస్తాను అని కమల్ సీరియస్ అవుతాడు. కమల్ కోపాన్ని చూసిన అవని అందుకే నీకు ఈ విషయం గురించి చెప్పట్లేదు కన్నయ్య అని అంటుంది. అయితే అవని బయటకు వెళ్తూ ఉంటుంది రాజేశ్వరి బయట కనిపించి మీ కూతురు మీద అనుమానం ఉంది పిన్ని ఇదంతా తానే చేసిందని నా డౌటు అని అంటుంది.
నాకు నువ్వు కూడా కూతురు లాంటి దానివి అమ్మ నీకు కష్టం వస్తే నేను చూడలేను. పల్లవి తప్పు చేసిందని తెలిస్తే నేను కచ్చితంగా అస్సలు క్షమించను నీకు సాయం చేస్తాను పల్లవి మారేందుకు నువ్వు ఏం చేయాలనుకుంటే అది చెయ్యి అని అంటుంది రాజేశ్వరి. ఇక ఇంట్లో శ్రియ ఫ్రాడ్ కేసిన ఒప్పుకోవడం కమల్ వింటాడు. ఈ విషయాన్ని ఇంట్లో అందరితో చెప్పి రచ్చ రచ్చ చేస్తారు. శ్రీయ కూడా మీ ఇంటికి పరువు లేదు అది ఇదని నాన్న రచ్చ చేస్తుంది. నీ పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకొని ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకుంటారు. ఆ తర్వాత శ్రీయకు శ్రీకర్ వార్నింగ్ ఇస్తాడు.
రాజేశ్వరి అవనిని ఇంటికి రమ్మని ఫోన్ చేసి పిలుస్తుంది. ఏమైంది పిన్ని అర్జెంట్గా రమ్మని అన్నారు అని అడుగుతుంది. పల్లవి ఒక సూట్ కేసు వాళ్ళ నాన్న చేతికి ఇచ్చి వెళ్లిందమ్మా అది కచ్చితంగా మీ ఇంట్లోంచి తెచ్చి ఉంటుందని నా అనుమానం అది కాదు అవును తెలుసుకోవడానికి నిన్ను రమ్మని పిలిచాను అని రాజేశ్వరి అంటుంది. అయితే రాజేశ్వరి చెప్పింది నిజమో కాదో తెలుసుకోవాలని పల్లవి ఆ సూట్ కేసును చూడడానికి వెళుతుంది.. ఆ సూట్ కేసును చూసిన అవని ఇది కచ్చితంగా అదే ఎలా ఉంది అని అనుకుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన చక్రధర్ నేను అర్జెంటుగా ఢిల్లీకి వెళ్ళాలి అందుకే వచ్చాను అని అంటాడు.
Also Read: భాగ్యం ప్లాన్ సక్సెస్.. దిమ్మతిరిగే షాకిచ్చిన నర్మద..వణికిపోతున్న శ్రీవల్లి..
అవని కనిపించకుండా ఇంట్లో దాక్కుంటుంది. ఆ తర్వాత చక్రధర్ మాట్లాడేసి వెళ్ళిపోతాడు. నువ్వు డబ్బులు తెచ్చిన సూట్ కేస్ ఇదే పిన్ని దీన్ని నేను తీసుకెళ్తాను ఇంట్లో పెడతాను అసలు దొంగ ఎవరో బయటకు వస్తారు అని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..