Jayammu Nischayammuraa: టాలీవుడ్ స్టార్ హీరో జగపతిబాబు (Jagapathi Babu)హోస్ట్ గా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్ము (Jayyammu Nischayammuraa) కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ లభిస్తుంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు హాజరవ్వడం జరుగుతుంది. ఇప్పటికే ఈ కార్యక్రమం పలు ఎపిసోడ్లను పూర్తి చేసుకొని మంచి ఆదరణ రాబట్టింది. తాజాగా ఈ కార్యక్రమంలో భాగంగా యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నాగ చైతన్యకి సంబంధించిన ఎన్నో విషయాలను జగపతిబాబు బయట పెట్టడంతో ఒకసారిగా నాగచైతన్య షాక్ అయ్యారు. స్కూల్ లో తాను చాక్లెట్ బాయ్ కానీ అంటూ మాట్లాడటంతో వెంటనే జగపతిబాబు రానా (Rana)నిన్ను చెడగొట్టాడా అంటూ ప్రశ్నించడంతో వెంటనే చైతూ పాపం అంటూ మాట్లాడారు. చిన్నప్పటినుంచి నీకు కాస్త సిగ్గు ఎక్కువే కదా అంటూ జగపతిబాబు మాట్లాడటంతో తనకు ఎవరైనా ఒకసారి మంచిగా పరిచయమైన తర్వాత నాలో ఉన్న మరో సైడ్ పరిచయం చేస్తానని తెలిపారు. మరి ఆ సైడ్ ఏంటో మాకు చెప్పవా అంటూ జగపతి బాబు అడుగుతూ ఒక నెంబర్ చెబుతూ ఏమైనా గుర్తొస్తుందా అంటూ ప్రశ్నించారు.
ఇక ఈ తేదీలు వినగానే నాగచైతన్య ఏదైనా ఇంపార్టెంట్ డేట్స్ నా ఇప్పుడే చెప్పేయండి అంటూ అడిగారు. అమ్మాయి నంబరా అంటూ చైతు ప్రశ్నించడంతో మిస్ అయ్యావా? అంటూ జగపతిబాబు అడిగారు ఏం మిస్ కాలేదు అంటూ చైతు సమాధానం ఇచ్చారు. నువ్వేమీ అటెంప్ట్ చేయకుండానే అమ్మాయిలందరూ నీ వెంట పడి పడి దొర్లుతారా… మీ నాన్న అయినా దొరుకుతాడు కానీ నువ్వు ఎక్కడ దొరకవు కదా అంటూ జగపతిబాబు నాగచైతన్య విషయంలో అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఈ సందర్భంగా బయటపెట్టారు. మరి ఈ కార్యక్రమంలో భాగంగా వీరిద్దరి మధ్య ఎలాంటి విషయాలు ప్రస్తావనకు వచ్చాయనేది తెలియాల్సి ఉంది.
?igsh=MTR1OXp5Mndha3g0dA%3D%3D
ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ఆదివారం సాయంత్రం జీ తెలుగులో ప్రసారం కానుంది. ఇక నాగచైతన్య కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నారు. నాగచైతన్య ఇటీవల తండేల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు . ఇక సినిమా సక్సెస్ కావడంతో వరుస ప్రాజెక్టులను లైన్ లో పెట్టి కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక చైతూ వ్యక్తిగత జీవితం అందరికీ తెలిసిందే. చైతన్య మొదట సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే సమంత(Samantha) నుంచి విడాకులు తీసుకుని విడిపోయిన తర్వాత ఈయన తిరిగి మరొక నటి శోభిత(Sobhita)ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన వృత్తిపరమైన జీవితంలోనూ వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు.
Also Read: Chiranjeevi: చిరంజీవిపై బాలయ్య వ్యాఖ్యలు.. చిరంజీవి బ్లడ్ బ్యాంకులో ఆందోళనలు!