E-Paper
Advertisement

OTT Movie : అల్లరి చిల్లరగా తిరిగే అబద్ధాల కోరు… తల్లినే మోసం చేసి… ఓటీటీలోకి వచ్చేసిన హార్ట్ టచింగ్ మూవీ

OTT Movie : అల్లరి చిల్లరగా తిరిగే అబద్ధాల కోరు… తల్లినే మోసం చేసి… ఓటీటీలోకి వచ్చేసిన హార్ట్ టచింగ్ మూవీ
Advertisement

OTT Movie : ‘కథా సుధ’ తెలుగు షార్ట్ స్టోరీస్ లో భాగంగా ‘నమ్మకం’ కథ ప్రేక్షకుల ముందుకొచ్చింది. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ షార్ట్ ఫిల్మ్ తల్లిదండ్రులు, పిల్లలు మధ్య జరిగే ఒక ఎమోషనల్ స్టోరీ. తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడి తమ పిల్లలను ఉన్నత స్థాయిలో చూడాలని అనుకుంటారు. కానీ ఆ పిల్లలు తల్లిదండ్రులకు ఇచ్చే నిజమైన గౌరవం ఎలా ఉండాలో ఈ కథ చెప్తుంది. ఇది ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్

‘Nammakam’ 2025 సెప్టెంబర్ 28న ETV Win (ఈటీవీ విన్) విడుదలైన తెలుగు డ్రామా చిత్రం. దీనికి కె. రాఘవేంద్ర రావు బి.ఎ. దర్శకత్వం వహించారు. ఇది శ్రీ సాయి లక్ష్మీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించబడింది. ఇందులో రోహిణి (అనిత), మోహిత్ (రాజు), రవి శంకర్ (రామయ్య), శ్రీ లక్ష్మీ (అనిత తల్లి), రామ్ జె. (వెంకటేశ్వర్లు), రామ శర్మ (సరళ) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా జస్టిన్ ప్రభాకరన్ సంగీతం, శ్రీకాంత్ సినిమాటోగ్రఫీ, రాజు ఎడిటింగ్‌తో నేరుగా ఓటీటీలో రిలీజ్ అయింది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

అనిత ఒక గ్రామంలో నివసించే సాధారణ యువతి. ఆమె తన కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందుల నుండి కాపాడడానికి చిన్న ఉద్యోగం చేస్తుంటుంది. ఆమె తండ్రి రామయ్య ఒక రైతు, ప్రస్తుతం అప్పుల్లో కూరుకు పోయి ఉంటాడు. ఆమె తల్లి అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటుంది. అయితే అనిత రాజు అనే యువకుడితో ప్రేమలో ఉంటుంది. కానీ అదే గ్రామంలో ఉండే ధనవంతుడైన వెంకటేశ్వర్లు ఆమెను వివాహం చేసుకోవాలని కోరుకుంటాడు. ఆమె కుటుంబ అప్పులను తీర్చడానికి సహాయం చేస్తానని వెంటపడతాడు. ఈ సమయంలో అనిత తన ప్రేమ, కుటుంబ బాధ్యతల మధ్య ఒత్తిడిలో పడుతుంది. ఆమె తన ప్రేమకోసం నిలబడాలా లేక కుటుంబం కోసం ప్రేమను త్యాగం చేయాలా అనే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది.

ఈ కథ నడిచే కొద్ది, తన కుటుంబాన్ని కాపాడడానికి అనిత అనేక సమస్యలను ఫేస్ చేస్తుంది. ఈ కష్టాల్లో రాజు ఆమెకు అండగా నిలుస్తాడు. కానీ వెంకటేశ్వర్లు ఆమె కుటుంబంపై ఒత్తిడి పెంచుతాడు. అనిత తల్లి, స్నేహితురాలు సరళ కూడా ఆమెకు ఎమోషనల్ గా మద్దతు ఇస్తారు. చివరలో అనిత తీసుకునే ఒక షాకింగ్ నిర్ణయం, గ్రామంలో మార్పును తెస్తుంది. అనిత తీసుకున్న నిర్ణయం ఏమిటి ? ఈ నిర్ణయం గ్రామంలో ఎలాంటి మార్పును తీసుకొస్తుంది ? అనే విషయాలను ఈ సినిమాని చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : ఇంకొకడి కోసం ప్రేమించిన వాడిని నిండా ముంచే అమ్మాయి… కిల్లర్ల గ్యాంగ్ మొత్తం ఒకే చోట… బ్రూటల్ రివేంజ్ డ్రామా

Related News

కూతురిని కాపాడాలంటే భార్యను పంపమనే మాఫియా డాన్… 8.8 రేటింగ్‌తో దూసుకెళ్తున్న తెలుగు థ్రిల్లర్

పూజారి అంటే పూజలే అనుకుంటున్నారా ? విలన్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఫైటర్… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

దుల్కర్‌ సినిమా స్ట్రీమింగ్ విషయంలో గందరగోళం… స్ట్రీమింగ్ ఏ ఓటీటీలో ? ఎప్పటి నుంచి ?

అపార్ట్‌మెంట్‌లో వరుస మిస్సింగ్స్.. ఆ బిల్డింగ్ కేర్‌టేకర్‌ వెనుక దాగిన భయంకర నిజం… హాలీవుడ్ హారర్ థ్రిల్లర్

ఆ పాత పెట్టె తెరిస్తే పాతాళానికే… ఇంట్లోనే నరకం చూపించిన దుష్టశక్తి… తెలుగులోనే ఈ హారర్ థ్రిల్లర్

అడవిలో ఆపద తెచ్చిన ప్రయాణం… ఆ దారిలో వెళ్తే ప్రాణాలే గాల్లో… టెర్రిఫిక్ తెలుగు థ్రిల్లర్

పూరీ పుణ్యక్షేత్రం రహస్యం… దివ్యశక్తి కోసం విలన్ల ఊచకోత… ఒక్కో సీన్ చూస్తుంటే మతిపోతోంది

ఈజీ మనీ కోసం ఎన్నికల్లో మోసం.. చివరికి ఊరంతా శత్రువులైతే… తెలుగు సినిమానే

Big Stories

Advertisement
×