HHVM Day 1 Collections:దాదాపు రెండేళ్ల పాటు ఆత్రుతగా, ఆకలితో ఎదురుచూసిన అభిమానులకు మంచి విందు భోజనం వడ్డించారు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)అని తెలుస్తోంది. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు (Harihara Veeramallu) సినిమా ప్రీమియర్ షోలు పడ్డాయి. ఇప్పటికే చాలా ఏరియాలలో థియేటర్లన్నీ హౌస్ ఫుల్ తో రన్ అవ్వడం, అభిమానుల ఆప్యాయతకు అద్దం పడుతున్నాయి. ఎప్పుడో 2 ఏళ్ల క్రితం ‘బ్రో’ సినిమాతో తెరపై కనిపించిన పవన్ కళ్యాణ్.. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత తెరపై కనిపించడంతో అభిమానులలో పూనకాలు వచ్చేస్తున్నాయని చెప్పవచ్చు.
వన్ మ్యాన్ షో గా వీరమల్లు..
అటు గత ఐదు సంవత్సరాల పాటు షూటింగ్ జరుపుకొని.. ఇప్పుడు పలుమార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చింది హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ తొలిసారి పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన చిత్రం ఇది. నిధి అగర్వాల్ (Nidhhi Agerwal)హీరోయిన్ గా, బాబీ డియోల్ (Bobby Deol) విలన్ గా.. అనసూయ(Anasuya ) స్పెషల్ సాంగ్ లో చేసిన ఈ సినిమా ఇప్పుడు మంచి టాక్ తో దూసుకుపోతోంది. దీనికి తోడు సునీల్, నాజర్, సుబ్బరాజు, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సినిమా చూసిన ఆడియన్స్ ప్రతి ఒక్కరు కూడా సినిమాపై మంచి రివ్యూ ఇస్తున్నారు. అటు హరిహర వీరమల్లు వన్ మ్యాన్ షో అంటూ తెగ సందడి చేస్తున్న విషయం తెలిసిందే.
హరిహర వీరమల్లు ఫస్ట్ డే కలెక్షన్స్..
ఇదిలా ఉండగా ఇటు చాలా ఏళ్ల తర్వాత తెరపై కనిపించడం, దీనికి తోడు ప్రత్యర్థి పార్టీలకు చుక్కలు చూపించడానికి ఈ సినిమాను ప్రెస్టేజ్ గా తీసుకున్నారు అభిమానులు. అందులో భాగంగానే కలెక్షన్లు కూడా ఒక రేంజ్ లో రాబట్టే అవకాశం ఉందని అప్పుడే జ్యోతిష్యం చెప్పేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా చూసిన ఆడియన్స్ మొదటి రోజు కచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా రూ.50 నుండి రూ.70 కోట్లు వసూలు చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటు శుక్రవారం రూ.50 కోట్లు, శనివారం రూ.50 కోట్లు ఇక ఆదివారం వరకు కూడా ఇదే కలెక్షన్స్ కొనసాగుతాయని.. వీకెండ్ ముగిసే సరికి కచ్చితంగా రూ.200 నుండీ రూ.220 కోట్లు పక్కాగా వసూలు చేస్తుందని.. ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీకెండ్ కి రూ.300 కోట్లతో పక్కా పోస్టర్ వస్తుంది అని కూడా చెబుతున్నారు.
మొదటి వారాంతంతోనే సేఫ్ జోన్ లోకి నిర్మాత..
మొదటి వీకెండ్ లోనే నిర్మాతకు భారీ లాభాలు తెచ్చిపెడుతుందని, పవన్ కళ్యాణ్ కచ్చితంగా మరోసారి తన స్టామినా ఏంటో ఈ కలెక్షన్స్ తో అందరికీ నిరూపించబోతున్నారని కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత విడుదలైన సినిమా కావడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీనికి తోడు సినిమా కూడా అదిరిపోయింది అనే వార్తలు వినిపిస్తున్నాయి కాబట్టి నిర్మాత మొదటి వారాంతంలోనే సేఫ్ జోన్ లోకి వెళ్లే అవకాశాలున్నట్లు సమాచారం.
హరిహర వీరమల్లు సినిమా స్టోరీ..
ఇక హరిహర వీరమల్లు సినిమా స్టోరీ విషయానికి వస్తే.. 16వ శతాబ్దంలో జరిగే ఫిక్షనల్ కథ గా రూపొందించారు. ఇందులో వీరమల్లు వజ్రాలతో పాటు ఇతర దొంగతనాలు చేసి పేద ప్రజలకు పంచి పెట్టే దొంగ పాత్రలో నటించారు. అయితే చిన్న దొర.. తన దగ్గర ఉన్న వజ్రాలను గోల్కొండ నవాబులకు ఇవ్వాల్సి ఉంటుంది. వాటిని ముందే దొంగతనం చేసి తనకు ఇవ్వాలి అని వీరమల్లుతో చిన్నదొర చిన్న డీల్ కుదుర్చుకుంటాడు. అక్కడే పంచమి పరిచయమవుతుంది. వజ్రాలతో పాటు పంచమిని కూడా కాపాడాల్సిన బాధ్యత వీరమల్లుకు ఏర్పడుతుంది. ఈ క్రమంలో గోల్కొండ నవాబులకు వీరమల్లు కూడా దొరికిపోతాడు. ఇక అప్పుడు ఢిల్లీలో ఉన్న మొగల్ చక్రవర్తి ఔరంగజేబు దగ్గర ఉన్న నెమలి సింహాసనంలోని కోహినూరు డైమండ్ దొంగలించాలని గోల్కొండ నవాబు వీరమల్లుకు చెబుతాడు.
ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే..
తర్వాత వీరమల్లు దానికి ఒప్పుకున్నాడా ? ఒప్పుకుంటే ఎందుకు ఒప్పుకున్నాడు? కోహినూర్ తీసుకురావడానికి వీరమల్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అసలు పంచమి ఎవరు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.