టెక్ దిగ్గజం గూగుల్ కు చెందిన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్ యూట్యూబ్ భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పింది. తక్కువ ధరలో ప్రీమియం లైట్ సబ్ స్క్రిప్షన్ ను పరిచయం చేసింది. ఇప్పటికే యూట్యూబ్ ప్రీమియంను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, దీని ఛార్జీ కాస్త ఎక్కువగా ఉండటంతో తక్కువ ధరలో ఈ ప్లాన్ ను తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ సదుపాయం అమెరికాలో ఉండగా, ఇప్పుడు ఇండియాలో కూడా రాబోతోంది.
తాజాగా తీసుకొస్తున్న ఈ ప్లాన్ కు నెలకు కేవలం రూ. 89 చెల్లించాల్సి ఉంటుంది. దీని ద్వారా గేమింగ్, కామెడీ, వంటలు, ఎడ్యుకేషన్, బ్యూటీ సహా పలు అంశాలకు సబంధించిన వీడియోలను యాడ్స్ లేకుండా చూసే అవకాశం ఉంటుంది. అదే సమయంలో సబ్ స్క్రైబర్లు మ్యూజిక్ కంటెంట్, మ్యూజిక్ వీడియోలు, షార్ట్ లపై ప్రకటనలను కనిపిస్తాయి. అటు యూట్యూబ్ ప్రీమియంలా లైట్ ప్లాన్ లో బ్యాగ్రౌండ్ కంటెంట్ ను చూడటం, డౌన్ లోడ్ చేయడం లాంటివి కుదరదు. ప్రస్తుతం ఇండియాలో రూ. 89కి విద్యార్థులకు యూట్యూబ్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ అందిస్తోంది. అటు యూట్యూబ్ ప్రీమియం వన్ ఇయర్ ప్లాన్ ను రూ. 1490కి అందిస్తోంది. నెలకు రూ. 149 చొప్పున చెల్లించాలి. నెలకు రూ. 299, రూ. 219తో ప్యామిలీ ప్లాన్ కూడా అందిస్తుంది. మొత్తంగా యూట్యూబ్ ప్రీమియం, యూట్యూబ్ ప్రీమియం లైట్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్న వాళ్లు ఎలాంటి యాడ్స్ లేకుండా వీడియోలను చూసే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు యాడ్స్ తో చిర్రెత్తిన యూజర్లు ఇకపై ఎలాంటి అవాంతరం లేకుండా హ్యాపీగా వీడియోలను చూస్తూ ఎంజాయ్ చెయ్యొచ్చు!
Read Also: జస్ట్ రూ.1.50 లక్షలకే రెనాల్ట్ 7-సీటర్ కారు, ఫీచర్లు చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే!
ఈ ఏడాది మార్చిలో యూట్యేబ్ మ్యూజిక్ మరియు ప్రీమియం సేవలలో ప్రపంచ వ్యాప్తంగా 125 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్‌లను దాటిందని ప్రకటించింది. మొత్తం మీద, ఆల్ఫాబెట్ 270 మిలియన్ల చెల్లింపు సభ్యత్వాలను అధిగమించిందని, యూట్యూబ్, గూగుల్ వన్ కీలక డ్రైవర్లుగా ఉన్నాయని ఆల్ఫాబెట్ CEO సుందర్ పిచాయ్ ఏప్రిల్ లో వెల్లడించారు. గూగుల్ ప్రతి క్వార్టర్ లో యూట్యూబ్ మొత్తం ఆదాయాలను ప్రకటించదు. దానికి బదులుగా ప్రకటనల అమ్మకాల గణాంకాలను అందిస్తుంది. కానీ అక్టోబర్ 2024లో, యూట్యూబ్ ఆదాయం గత నాలుగు త్రైమాసికాలలో మొదటిసారిగా 50 బిలియన్ డాలర్లను ను అధిగమించిందని పిచాయ్ చెప్పారు.
Read Also: 400 కిమీ రేంజ్, 110 కిమీ స్పీడ్.. వచ్చేస్తోంది సరికొత్త ఎలక్ట్రిక్ స్ప్లెండర్!