చైనీస్ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో మరో క్రేజీ ఫోన్ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. Vivo Y500 Pro పేరుతో వచ్చే వారం చైనాలో లాంచ్ చేయబోతోంది. ఈ నేపథ్యంలో కీలక ఫీచర్లు, స్పెసిఫికేషన్ల వివరాలను వెల్లడించింది. అదే సమయంలో రాబోయే హ్యాండ్ సెట్ డిజైన్‌ను టీజ్ చేసింది. ఇందులో 12GB వరకు RAM, 512GB వరకు ఆన్ బోర్డ్ స్టోరేజ్ తో MediaTek Dimensity 7300 చిప్ సెట్ ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
వివో Vivo Y500 Pro లాంచింగ్ కు సంబంధించి కీలక ప్రకటన చేసింది. నవంబర్ 10న స్థానిక సమయం ప్రకారం సాయంత్రం 7 గంటలకు (భారత కాలమానం ప్రకారం IST సాయంత్రం 4:30 గంటలకు) చైనాలో Vivo Y500 Pro లాంచ్ అవుతుందని వెల్లడించింది.
Vivo Y500 Pro 1.5K రిజల్యూషన్ తో 6.67-అంగుళాల OLED డిస్ ప్లేను కలిగి ఉంటుంది. ఇది OriginOS 6తో Android 16ను కలిగి ఉంటుంది. కొత్త సాఫ్ట్ వేర్ ఇంటర్ ఫేస్ తో లాంచ్ అయిన మొదటి నాన్ ఫ్లాగ్ షిప్ Vivo ఫోన్ గా గుర్తింపు తెచ్చుకోనుంది. ఫోటోల కోసం ఈ హ్యాండ్ సెట్ 200 మెగాపిక్సెల్ Samsung HP5 సెన్సార్ ను కలిగి ఉంటుంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కూడిన 7,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్ సెట్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ను కలిగి ఉంటుంది. వాటర్ రెసిస్టెన్స్ కు సంబంధించి IP68+IP69 రేటింగ్ తో వస్తుంది. శాటిన్ ఫినిషింగ్ తో యాంటీ గ్లేర్ గ్లాస్ బ్యాక్ ను కలిగి ఉంటుందని వివో వెల్లడించింది.
Read Also: 7,000mAh బ్యాటరీ, 6.7 ఇంచుల డిస్ ప్లే.. రిలీజ్ కు ముందే Moto G67 స్పెసిఫికేషన్లు లీక్!
Vivo V2516A మోడల్ నంబర్ కింద లిస్ట్ చేసిన Vivo Y500 Pro MediaTek Dimensity 7400 చిప్ సెట్ ద్వారా పవర్ ను పొందుతుంది. ఆక్టా కోర్ ప్రాసెసర్ లో రెండు క్లస్టర్‌లు ఉన్నాయి. నాలుగు కోర్లు 2.00GHz దగ్గర క్లాక్ చేయబడ్డాయి. మరో నాలుగు కోర్లు 2.60GHz దగ్గర ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ సింగిల్ కోర్ టెస్ట్ లో 1,059 స్కోర్లను, మల్టీ కోర్ టెస్ట్ లో 3,006 స్కోర్లను సాధించింది. ఈ హ్యాండ్‌సెట్ 12GB RAMతో వస్తుందని భావిస్తున్నారు. ఇది ఆరిజిన్ OS 6తో పాటు ఆండ్రాయిడ్ 16ని కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ చైనా లాంచ్ డేట్ అనౌన్స్ అయినా, భారత్ లోకి ఎప్పుడు అగుడు పెడుతుంది? అనే విషయంపై క్లారిటీ లేదు. త్వరలోనే వివో ఈ విషయం గురించి ప్రకటన చేసే అవకాశం ఉంది.
Read Also: సూపర్ లుక్, క్రేజీ ఫీచర్స్.. అందుబాటులోకి Vivo Y19s 5G బడ్జెట్ స్మార్ట్ ఫోన్!