BigTV English
Advertisement

Eating food in Kansa: మెగా ఫ్యామిలీ అంతా కంచు కంచాల్లోనే తింటారు.. దీని వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా?

Eating food in Kansa: మెగా ఫ్యామిలీ అంతా కంచు కంచాల్లోనే తింటారు.. దీని వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు కిచెన్ లో చేసే ప్రయోగాల గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి అమ్మ అంజనాదేవి నుంచి భార్య సురేఖ, కోడలు ఉపాసన వరకు అందరూ వంటలు చేయడంలో నిపుణులే. రీసెంట్ ఉపాసన ‘అత్తమ్మాస్ కిచెన్’ అంటూ ఇంటి ఫుడ్స్ ను బిజినెస్ కూడా మొదలు పెట్టేసింది. తాజాగా ఇంట్లో కుటుంబ సభ్యులు డైనింగ్ హాల్ లో ఉన్న ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో డైనింగ్ టేబుల్ మీద అన్నీ కంచు పాత్రలు కనిపించాయి. ఇంతకీ.. కంచు పాత్రలలో తినడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. కంచు పాత్రలతో బోలెడు లాభాలు


ఈ రోజుల్లో చాలా మంది ఆరోగ్యం మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. పోషకాహారం నుంచి ఆ ఆహారం తీసుకునే పాత్రల వరకు ఎంతో జాగ్రత్త పడుతున్నారు. పాత కాలంలో మట్టి, రాగి, ఇత్తడి పాత్రలను వంటలు చేయడానికి, చేసిన వంటలను తినడానికి ఉపయోగించే వారు. అందుకే, అప్పట్లో జనాలు చాలా ఆరోగ్యంగా ఉండేవారు. కానీ, ఇప్పుడు, ప్లాస్టిక్, స్టీల్ పాత్రల వినియోగం పెరిగిన నేపథ్యంలో ఆరోగ్యం కూడా బలహీనపడుతోంది. నిజానికి వంట చేయడానికి ఉపయోగించే పాత్రలు ఆరోగ్యాన్ని కాపాడటంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఆహారం వండే విషయంలో మట్టి పాత్రలు నూటికి నూరుపాళ్లు మంచివి. వీటిలో వంట చేయడం వల్ల పూర్తి స్థాయిలో పోషకాలు లభిస్తాయి. ఆ తర్వాత స్థానంలో కంచు పాత్రలు ఉన్నాయి. వీటిలో ఆహారం తయారు చేయడం వల్ల 97 శాతం వరకు పోషకాలు అందుతాయి. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ రెండు రకాల పాత్రలు వాడటం మంచిదంటున్నారు నిపుణులు.

ఉష్ణోగ్రత నియంత్రణ


కంచు పాత్రలకు వేడిని నియంత్రించే లక్షణం ఉంటుంది. ఆహారం ఎక్కువ సేపు సరైన ఉష్ణోగ్రత దగ్గర ఉండేలా చేస్తుంది. నెమ్మదిగా ఆహారాన్ని తింటున్నప్పటికీ వేడి అలాగే ఉంటుంది. ఆహారం ప్లేట్ లో పెట్టిన దగ్గరి నుంచి పూర్తయ్యే వరకు టెంపరేచర్ మెయింటెనెన్స్ అవుతుంది.

యాంటీ బాక్టీరియల్ గుణం

కంచు పాత్రల్లో రాగి పెద్ద మొత్తంలో ఉంటుంది. ఆహారాన్ని తయారు చేసే సమయంలో కొంత మొత్తంలో రాగి ఆహారంలో కలుస్తుంది. రాగి చక్కటి యాంటీ మైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ప్లేట్ లోని బ్యాక్టీరియా లాంటి సూక్ష్మక్రిములను నాశనం చేస్తుంది. ఆరోగ్యకరమైన భోజనాన్ని అందిస్తుంది.

చక్కటి రుచి

కంచు పాత్ర, ఆహారం పరస్పర చర్యకు కారణం అవుతుంది. ఆహారం రుచిని పెంపొందించడంలో సాయపడుతుంది. రుచితో పాటు గ్యాస్ సంబంధ సమస్యలు రాకుండా గ్యాస్ట్రోనమిక్ గుణాన్ని కలిగి ఉంటుంది.

రక్తశుద్ధి

కంచులోని ఆల్కలీన్ మెటల్ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కంచుపాత్రలో ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరగడంతో పాటు శరీరానికి గ్లో వస్తుంది. యాసిడ్ కంటెంట్ ను తగ్గించి గ్యాస్ సంబంధ సమస్యలను కంట్రోల్ చేస్తుంది.

మన్నిక చాలా ఎక్కువ

కంచు పాత్రలు చాలా కాలం పాటు చెక్కు చెదరకుండా ఉంటుంది. స్టీల్, అల్యూమినియం పాత్రలతో పోల్చితే చాలా కాలం మన్నిక ఉంటుంది.  కంచు పాత్రలు చూడ్డానికి కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

Read Also: సిమెంట్ వాడకుండానే ఇల్లు కట్టేశారు.. ఎలాగో తెలిస్తే దిమ్మతిరుగుద్ది!

Related News

Masala Vada: బండి మీద దొరికే మసాలా వడ.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్ట్ !

Hot Water: ఈ సమస్యలున్న వారికి వేడినీళ్లు హానికరం.. పొరపాటున కూడా తాగొద్దు!

Tomato Egg Curry: టమాటో ఎగ్ కర్రీ.. ఈ అద్భుతమైన రుచికి ఎవ్వరైనా అబ్బా అనాల్సిందే !

Glass Objects: ఇంట్లో గాజు వస్తువులు పగిలితే.. శుభమా ? అశుభమా ?

Radish in Winter: శీతాకాలంలో ముల్లంగి తినడం వల్ల ఏమవుతుందో తెలిస్తే షాక్ అవుతారు

Nonveg: చికెన్, మటన్ కర్రీ వండే ముందు వాటిని పెరుగు లేదా నిమ్మకాయతో మ్యారినేట్ చేస్తారెందుకు?

Worshipping God: నిద్రలేవగానే కరదర్శనం.. సానుకూల శక్తితో రోజును ప్రారంభించడానికి పునాది!

Tattoo: పచ్చబొట్లు తెగ వేసుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తప్పనిసరిగా తెలిసుండాలి!

Big Stories

×