AP Dwakra Women: డ్వాక్రా సంఘాల మహిళలకు కొత్త స్కీమ్ తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం. దీని ద్వారా నెలకు తక్కువలో తక్కువ 20 వేల వరకు సంపాదించవచ్చు. ఇంతకీ ఆ స్కీమ్ ఏంటి? పెట్టుబడి ఎవరిస్తారు? అనేది మీ డౌట్. అక్కడికే వెళ్దాం.
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మహిళలకు ఎక్కువగా పథకాలు ప్రవేశపెడుతున్నారు. ఇళ్లు కేటాయింపు, ఉచిత బస్సు వంటివి. తాజాగా డ్వాక్రా సంఘాల మహిళలకు కొత్త పథకం తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం. దీనివల్ల వారి కాళ్ల మారే నిలబడవచ్చు. అంతేకాదు నెలకు ఎలాగ లేదన్నా 20 వేల వరకు సంపాదించుకోవచ్చు. అదెలా అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం.
డ్వాక్రా సంఘాలు మహిళలు చిన్న చిన్న వ్యాపారాలను ప్రొత్సహించేందుకు ఉచితంగా ఎగ్ కార్ట్‌లను అందిస్తోంది. తొలి విడతలో 250 ఎగ్ కార్ట్‌లను మహిళలకు పంపిణీ చేసింది ప్రభుత్వం. రూ.50 వేల విలువైన ఎగ్ కార్ట్‌లను ఉచితంగా ఇవ్వనుంది. ముఖ్యంగా చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించడానికి కోడి గుడ్ల వాడకాన్ని పెంచాలన్నది ప్రభుత్వ ఆలోచన.
దీనికోసం నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ-సెర్ప్ అధికారుల మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 1,000 మంది మహిళలకు ఎగ్ కార్ట్‌లను ఇవ్వనున్నారు. ఇందులోభాగంగా తొలి విడత 250 ఎగ్ కార్ట్‌లను సరఫరా చేసింది. గురువారం మంగళగిరిలో రాష్ట్రస్థాయి ప్రాజెక్టు డైరెక్టర్ల సమావేశం జరిగింది.
ALSO READ: పేదలకు తీపికబురు.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం, ఈ విధంగా చేస్తే
ఈ సందర్భంగా లబ్దిదారులకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎగ్ కార్డులను అందజేశారు. ఈ కార్డు వల్ల మనకు వచ్చేదేంటి? అనుకుంటున్నారా? అక్కడికే వద్దాం. ప్రభుత్వం అందజేసిన ఒక్కో ఎగ్ కార్ట్ విలువ 35 వేల రూపాయలు. దీంతోపాటు గుడ్లతో రకరకాల వంటకాలు చేయడానికి అవసరమైన వస్తువులు ఇవ్వనుంది. వాటి విలువ రూ.15 నుంచి 50 వేల రూపాయల వరకు ఉంటుంది.
దీని ద్వారా మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవచ్చు. ఈ ఎగ్ కార్ట్‌ల సహాయంతో డ్వాక్రా మహిళలు నెలకు 20 వేలు సంపాదించవచ్చు. మహళలు స్వయం ఉపాధి పొందడానికి ఇదొక మార్గం అన్నమాట. రాష్ట్రవ్యాప్తంగా దీన్ని విస్తరించాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల మాట.
ఇదిలావుండగా డ్వాక్రా సంఘాల లావాదేవీల్లో పారదర్శకత పెంచడానికి ‘మన డబ్బులు-మన లెక్కలు’ అనే కార్యక్రమాన్నిశ్రీకారం చుట్టనుంది. దీనికోసం ప్రత్యేకంగా ఓ యాప్‌ని రానుంది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ విషయాన్ని తెలిపారు. డ్వాక్రా మహిళలు ఎంత మేరా రుణాలు తీసుకున్నారు? నెలవారీ చెల్లింపులు ఎంత జరిగింది? వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి అనేది అందులో తెలుసుకోవచ్చు.
యాప్ ద్వారా సంఘంలోని ప్రతీ సభ్యురాలికి సమాచారం అందుతుంది. దీనివల్ల బ్యాంకుల నుంచి తీసుకున్న డబ్బులకు ఎంత కట్టాము.. బ్యాలెన్స్ ఎంత ఉంది అనే వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చ. వైసీపీ హయాంలో డ్వాక్రా సంఘాల మహిళల పేరుతో మధ్యవర్తులు డబ్బులు తీసుకున్న ఉదంతాలు బయటకు వచ్చిన నేపథ్యంలో ప్రత్యేకంగా యాప్ తీసుకొస్తోంది.