Handloom Workers: ఏపీలో వ్యవసాయం తర్వాత ఉపాధి అందించే మరో పరిశ్రమ చేనేత. రాష్ట్రంలో సుమారు వేలాది చేనేత నేత కుటుంబాలు ఉన్నాయి. వేలల్లో పవర్ లూమ్ యూనిట్లు ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో చేనేత పరిశ్రమ విస్తరించింది. దీన్ని నమ్ముకుని వేలాది మంది కార్మికులు ఉన్నాయి. వారి కళ్లలో ఆనందం కోసం ఉగాది సందర్భంగా తీపి కబురు చెప్పేసింది కూటమి సర్కార్.
చేనేత కార్మికులు ఊరట
చేనేత రంగానికి ఊతం అందించాలనే ఉద్దేశంతో కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. చేనేత కార్మికులు, వారి ప్రయోజనాలను కాపాడేందుకు దృష్టి సారించింది. చేనేతలు, పవర్ లూమ్స్ యజమానులకు శుభవార్త చెప్పేసింది. చేనేత కార్మికుల మగ్గాలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్‌కు 500 యూనిట్ల వరకూ ప్రతి నెలా ఉచిత కరెంట్ ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఉచితంగా విద్యుత్ ఇవ్వడం ద్వారా ఏడాదికి సుమారు రూ.125 కోట్ల ఆర్థిక భారం ప్రభుత్వంపై పడనుంది. ఈ మేరకు జిల్లాల వారీగా లబ్ధిదారులను గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై చేనేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో వేలాది చేనేత కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుందని అంటున్నారు.
చేనేత కార్మికుల కుటుంబాలు 200 యూనిట్ల కంటే వినియోగం ఎక్కువగా ఉంటే డిస్కామ్‌ల నిబంధనల ప్రకారం ఛార్జీలు వర్తిస్తాయి. అలాగే పవర్ లూమ్ యూనిట్ సైతం. చేనేత కార్మికులు, వారి ప్రయోజనాలను కాపాడేందుకు విద్యుత్ శాఖ అవసరమైన మద్దతును అందిస్తుందని తాజాగా ఉత్తర్వుల్లో ప్రస్తావించింది.
ALSO READ: సడన్‌గా మాయమైన సజ్జల, వైసీపీలో ఏం జరుగుతోంది?
కేంద్ర ప్రభుత్వం జిల్లాకు ఒక ఉత్పత్తి కింద 98 ఉత్పత్తులను గుర్తించింది. అందులో 34 ఉత్పత్తులు చేనేత విభాగానికి చెందినవి ఉన్నాయి. చేనేత వృత్తి అనేది చాలా కుటుంబాలకు తరతరాల నుంచి వస్తోంది. అయితే ప్రస్తుతం ఆ సెక్టార్ కష్టాలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ముడి సరుకు, రంగులు, రసాయనాల ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి.
దీనివల్ల చేనేత వస్త్రాలకు గిట్టుబాటు ధర రాలేదు. ఆ వృత్తికి చాలా కుటుంబాలు దూరం అవుతున్న విషయం తెల్సిందే. గతేడాది ఏప్రిల్ నుండి చేనేత కార్మికుల నెల వారీ పెన్షన్‌ను నెలకు 3,000 నుండి 4,000కి పెంచింది. కొంతవరకు ఆయా కార్మికులకు సహాయపడింది.
ఎస్టీ, ఎస్సీలకు సైతం
మరోవైపు ఉచిత విద్యుత్ బదులుగా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు సౌర విద్యుత్ అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పీఎం సూర్యఘర్ పథకం కింద వారికి సంబంధించిన 20.10 లక్షల విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి పలకాలను ఉచితంగా ఇవ్వనుంది.
ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఇళ్లపై సౌర విద్యుత్ ప్లేట్లు అమర్చనున్నారు. ఒక్కో ఇంటిపై 2 కిలోవాట్ల సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసి దాని ఆధారంగా 200 యూనిట్ల వరకు సోలార్ విద్యుత్‌ను ఆయా కుటుంబాలకు ఉచితంగా అందజేస్తారు.