BigTV English

High Court Cancelled AP Group-1 Mains: గ్రూప్-1 మెయిన్స్ రద్దు చేసిన హైకోర్టు.. సుప్రీంకు వెళ్తామన్న ప్రభుత్వం

High Court Cancelled AP Group-1 Mains: గ్రూప్-1 మెయిన్స్ రద్దు చేసిన హైకోర్టు.. సుప్రీంకు వెళ్తామన్న ప్రభుత్వం

ap group 1 latest news


AP High Court on 2018 Group-1 Main Exam: 2018 గ్రూప్-1 మొయిన్స్‌ పరీక్షపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. గతంలో జరిగిన మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మళ్లీ మెయిన్స్ పరీక్షను నిర్వహించాలని ఏపీపీఎస్సీని ఆదేశించింది.

మెయిన్స్ ఆన్సర్ షీట్స్‌ను పలుసార్లు మూల్యాంకనం చేయడం చట్టవిరుద్ధమని ఏపీ హైకోర్టు పేర్కొంది. ఇక మెయిన్స్‌లో ఎంపికైన అభ్యర్ధుల లిస్ట్‌ను రద్దు చేస్తూ మళ్లీ పరీక్ష పెట్టాలని ఆదేశించింది. ఆరు వారాల్లోగా ఎంపిక చేయాలని తెలిపింది.


కాగా.. గ్రూప్ -1 మెయిన్స్ రద్దుపై ప్రభుత్వం స్పందించింది. అభ్యర్థులు ఆందోళన చెందవద్దని సూచించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టులో అప్పీల్ కు వెళ్లనున్నట్లు ప్రకటించింది. అభ్యర్థుల ఎంపిక పూర్తయి విధుల్లో ఉన్న అభ్యర్థుల తరఫున న్యాయపోరాటం చేస్తామని తెలిపింది.

Also Read: రౌడీ చేతిలో భీమవరం బందీ.. వైసీపీ ఎమ్మెల్యేను ఓడించాలని పవన్ కల్యాణ్ పిలుపు..

గ్రూప్-1 మెయిన్స్ ఆన్సర్ షీట్స్ ను రెండుసార్లు వాల్యూయేషన్ చేశారని కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో.. వారి వాదనలు విని దానిపై విచారణ చేసిన న్యాయస్థానం పరీక్షను రద్దు చేసింది. దాంతో అభ్యర్థులు.. తామెన్నాళ్లుగానో కష్టపడి చదివి రాసిన పరీక్షను రద్దు చేయడం పై ఆందోళన చెందుతున్నారు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×