BigTV English

HARISH RAO: ఆ వీడియోలు, ఫోటోలు.. హరీశ్‌రావుపై కంప్లైంట్

HARISH RAO: ఆ వీడియోలు, ఫోటోలు.. హరీశ్‌రావుపై కంప్లైంట్

HARISH RAO: ఎమ్మెల్యే హరీశ్‌రావు. ప్రతిపక్షంలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఏడాదిగా రెస్టే లేకుండా రాజకీయం చేస్తున్నారు. గులాబీ బాస్ డైరెక్షన్‌లో అసెంబ్లీలో, ప్రజల్లో, మీడియా ముందు తన వాక్చాతుర్యం ప్రదర్శిస్తున్నారు. చాలా అంశాల్లో తన బావమరిది కేటీఆర్‌ను మించిపోతున్నారు. గతంలో పవర్‌లో ఉన్నప్పుడు కేసీఆర్ తర్వాత కేటీఆరే నెంబర్ 2గా ఉండేవారు. అపొజిషన్ రోల్‌లో మాత్రం కేటీఆర్ కంటే హరీశ్ దూకుడుగా ఉన్నారంటున్నారు. అందుకే, సీఎం రేవంత్‌రెడ్డి సైతం తాటిచెట్టులా పెరిగాడు.. బిల్లారంగా అంటూ కేటీఆర్, హరీశ్‌రావులను సమానంగా టార్గెట్ చేస్తున్నారు. రేవంత్, కేటీఆర్‌లు ఉప్పునిప్పులా మండుతుంటే.. ఇటీవల హరీశ్‌రావు మాత్రం సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన ఛాంబర్లో కలిసి పలు అంశాలపై మాట్లాడటం ఇప్పటికీ ఆసక్తికర అంశమే.


సభలో హరీశ్‌రావుతో సమరమే..

తెలంగాణ అసెంబ్లీ హాట్ హాట్‌గా సాగుతోంది. సభలో చర్చ సుదీర్ఘంగా, సమగ్రంగా జరుగుతోంది. గతంలో మాదిరి సస్పెన్షన్లు, మైకులు కట్ చేయడాలు గట్రా లేకుండా.. ప్రతిపక్షం మాట్లాడేందుకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నారు స్పీకర్. బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ పార్టీ సభ్యులు ప్రస్తావించే ప్రతీ అంశాలపై.. అధికార పార్టీ జవాబు ఇస్తోంది. ఇంతటి ఫ్రీడమ్‌ను ప్రతిపక్షం తట్టుకోలేకపోతున్నట్టుంది. సభలో గొడవ చేయడం, పోడియం ముందుకు దూసుకురావడం, గట్టిగా స్లోగన్స్ చేయడం, బైకాట్ చేయడం లాంటి చర్యలతో బీఆర్ఎస్ సభ్యులు తమ అసహనాన్ని ప్రదర్శిస్తున్నారనేది అధికార పార్టీ ఆరోపణ. అసెంబ్లీలో గులాబీ గొడవను హరీశ్‌రావే లీడ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఎమ్మెల్యేగా తనకున్న సుదీర్ఘ అనుభవాన్నంతా రంగరించి.. సభను డిస్ట్రబ్ చేసేందుకు రోజుకో తరహా వ్యూహాలు అమలు చేస్తున్నారని అంటున్నారు. గత సెషన్లో అసెంబ్లీ కెమెరాల సాక్షిగా ఆయన చేసిన రచ్చ ఇప్పటికీ గుర్తు చేస్తున్నారు.


హరీశ్‌రావు అంత రచ్చ ఎందుకు చేస్తున్నారు?

ఆ రోజు సభలో నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు బీఆర్ఎస్ సభ్యులంతా. అందులో సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు కూడా ఉన్నారు. సడెన్‌గా ఉన్నట్టుండి.. తన ముందు ఉన్న ఎమ్మెల్యేలను గట్టిగా తోసుకుంటూ స్పీకర్ పోడియం ముందుకు దూసుకొచ్చారు హరీశ్‌రావు. ఆయన వెటే మిగతా సభ్యులూ పోడియంను చుట్టుముట్టారు. ఆనాడే హరీశ్ తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇదేనా సీనియర్ సభ్యుడు ప్రవర్తించే తీరు అంటూ తప్పుబట్టారు. అయినా, హరీశ్‌రావు తీరు మారినట్టు లేదు. తాజాగా జరుగుతున్న బడ్జెట్ సెషన్‌లోనూ పర్మిషన్ లేకుండా.. సభలో వీడియోలు, ఫోటోలు తీస్తున్నారు హరీశ్‌రావు. వాటిని తమకు అనుకూలంగా ఉండేలా మీడియాకు, సోషల్ మీడియాకు వదులుతున్నారని కాంగ్రెస్ మండిపడుతోంది.

హరీశ్‌రావు తీరుపై శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌కు ఫిర్యాదు చేశారు ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌. అనుమతి లేకుండా అసెంబ్లీలో హరీశ్ రావు వీడియోలు, ఫోటోలు తీశారని కంప్లైంట్‌ చేశారు. అసెంబ్లీ రూల్స్ ప్రకారం హరీశ్‌రావుపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వీడియో రికార్డులు పరిశీలించి సరైన నిర్ణయం తీసుకునేందుకు స్పీకర్ సిద్ధమవుతున్నారు.

Also Read : డేంజర్‌లో  ఉన్నాం.. సీఎం రేవంత్ హెచ్చరిక 

అసెంబ్లీలో స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. స్పీకర్ ఈజ్ బాస్. ఆయనే సుప్రీమ్. సభ నియమ, నిబంధనలకు ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందే. స్పీకర్ పోడియం దగ్గరకు దూసుకు రావడం నేరం. సభలో పేపర్లు చింపి విసిరేయడం నిషేధం. అలాగే, సెల్‌ఫోన్లో సభా కార్యక్రమాలు రికార్డు చేయడం, వీడియోలు, ఫోటోలు తీయడానికి కూడా అనుమతి లేదు. హరీశ్‌రావు మాత్రం చాటుగా మొబైల్‌లో ఇన్‌హౌజ్ ఫోటోస్, వీడియోస్ తీస్తున్నారని కాంగ్రెస్ సభ్యుల ఆరోపణ. అదే నిజమైతే ఇది పెద్ద తప్పే. స్పీకర్ ఎంక్వైరీలో నిజమని తేలితే.. హరీశ్‌రావుపై కఠిన చర్యలే తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి.

అయినా, అయ్యా హరీశ్‌రావు.. అసెంబ్లీలో మీకు కావాల్సినంత టైమ్ ఇస్తున్నారు.. మాట్లాడినంత సేపు మైక్ ఇస్తున్నారు.. మీ అన్ని ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానాలు ఇస్తోంది.. మళ్లీ ఈ వీడియోలు, ఫోటోలు తీయడం ఏంటయ్యా? అలా చేయొద్దని సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేకు తెలీదా? బావమరిదిని బీట్ చేసి.. మామ మెప్పు పొందాలని కాకపోతే.. అసెంబ్లీలో ఈ పనులేంటి హరీశ్?.. అంటూ కాంగ్రెస్ నేతలు మర్యాదగానే ప్రశ్నిస్తున్నారు.

Related News

HYDRA Marshals strike: వెనక్కి తగ్గిన హైడ్రా మార్షల్స్.. విధులకు హాజరు.. ఆ హామీ నెరవేర్చకపోతే రాజీనామాలే!

Hydra Marshals: హైడ్రాకు షాక్‌ మార్షల్స్‌, సేవలను నిలిపివేత, అసలేం జరిగింది?

Metro Parking System: గుడ్ న్యూస్.. మెట్రో సరికొత్త పార్కింగ్ సిస్టమ్ సిద్ధం, మనుషులతో పనేలేదు!

Hyderabad News: జీహెచ్ఎంసీ నిఘా.. ఆ పని చేస్తే బుక్కయినట్టే, అసలు మేటరేంటి?

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Big Stories

×