E-Paper
Advertisement

AP RTI Commissioners: ఏపీ ఆర్టీఐకి నలుగురు కమిషనర్లు నియామకం.. చీఫ్ గా వజ్జా శ్రీనివాసరావు

AP RTI Commissioners: ఏపీ ఆర్టీఐకి నలుగురు కమిషనర్లు నియామకం.. చీఫ్ గా వజ్జా శ్రీనివాసరావు
Advertisement

AP RTI Commissioners: ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్‌కు ప్రభుత్వం నలుగురు కమిషనర్లను నియమించింది. ఈ మేరకు సీఎస్ విజయానంద్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టీఐ చీఫ్‌ కమిషనర్‌గా వజ్జా శ్రీనివాసరావు నియమితులయ్యారు. కమిషనర్లుగా వి.శరత్‌ చంద్ర కల్యాణ చక్రవర్తి, గాజుల ఆదెన్న, ఒంటేరు రవిబాబు, పరవాడ సింహాచలం నాయుడును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మూడేళ్ల సర్వీస్‌ లేదా 65 ఏళ్లు వచ్చే వరకు వీరు ఆర్టీఐ కమిషనర్లుగా పదవిలో కొనసాగుతారు.

నలుగురూ న్యాయవాదులే

ప్రధాన కమిషనర్‌గా ప్రముఖ న్యాయవాది వజ్జా శ్రీనివాసరావును నియమించింది ప్రభుత్వం. ప్రస్తుతం ఆర్టీఐలో ముగ్గురు కమిషనర్లు ఉండగా..తాజాగా మరో నలుగురిని నియమించారు. ప్రస్తుతం నియమితులైన నలుగురూ న్యాయవాదులే కావడం విశేషం. కడపకు చెందిన రవి యాదవ్‌, అనంతపురానికి చెందిన ఆదెన్న, విశాఖకు చెందిన సింహాచలం నాయుడు పేర్లు జాబితాలో ఉన్నాయి.

Advertisement

Also Read: ఏపీ సర్కార్ సంక్రాంతి కానుక.. ఉద్యోగులు, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు క్లియర్

ఎంపిక విధానం ఇలా

ఆర్టీఐ కమిషనర్లను ఎంపిక చేసేందుకు సెలెక్షన్‌ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలో ముఖ్యమంత్రి, సీనియర్‌ మంత్రి, ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉంటారు. ప్రస్తుతం ప్రతిపక్ష నేత లేకపోవడంతో మరో సీనియర్‌ మంత్రిని కమిటీలోకి తీసుకున్నారు. ఈ కమిటీ ఎంపిక చేసిన పేర్లను గవర్నర్‌ ఆమోదానికి పంపించారు. గవర్నర్ ఆమోదం లభించడంతో.. ఆర్టీఐ ప్రధాన కమిషనర్‌తోపాటు కమిషనర్ల పేర్లను సీఎస్ ప్రకటించారు.

Related News

కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు.. చంద్రబాబు సర్కారుపై షర్మిల సంచలన ఆరోపణలు

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

Big Stories

Advertisement
×